నైనిటాల్/లక్నో: ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పెళ్లి బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 16 మంది మృత్యువాత పడ్డారు. కలదుంగి పట్టణ సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా బరపత్తర్ ప్రాంతంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని చెప్పారు. ఇరుకైన రహదారిలో ఒక మలుపు దగ్గర డ్రైవర్ స్టీరింగ్‌పై అదుపు కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయింది. మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహ జిల్లా మెరాసరే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
నైనిటాల్ బస్సు ప్రమాదంలో 16 మంది మృతి
Published Tue, Oct 22 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement