కర్ణాటక: పాము పగ 12 ఏళ్లు అనే నానుడి ఉంది, అది నిజమో, అబద్ధమో తెలియదు కానీ ఒక సర్పం బాలున్ని పదే పదే కాటేస్తూనే ఉంది. వివరాలు.. కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుమారు మూడు నెలల వ్యవధిలో 9 సార్లు కాటు వేసిందంటే అశ్చర్యం కలగకమానదు. జూలై 3న మొదటిసారిగా బాలున్ని నాగుపాము కాటు వేయడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందించారు.
ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన మూడు రోజులకే మళ్లీ పాము కరిచింది. ఇలా తొమ్మిదిసార్లు కాటు వేయగా ఆరుసార్లు ఆస్పత్రిలోను, మూడుసార్లు నాటు ఔషధంతో చికిత్సలు చేయించారు. చివరకు కుటుంబసభ్యులు పాముకు భయపడి సొంతూరు హలకర్ణి గ్రామం వదిలి వాడి అనే ఊరుకు వలసపోయారు. అక్కడ కూడా బాలున్ని పాము కాటు వేసింది. అయితే కరిచిన పాము తల్లిదండ్రులకు గానీ, స్థానికులకు గానీ కనిపించడం లేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment