‘నైనిటాల్‌’లో పెరిగిన రెడ్ పాండా జనాభా | Red Panda Liked Weather of Nainital Population Increased | Sakshi
Sakshi News home page

Nainital: ‘నైనిటాల్‌’లో పెరిగిన రెడ్ పాండా జనాభా

Published Sat, Feb 24 2024 12:20 PM | Last Updated on Sat, Feb 24 2024 12:42 PM

Red Panda Liked Weather of Nainital Population Increased - Sakshi

ఉత్తరాఖండ్‌లో సరస్సుల నగరంగా నైనిటాల్‌ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్  జూ పార్కు .. రెడ్‌ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్‌ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్‌లో రెడ్‌ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్‌ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్‌ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్‌ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు  రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. 

నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్‌ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. 

నైనిటాల్‌ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement