
బెంగళూరు: ఇదేదో సినిమా కోసం ఇచ్చిన పోజు కాదు. ముమ్మాటికి వాస్తవ సంఘటనే. భారీ సర్పాన్ని అలవోకగా ఎత్తిపట్టుకున్న ఈ యువకుడు ఏ సినిమా హీరోగా తక్కువ కాడనే చెప్పాలి. గురువారం కర్ణాటకలోని కాఫీసీమ కొడగు జిల్లా మూర్నాడులో చోటుచేసుకుంది. ఒక కాఫీ తోటలోకి 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పాము చొరబడడంతో యజమాని స్థానిక పాముల నిపుణుడు సూర్యకీర్తికి కాల్ చేశాడు. అక్కడకు చేరుకున్న సూర్యకీర్తి కొంతసేపటికే దానిని వట్టి చేతులతో పట్టుకుని చూపరుల కోసం ఇలా ఆడించాడు. తరువాత సమీప భాగమండల అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు.
Comments
Please login to add a commentAdd a comment