పోలీసులు నన్ను చంపడానికి ప్రయత్నించారు
న్యూఢిల్లీ : పోలీస్ శాఖను తమకు అప్పగించాలన్న ఆప్ నేత దిలీప్ పాండే... ఢిల్లీ పోలీసులు తనను అంతం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీస్ వాహనంతో ఢీకొట్టి తనను హతమార్చేందుకు పోలీసులు యత్నించినట్లు వ్యాఖ్యానించారు.
మంగళవారం రాత్రి తాను మీడియాతో మాట్లాడుతూ ఉండగానే తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, తృటిలో తప్పించుకున్నట్లు చెప్పారు. ఇది తనను చాలా ఆశ్యర్యానికి గురిచేసిందని, పార్టీ కార్యకర్త చొరవతో అదృష్టవశాత్తూ బతికి బయటపడినట్లు దిలీప్ పాండే అన్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయాన్ని దిలీప్ పాండే తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఆయన ఆరోపణలపై సంబంధింత పోలీసులెవరూ ఇంకా స్పందించలేదు.
కాగా 19 ఏళ్ల యువతి మీనాక్షి దారుణ హత్య సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారి బస్సీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నిన్న ప్రధానమంత్రికి ఓ బహిరంగ లేఖను కూడా సంధించారు.
'దయచేసి ఢిల్లీ శాంతి భద్రతల పరిరక్షణ అంశంపై వారంలో ఒక రోజు మాకోసం కేటాయించండి..లేదా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు అధికారాలను తమకు అప్పగించండి' అని ఆ లేఖ సారాంశం. మరోవైపు కేజ్రీవాల్ బహిరంగ లేఖపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆప్ సర్కార్ శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.
Let me guess, Modi was driving the bus and Kejriwal pushed & saved you, hain na AAPtard @dilipkpandey? Nautanki. pic.twitter.com/Z6LO3njIaJ
— गीतिका (@ggiittiikkaa) July 21, 2015