భువనేశ్వర్: ఆటబొమ్మలో నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పూరీ జిల్లా సత్యబాది గ్రామంలో చోటుచేసుకుంది. పెరటి తోటలో వింత శబ్దం రావడంతో వెళ్లిన యజమాని ప్లాస్టిక్ ఆటబొమ్మను పరిశీలించగా నాగు పాము ఉన్నట్లు గుర్తించాడు.
వెంటనే స్నేక్ హెల్ప్ లైనుకు సమాచారం అందించడంతో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజబండ్రీ అధ్యాపకుడు డాక్టరు ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స పరికరాలతో చేరుకుని పాముని విడుదల చేశారు. సుమారు 10 రోజులుగా ఆహారం లేక నీరసించిన పాము వైద్య సంరక్షణలో పూర్తిగా కోలుకున్నాక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment