కుక్కల దాడిలో దుప్పి మృతి | duppi died in dogs bite | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 17 2017 4:47 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

duppi died in dogs bite

కల్లూరు: చిత్తూరుజిల్లా పులిచెర్ల(కల్లూరు) తోటలో దుప్పిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అది మృతిచెందింది. కల్లూరు ఘాట్‌ రోడ్డులో ఉన్న ఓ మామిడి తోపులో దుప్పి సంచరిస్తుండగా గుర్తించిన కుక్కలు దానిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇది గమనించిన సమీపంలోని ప్రజలు ఘాట్‌ రోడ్డులో వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వెళ్ళి జీపులో దుప్పిని తీసుకొని కల్లూరు స్టేషన్‌కు వచ్చారు. పశు వైద్యులను రప్పించి ప్రాథమిక చికిత్స చేయిస్తుండగా అది మృతిచెందింది. పీలేరు ఫారెస్టు రేంజ్‌ అధికారికి సమాచారం తెలుపగా ఆయన సమాచారం మేరకు దామల్‌చెఱువు బీట్‌ అధికారి బి. మునస్వామి నాయక్‌ వచ్చి దుప్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement