నాలుగుసార్లు పాము కాటు వామ్మో.. చితిపై లేచి కూర్చున్నాడు! | - | Sakshi
Sakshi News home page

నాలుగుసార్లు పాము కాటు వామ్మో.. చితిపై లేచి కూర్చున్నాడు!

Jul 2 2023 6:24 AM | Updated on Jul 2 2023 1:26 PM

- - Sakshi

ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు లేకుండా పామును పట్టేశాడు. అనంతరం దానిని రోడ్డుపై వదిలాడు. మళ్లీ పట్టుకునేందుకు వెళ్లగా పాము నాలుగుసార్లు కాటు వేసింది.

కర్ణాటక: పాముకాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే అతను చనిపోతాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే బాధితుడు చితిపై లేచి కూర్చున్నాడు. ఈఘటన హుబ్లీలో జరిగింది. గదగ్‌ జిల్లా నరగుంద తాలూకా హిరేకొప్ప గ్రామంలోని ఓ ఇంటిలో పాము చొరబడగా అదేగ్రామానికి చెందిన సిద్ధప్ప బళగనూరు మద్యం మత్తులో అక్కడకు వెళ్లాడు.

ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు లేకుండా పామును పట్టేశాడు. అనంతరం దానిని రోడ్డుపై వదిలాడు. మళ్లీ పట్టుకునేందుకు వెళ్లగా పాము నాలుగుసార్లు కాటు వేసింది. దీంతో అతన్ని హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు.

దీంతో సిద్ధప్ప ప్రాణాలు ఉండవని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయాలని గ్రామంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. సిద్ధప్ప చితిపై లేచి      కూర్చున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. కాగా బాధితుడికి వైద్యసేవలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement