
హైదరాబాద్ : కోతి, కింగ్ కోబ్రాల పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్ అధికారి తన ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో చాలా ఉత్కంఠగా ఉందని, శ్వాస కూడా తీసుకోకుండా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఇక కోతి, కింగ్ కోబ్రా పోరులో అంతిమంగా కోతే గెలిచిందని, అంతేకాకుండా అద్భుత పోరాట స్పూర్థిని ప్రదర్శించిందని సుశాంత నంద ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అడవిలో కోతి, కింగ్ కోబ్రాలు ఎదురెదురుపడ్డాయి. ఈ క్రమంలో పాము పడగెత్తి, కసిగా బుసలు కొడుతుంటే తొలుత కోతి భయపడుతూనే ఎదురుదాడి చేసింది. అనంతరం ఒక్కసారిగా రెచ్చిపోయిన కోతి పాము తలను కొరకడానికి ప్రయత్నించింది. కోతి అసాధారణ పోరాటానికి కింగ్ కోబ్రా తోక ముడుచుకొని వెళ్లిపోయింది. థ్రిల్లింగ్ యాక్షన్ ఫైట్‌కు సంబంధించిన ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి పోరాటానికి ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment