వాళ్లు ఏదో చేస్తున్నారంటూ...దాడి | youth attacks couple in uttarakhand, police case filed | Sakshi
Sakshi News home page

వాళ్లు ఏదో చేస్తున్నారంటూ...దాడి

Published Fri, Aug 7 2015 3:13 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

వాళ్లు ఏదో చేస్తున్నారంటూ...దాడి - Sakshi

వాళ్లు ఏదో చేస్తున్నారంటూ...దాడి

నైనిటాల్: అమ్మాయి-అబ్బాయి కలిసి తిరగటమే పెద్ద నేరంగా మారిపోతుంది. రోడ్డు మీద, రోడ్డు పక్క... చివరకు గుడికి వెళ్తేకూడా తప్పుగా భావిస్తున్నారు కొందరు వ్యక్తులు. వంకరగా ఆలోచించే వాడికి అన్నీ వంకర ఆలోచనలే అన్నట్లుగా వ్వవహరించారు ఉత్తరాఖండ్‌లోని కొందరు. నైనిటాల్‌ సమీపంలోని రాంనగర్‌కు చెందిన బావ-మరదలు.... నది ఒడ్డున వున్న గుడికి వెళ్లారు. అలా... పిల్ల గాలులు పీల్చుకునేందుకు వారిద్దరూ నది ఒడ్డున కూర్చున్నారు. దీంతో.. వాళ్లు ఏదో చేస్తున్నారంటూ... నది ఒడ్డున వున్నవాళ్లు భావించారు. వాళ్ల దగ్గరకు వచ్చి.. ఇక్కడేమి చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కనీసం వారిద్దరూ చెప్పేది కూడా వినకుండా... యువకుడితో గొడవకు దిగారు. ఆ తరువాత.. పిడిగుద్దులు గుద్దారు.


అతను మా బావ అని యువతి చెబుతున్నా... పట్టించుకోలేదు ఆకతాయిలు.  తన బావను.. ఏమీ అనవద్దని ఆమె బతిమాలినా...ఇదేమి పట్టించుకోని యువకులు.... ఇద్దరిని చితకబాదారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఓ దశలో ఆమెను అడవిలోకి లాక్కెళ్లటానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఇద్దరు... సమీపంలోని గర్జియా పోలీస్‌ స్టేషన్‌లో తలదాచుకున్నారు. జరిగిన విషయం చెప్పటంతో పోలీసులు ఆకతాయిలను అరెస్ట్‌ చేసి.. కేసు నమోదు చేశారు. అయితే పోకిరీల దెబ్బలకు భయపడిన యువకుడు... ఘటన తరువాత కన్పించకుండా పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement