సాధారణంగా మనం సడెన్‌గా పామును చూడగానే ఒక్కసారిగా షాకై.. భయంతో దూరంగా పరుగుతీస్తాము. ఈ క్రమంలో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా మన దుప్పట్లోనే ఉంటే.. ఇకేంముంది దాదాపు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అనుకుంటారు కదా. పాపం ఓ యువకుడికి ఇలాంటి ఘటనే ఎదురైంది.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సిరోజం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి వేళ తన రూమ్‌లోకి వెళ్లి నిద్రపోవడానికి రెడీ అయ్యాడు. కింద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. ఇంతలో ఓ నాగుపాము.. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. అతడి దుప్పట్లో దూరిపోయింది. కానీ, అతడిని మాత్రం కాటు వేయలేదు. అలా రాత్రంతా దుప్పట్లోనే ఉండిపోయింది.
తీరా.. మరుసటి రోజు ఉదయం సదరు యువకుడికి మెలకువ వచ్చింది. బుసలు కొడుతున్న శబ్దం వినిపించడంతో ఎంటబ్బా అని నిద్రలోనే ఒక్కసారిగా అటువైపు తిరిగిచూశాడు. పడగవిప్పిన నాగుపాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. సడెన్ షాక్ నుంచి వెంటనే తేరుకుని పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో, అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ దుప్పట్లో దూరిన నాగుపామును పట్టేశాడు.
Comments
Please login to add a commentAdd a comment