కొండ చిలువ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. దాన్ని చూస్తేనే మనకు వణుకు పుడుతుంది. ఇక కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది ఈ రెండిటి మధ్య హోరా హోరి పోరు జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. అయితే ఇటీవలే కొండ చిలువకు నాగుపాముకు మధ్య జరిగిన భీకర పోరులో రెండు సర్పాలు మత్యుఒడికి చేరాయి.
కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ తన బలంతో నాగుపామును చుట్టి హత మారిస్తే, నాగుపాము తన చివరి క్షణాల్లో వేసిన కాటుకు కొండ చిలువ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే విషయంలో ఓ క్లారిటీ లేకపోయినా.. కచ్చితంగా ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కొండ చిలువ, నాగుపాముల భీకర పోరు
Published Thu, Feb 8 2018 11:59 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment