ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రయాణానికి మరోసారి అంతరాయం కలిగింది. నాసిక్ నుంచి శనివారం ఆయన ఔరంగాబాద్‌కు హెలికాప్టర్‌లో వెళ్తుండగా పరిమితికి మించి మనుషులు ఎక్కడంతో టేకాఫ్ తీసుకోగానే మళ్లీ కిందకు తీసుకొచ్చి ఒకరిని దింపేశారు. హెలికాప్టర్‌ను ఎందుకు కిందకు దింపారో పోలీసులు చెప్పనప్పటికీ...ఒక మనిషిని, కొంత సామగ్రిని దించేయడాన్ని బట్టి చూస్తుంటే పరిమితికి మించిన బరువు హెలికాప్టర్‌లో ఉన్నందునే ఇలా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ‘హెలికాప్టర్ నిర్దేశిత ఎత్తుకు ఎగరలేకపోవడంతో కొంత లగేజిని దించేశాం. సీఎం పర్యటనకు ఇబ్బంది లేదు’ అని ఒక అధికారి చెప్పారు.∙మే నెలలో రెండుసార్లు, జూలైలో ఒకసారి ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు వివిధ కారణాలతో స్వల్ప ప్రమాదాలకు గురైనా ఆయన క్షేమంగా బయటపడ్డారు .
Comments
Please login to add a commentAdd a comment