కింగ్ కోబ్రా పాముతో స్నేక్ నరేశ్ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: కాఫీనాడు చిక్కమగళూరులో వందలాది పాములను పట్టుకుని ప్రజలకు సహాయకారిగా ఉండే స్నేక్ నరేశ్ (55) చివరికి పాము కాటుకే మరణించాడు. చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా స్నేక్ నరేశ్‌గా పేరు గడించారు. ప్రత్యేకించి భారీ సైజులో ఉండే కింగ్ కోబ్రాలను ఆయన అలవోకగా పట్టుకుని బంధించేవాడు.
వృత్తిపరంగా టైలర్ అయినప్పటికీ పాములను పట్టుకోవడంలో నేర్పరి అయ్యాడు. 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. జిల్లావ్యాప్తంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాముల సంరక్షణపై అవగాహన కల్పించేవాడు. పాములు మన స్నేహితులని, వాటిని చంపరాదని బోధించేవాడు.
ఏం జరిగిందంటే
కొద్దిరోజుల క్రితం చిక్కమగళూరులో హౌసింగ్ బోర్డులో ఒక నాగుపామును పట్టుకుని స్కూటీ వాహనంలో పెట్టి మరో పామును పట్టుకునేందుకు వెళ్లాడు. ఈ సమయంలో స్కూటీ సీటు తెరిచి పామును సంచి లోపలికి వేస్తుండగా చేతిపై నాగుపాము కాటు వేసింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. అయితే పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూశాడు.
Comments
Please login to add a commentAdd a comment