బ్యాంకాక్‌కు చెందిన పామును నీయా–2 చిత్రంలో నటింపజేసినట్లు చిత్ర దర్శకుడు ఎల్.సురేశ్ తెలిపారు. జంబూ సినిమాస్ పతాకంపై ఏ.శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం నీయా–2. నటుడు జై హీరోగా నటించిన ఇందులో రాయ్ లక్ష్మి, వరలక్ష్మీశరత్‌కుమార్, క్యాథిరిన్ ట్రెసా హీరో యిన్లుగా నటించారు. ప్రియదర్శిని, బాలశరవణన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని షబ్బీర్, ఛాయాగ్రహణం రాజవేల్ మోహన్ అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కా ర్యక్రమంలో పాల్గొన్న నటి రాయ్‌లక్ష్మి మాట్లాడుతూ తాను రెండేళ్ల తరువాత తమిళంలో నటించిన చిత్రం నీయా–2 అని చెప్పింది. దర్శకుడు సురేశ్ కథ చెప్పినప్పుడు మూడు గంటల సేపు విన్న తరువాత ఇది భారీ చిత్రం లాగుందనిపించిందన్నారు.
దీంతో కాస్త ఎక్కువగానే ఆలోచించి చివరికి నటించాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పిం ది. ఇది పాము ఇతివృత్తంతో కూడిన చిత్రం అని తెలిపింది. ఇంతకు ముందు దెయ్యం ఇతివృత్తంతో కూడిన హర్రర్ కథా చిత్రాల అవకాశాలు చాలా వచ్చినా అంగీకరించలేదని, థ్రిల్లర్‌తో కూడిన ప్రేమ, పాము కథాంశంతో కూడిన నీయా–2లో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అంది. అ నంతరం చిత్ర దర్శకుడు ఎల్.సురేశ్ మాట్లాడుతూ దర్శకుడు బాలుమహేంద్ర వద్ద తానూ, వెట్రిమారన్ సహాయ దర్శకులుగా పని చేశామని తెలిపారు. తాను తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం తమిళంలో ఎత్తన్ పేరుతో రీమేక్ అయ్యిందని తెలిపారు. ఈ చిత్ర నిర్మాత పాము ఇతివృత్తంతో చిత్రం చేద్దాం అని అన్నప్పుడు పాముతో ఎలాంటి కథ చేయాలని ఆలోచిస్తుండగా టీవీలో నందిని సీరియల్ చూశానన్నారు. అది మంచి ప్రేక్షకాదరణను పొందడంతో ఈ నీయా–2 కథను రెడీ చేశానని చెప్పారు.
అయితే ఇందులో రాజనాగం (పాము)ను నటింపజేయాలని భావించామన్నారు. అందుకోసం ఆ పాము గురించి తెలుసుకోవడానికి బ్యాంకాక్ వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఒక ఇంట్లో రాజనాగంను పెంచుతుండడం చూశానన్నారు. అలా ఈ చిత్రంలో నిజ నాగపామునే నటింపజేశామని చెప్పారు. తమ చిత్రానికి విలన్ వర్షమేనని అన్నారు. దీంతో చాలా శ్రమించి చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు చాలా కఠినమైన పాత్రను ఇచ్చామని, ఆమె అద్భుతంగా నటించారని అన్నారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. నీయా–2 భారీ చిత్రంగా అమరడానికి నటుడు జై, వరలక్ష్మీశరత్‌కుమార్, రాయ్‌లక్ష్మి, క్యాథరిన్‌ట్రెసా వంటి నటీనటులను నిర్మాత అందించడమేనని అన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు వెట్రిమారన్ అతిథిగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment