try
-
పాపం ఆ పెద్దాయన చేసింది నేరమా? నెటిజన్స్ ఫైర్
Charged with unlawfully feeding wildlife: నేరాలు సైతం విచిత్రంగా ఉండొచ్చు. వాటి గురించి విన్నప్పుడు.. అసలు అది ఒక నేరమేనా అని సందేహం కలుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాగే విచిత్రమైన ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. యూఎస్‌లోని 71 ఏళ్ల డోనాల్డ్ అంటాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొన్ని పక్షుల కోసం ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెడుతుంటాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు. పక్షుల కోసం చాలా ఆహార ట్రైలు పెడుతున్నాడు ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటి ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు మంచి చేసేవారిని అరెస్టు చేయాలనుకుంటున్నారంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్. (చదవండి: అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక) -
దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలి
ఖమ్మం: దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని ఇంటర్‌బోర్డు మాజీ కన్వీనర్ కర్నాటి రాంమోహన్‌రావు అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం విజయ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం నాయకత్వం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తే.. ఈ తరం యువత వ్యక్తి శ్రేయోవాదం వైపు పయనిస్తోందన్నారు. దేశానికి కొత్త నాయకత్వం కావాలని, నేడు దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విద్య మనచేతిలో లేకపోవడం వల్లనే విలువలు పడిపోతున్నాయన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడుతూ నేడు విద్యారంగంలో అనేక అసమానతలు ఉన్నాయన్నారు. కొఠారి కమిషన్ నివేదికను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ నాగిరెడ్డి, రవికుమార్, రామారావు, సంగమేశ్వరరావు, నర్సింహారావు, లక్ష్మీనారాయణ, ఎ.వి.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, మహేష్, వీరబాబు, యోగానందం తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు కృషి
కమిషన్ సభ్యుల ప్రమాణ æస్వీకారంలో నన్నపనేని రాజకుమారి నగరంపాలెం: స్థానిక వికాస్ నగర్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్ సభ్యులతో శనివారం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ పటిష్టత కోసం 18 మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించిందని ఆర్థిక శాఖ అనుమతి రాగానే వెంటనే నియమిస్తామని తెలిపారు. నలుగురు సభ్యులచే ప్రమాణ స్వీకారం మహిళా కమిషన్ సభ్యులుగా జూలై 12వ తేదీన మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం నియమితులైన ఆరుగురు సభ్యుల్లో డాక్టరు ఎస్ రాజ్యలక్ష్మి(వెస్ట్‌గోదావరి), తమ్మిశెట్టి రమాదేవి(ప్రకాశం), కే శ్రీవాణి(విజయనగరం), ఎన్ ప్రవీణ్బా(అనంతపురం) ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కమిషన్ డైరెక్టర్ ఆర్ సూయజ్, సెక్రటరీ నాజనీస్బాను, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ శ్రీనివాసరావు, పీడీ ఎం నిర్మల, సెక్షన్ ఆఫీసర్ యూ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
గుడుంబా రహిత రాష్ట్రంగా టీసర్కార్ అడుగులు
-
పోలీసులు నన్ను చంపడానికి ప్రయత్నించారు
న్యూఢిల్లీ : పోలీస్ శాఖను తమకు అప్పగించాలన్న ఆప్ నేత దిలీప్ పాండే... ఢిల్లీ పోలీసులు తనను అంతం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీస్ వాహనంతో ఢీకొట్టి తనను హతమార్చేందుకు పోలీసులు యత్నించినట్లు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి తాను మీడియాతో మాట్లాడుతూ ఉండగానే తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, తృటిలో తప్పించుకున్నట్లు చెప్పారు. ఇది తనను చాలా ఆశ్యర్యానికి గురిచేసిందని, పార్టీ కార్యకర్త చొరవతో అదృష్టవశాత్తూ బతికి బయటపడినట్లు దిలీప్ పాండే అన్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయాన్ని దిలీప్ పాండే తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఆయన ఆరోపణలపై సంబంధింత పోలీసులెవరూ ఇంకా స్పందించలేదు. కాగా 19 ఏళ్ల యువతి మీనాక్షి దారుణ హత్య సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారి బస్సీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నిన్న ప్రధానమంత్రికి ఓ బహిరంగ లేఖను కూడా సంధించారు. 'దయచేసి ఢిల్లీ శాంతి భద్రతల పరిరక్షణ అంశంపై వారంలో ఒక రోజు మాకోసం కేటాయించండి..లేదా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు అధికారాలను తమకు అప్పగించండి' అని ఆ లేఖ సారాంశం. మరోవైపు కేజ్రీవాల్ బహిరంగ లేఖపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆప్ సర్కార్ శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. Let me guess, Modi was driving the bus and Kejriwal pushed & saved you, hain na AAPtard @dilipkpandey? Nautanki. pic.twitter.com/Z6LO3njIaJ — गीतिका (@ggiittiikkaa) July 21, 2015