
మీకు పాములంటే చచ్చేంత భయమా? ఏమడుగుతున్నారండి.. పాములంటే భయపడనివారెవరన్నా ఉంటారా? ఇదేనా మీ సమాధానం.. ఐతే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.. అట్లాంటి ఇట్లాంటి పాము కాదు కింగ్ కోబ్రా..
జంతువులు మనుషులకు సహాయం చేసే వీడియోలు వందలకొద్దీ చూసుంటారు. కానీ ఈ వీడియోలో మనిషే కింగ్ కోబ్రాకి హెల్ప్ చేస్తున్నాడు. అంత కష్టమేమొచ్చిందా పాముకు..! అసలేంజరిగిందంటే.. వాతావరణం బాగా వేడిగా ఉండటంతో దాహమేసిన కోబ్రా ఒక కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఐతే ఒకతను మాత్రం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బకెట్‌తో నీళ్లు నింపి కోబ్రాకి స్నానం చేయించాడు. అంతేకాకుండా తాగడానికి నీళ్లు కూడా అందించడం ఈ వీడియోలో కన్పిస్తుంది.
ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్ల రూపంలో అతన్ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. పాముకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత యేడాది జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. మానవత్వం ఇంకా బతికేఉందని దీనిని చూసిన వారంతా అంటున్నారు. ఐతే ఇటువంటి విషపూరిత జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వ్యవహారం బెడిసికొట్టి మొదటికేమోసం వస్తుందనేది వాస్తవం. మీ అభిప్రాయమేమిటి..!!
చదవండి: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!
Comments
Please login to add a commentAdd a comment