![Viral Tiktok Video Man Stunts With Long KIng Cobra - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/22/35.jpg.webp?itok=eOaJQOWJ)
టిక్‌టాక్‌లో పాపులర్ కావడానికి పిచ్చి పిచ్చి ఫీట్లతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నవారి ఘటనలు చూస్తూనే ఉన్నాం. రైలుకు ఎదురెళ్లి కొందరు, చెరువు కుంటల్లో టిక్‌టాక్ చేసి కొందరు లైవ్‌లోనే బలయ్యారు. అయితే, పాములు పట్టడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ యువకుడు మాత్రం.. 10 అడుగుల కింగ్ కోబ్రా (నల్ల తాచు)ను ఆడించి ఔరా అనిపించాడు. భారీ పాముతో విన్యాసాలు చేసిన అతని టిక్‌టాక్ వీడియో వైరల్ అయింది. కాగా, నల్లతాచు అత్యంత విషపూరిత సర్పమని, నిపుణుల పర్యవేక్షణలోనే ఈ విన్యాసాన్ని చేయాలని ఆ యువకుడు విజ్ఞప్తి చేశాడు. ఎన్నోరోజుల శ్రమ ఫలితంగానే తాను స్నేక్ స్నాచింగ్‌లో రాణిస్తున్నానని తెలిపాడు. పాపులర్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా అని కొందరు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: టిక్ టాక్ మోజులో ఐదుగురు యువకుల అదృశ్యం)
Comments
Please login to add a commentAdd a comment