వేగం.. సొంతం
చెట్లను అవలీలగా ఎక్కడం, పాకడంతో పాటు నీటిలో ఈదడంలో ఆరితేరిన జంతువు చీతా (చిరుత పులి). ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు ఇది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తే ఈ చిరుతలు రెండు మూడు నిమిషాల్లోనే ఆహారాన్ని వేటాడతాయి. వేటాడిన ఆహారాన్ని వెంటనే తినకుండా 15 నిమిషాల పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుని భుజిస్తాయి. చీతాలు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్తుతం ఏడు చిరుత పులులున్నాయి.
- బహదూర్‌పురా
జీవితకాలం 23 ఏళ్లు
చిరుతలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని మైదానాల్లో నివసిస్తాయి. చీతాల పొడవు 120-150 సెం.మీ. మధ్య ఉంటుంది. 50-80 కిలోల బరువుంటాయి. ఎంతో దూరాన ఉన్న జంతువులను సైతం గుర్తించి ఒడుపుగా వేటాడే సత్తా వీటి సొంతం. జీవిత కాలం 20-23 సంవత్సరాలు ఒకేసారి 15-20 కిలోల ఆహారాన్ని తీసుకుంటాయి.
మన జూలో ఏడు
జూపార్కులో సల్మాన్, సులేమాన్,సుచీ, లవ, కుశ, పూజారి,రోహన్ అనే చిరుతలు ఉన్నాయి.
రోజూ ఆరు కిలోల చికెన్
చిరుతలకు జూలో రోజూ 6-8 కేజీల మాం సాన్ని ఆహారంగా అందిస్తారు. ఇందులో 2 కేజీల చికెన్, ఒక కేజీ బీఫ్, అర లీటర్ పాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో అంది స్తారు. వీటితో పాటు విటమిన్స్‌తో కూడిన మినరల్స్‌ను నీటి ద్వారా అందిస్తారు.
మీరు చూడాలంటే..
నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ ద్వారం వద్ద నుంచి నేరుగా చిట్టి రైలు వద్దకు వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి నేరుగా వెళితే రాయల్ బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్ పక్కనే ఈ చిరుతల ఎన్‌క్లోజర్ ఉంటుంది.