హైస్పీడ్‌లో రయ్‌మని చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్‌ | Priavte Travels Bus Falls Into Water In Madhya Pradesh, Six Passengers Were Seriously Injured In The Accident - Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌లో రయ్‌మని చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్‌

Published Fri, Sep 29 2023 4:33 PM | Last Updated on Fri, Sep 29 2023 5:43 PM

Priavte Travels Bus Falls Into Water In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది  ఈ ఘటనలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 25 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఈ క్రమంలో అతి వేగంతో ఉన్న బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెరువులోకి దూసుకెళ్లింది. ఇక, ఈ ఘటనను బస్సు వెనకాలే ఉన్న ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు తెలిపారు. అయితే, బస్సు చెరువులో పడిపోయిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. దీంతో, ప్రాణ నష్టం తప్పింది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement