ఆకాశంలో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను మనమంతా చూసేవుంటాం. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే అవసరం అవుతుంది. హెలికాప్టర్లు ఎక్కడైనా ల్యాండ్ అవుతాయి.అయితే హెలికాప్టర్ ఆగేందుకు నిర్దేశిత ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.ఇది వృత్తాకారంలో కనిపిస్తుంది. దీనిలోపలనే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అయితే ఈ వృత్తాకారం లోపల ఇంగ్లీషు బాషలోని హెచ్ అక్షరం రాసివుంటుంది. ఇలా ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోని అన్ని దేశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేప్రాంతంలో హెచ్ అని రాసివుంటుంది. హెలికాప్టర్లను వీవీఐపీలు వినియోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. హెలికాప్టర్ల వినియోగానికి సంబంధించి పలు దేశాల్లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఒక్కోసారి హెలిప్యాడ్‌లను తయారు చేస్తుంటారు. దీనిలో రూపొందించే హెచ్ ఆకారం హెలికాప్టర్ నడిపే పైలెట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
దీని కారణంగానే హెలికాప్టర్ ముందుభాగం, వెనుకభాగం ఎటువైపు ఉంచాలనేది పైలెట్‌కు తెలుస్తుంది. దీనిని తగిన రీతిలో నిలిపివుంచడం వలన హెలికాప్టర్‌లో ప్రయాణించేవారికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. సాధారణంగా వీవీఐపీ కేటగిరీలోకి వచ్చేవారు ఎంతో బిజీగా ఉంటారు. వీరి సమయం వృథాకాకుండా ఉండేందుకు కూడా హెలిప్యాడ్ రూపకల్పన ఉపకరిస్తుంది.
చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే...
Comments
Please login to add a commentAdd a comment