స్థానిక వికాస్ నగర్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్ సభ్యులతో శనివారం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు.
మహిళా సాధికారతకు కృషి
Jul 24 2016 8:44 PM | Updated on Sep 4 2017 6:04 AM
కమిషన్ సభ్యుల ప్రమాణ æస్వీకారంలో నన్నపనేని రాజకుమారి
నగరంపాలెం: స్థానిక వికాస్ నగర్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్ సభ్యులతో శనివారం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ పటిష్టత కోసం 18 మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించిందని ఆర్థిక శాఖ అనుమతి రాగానే వెంటనే నియమిస్తామని తెలిపారు.
నలుగురు సభ్యులచే ప్రమాణ స్వీకారం
మహిళా కమిషన్ సభ్యులుగా జూలై 12వ తేదీన మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం నియమితులైన ఆరుగురు సభ్యుల్లో డాక్టరు ఎస్ రాజ్యలక్ష్మి(వెస్ట్‌గోదావరి), తమ్మిశెట్టి రమాదేవి(ప్రకాశం), కే శ్రీవాణి(విజయనగరం), ఎన్ ప్రవీణ్‌బా(అనంతపురం) ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కమిషన్ డైరెక్టర్ ఆర్ సూయజ్, సెక్రటరీ నాజనీస్‌బాను, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ శ్రీనివాసరావు, పీడీ ఎం నిర్మల, సెక్షన్ ఆఫీసర్ యూ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement