డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కత్తగోడెం రైల్వే స్టేషన్‌లో ఓ నల్లత్రాచు పాము కలకలం సృష్టించింది. 10 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా(నల్లత్రాచు)ను అటవి అధికారులు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఉత్తరాఖండ్ ‘కత్తగోడెం రైల్వే స్టేషన్‌లో రైలు కింది భాగంలో చుట్టలుగా చుట్టుకుని ఉన్న నల్లత్రాచు పామును చూసి ప్రయాణికులంతా బెంబెలేత్తిపోయారు. దీంతో రైల్వే అధికారుల ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పామును పట్టుకుని అడవిలో వదిలి పెట్టిన వీడియోను ధఖ్తే అనే ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 28 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 వేలకు పైగా వ్యూస్ రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును పట్టుకున్న ఆటవీ అధికారులను నెటిజన్లంతా అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్లున్నారు.
ఇక ‘కత్తగోడెం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు కింది భాగంలో నల్లత్రాచును గుర్తించిన అధికారులు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు, అటవీ అధికారులు కలిసి ప్రయాణికులను అప్రమత్తం చేసి పామును సునాయాసంగా పట్టుకున్న అటవీ అధికారులు దానిని అడవిలో వదిలిపెట్టారంటూ’ ధఖ్తే తన ఇన్‌స్టా పోస్టులో రాసుకోచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment