ఆగ్రా: ఇదో విషాద ఘటన. ఓ నిండు గర్భిణి(26) బహిర్భుమికి వెళ్లి నొప్పులు ఎక్కువ అవ్వడంతో అక్కడే బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయింది. ఆ శిశువును ఓ అడవి జంతువు లాక్కెంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా జిల్లాలో చోటు చేసుకుంది. యూపీలోని ఫిన్ హట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జోధపురా గ్రామానికి చెందిన నెలలు నిండిన గర్భిణి శిల్పి.. ఇంటి సమీపంలోని పొలాల్లోకి బహిర్భుమికి వెళ్లింది. ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి వెతకడం మొదలు పెట్టారు. వారికి పొలాల్లో ప్రసవించి స్పృహ కోల్పోయిన మహిళను కుటుంబసభ్యులు గుర్తించారు. కానీ బిడ్డ కనిపించపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదో జంతువు పసిబిడ్డను లాక్కెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
(చదవండి : బిడ్డను విసిరి.. తనూ దూకి)
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో సగానికిపైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు శిల్పి మాట్లాడుతూ.. ‘మంగళవారం ఉదయాన్ని బహిర్భుమి కోసమని సమీప పొలాల్లోకి వెళ్లాను. ఆ సమయంలోనే తనకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో అక్కడే బిడ్డను ప్రసవించాను. తదనంతరం స్పృహ కోల్పోయాను’ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment