empowerment
-
Kanyasulkam నాకు నచ్చిన పాత్ర మధురవాణి-ఓల్గా
ఎవరు సృష్టించిన పాత్ర వారికి నచ్చడం గురించి కాదు... కఠినమైన నిష్కర్షయిన విమర్శకుడిగా మారి చూసిన రచయితకు ముచ్చట గొలిపిన పాత్ర మధురవాణి. కన్యాశుల్కం కథానాయిక, నాయకుడు కూడా మధురవాణే. వేశ్యాకులంలో పుట్టింది. సంగీత, సాహిత్యాలలో సుశిక్షితురాలు. మంచివారి ఎడల మంచిగానూ చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లి మాటల విలువ తెలుసుకున్నది. అయితే చాలాసార్లు ముఖ్యంగా తోటి స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తన పట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగనే ఉంది. మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, ఆత్మగౌరవంతో ఉండవచ్చో మధురవాణి నుంచి మనం నేర్చుకోవచ్చు. మనస్తత్వం, చతురత, హాస్య ప్రియత్వం, కార్యసాధనా సామర్థ్యం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల దక్షత, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడనీయకుండా చేయగల నేర్పు, తనను తాను కాచుకోగల ఒడుపు. ఇంత అందంగా గొప్పగా మధురవాణిని ఎలా రూపుదిద్దగలిగాడో గురజాడ!స్నేహం, ప్రేమలకు మాటలాడటం నేర్పి మన తెలుగు వారికి మంచిచెడ్డలు తెలియచెప్పేందుకు సృష్టించిన పాత్ర మధురవాణి. భారతీయ సాహిత్యంలో కూడా మధురవాణికి సాటి వచ్చే పాత్రలు ఒకటి రెండు కంటే ఉండవు. కన్యాశుల్కం ఆచారానికి బానిసవబోతున్న సుబ్బిని బలైపోతున్న బుచ్చమ్మను మధురవాణి రక్షించడమే కన్యాశుల్కం నాటక సారాంశం. అణిచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే విముక్తి చెందగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లు కూడా తెలియని ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చమ్మకి, మీనాక్షికి సహాయం చేయాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి నిదర్శనం. అనివార్యంగా తనలో కలిగిన ఆలోచనలకు ఆచరణాత్మక రూపమే మధురవాణి. నీతి కలిగిన మనిషి. దయగలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు?మధురవాణి కాకుండా మరోపాత్ర పేరు చెప్పమంటే క్షణం ఆలోచించకుండా నేను చెప్పే మరో స్త్రీ పాత్ర ‘శాంతం’. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు ఆమె’ నవలలో కథానాయిక. ఇక కొడవటిగంటి కుటుంబరావు ‘కస్తూరి’, ‘స్వరాజ్యం’ చలం నవలా నాయికలు ... ఇలా ఎన్ని పేర్లయినా ఉంటాయి. కాని మధురవాణి మధురవాణే. -
సౌందర్య లహరి– ది స్టార్ ఇన్ యూ
పెద్ద వ్యాపార కుటుంబంలో పుట్టింది ఇమాన్ అల్లానా. కుటుంబ వ్యాపారంతో నిమిత్తం లేకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా సొంతంగా విజయం సాధించాలనేది ఆమె కల. ఆరోతరం ఎంటర్‌ప్రెన్యూర్‌గా బ్యూటీ బ్రాండ్ ‘బాలీ గ్లో’తో చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించింది 26 సంవత్సరాల ఇమాన్.‘సాధించాలనే తపన ఉంటే తెలియని దారులు కూడా పరిచయం అవుతాయి. కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. విజయాలకు దగ్గర చేస్తాయి’ అంటున్న ఇమాన్ అల్లానా గురించి...బంగారు చెంచాతో పుట్టింది ఇమాన్ అల్లానా. తల్లిదండ్రులు ఇర్ఫాన్, లుబ్నా దుబాయిలో బిలియనీర్లు. రీజెంట్స్ యూనివర్శిటీ లండన్‌లో ‘బ్రాండ్ మేనేజ్మెంట్’లో మాస్టర్స్ చేసిన ఇమాన్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనను తాను నిరూపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. స్కూలు తరువాత అమ్మానాన్నల ఆఫీసుకు వచ్చేది. అక్కడ తమ వ్యాపారానికి సంబంధించిన ఎన్నో మాటలు వినేది. ముఖ్యమైన మీటింగ్ ఉంటే బడికి బంక్ కొట్టి మరీ ఆ మీటింగ్‌లో పాల్గొనేది. మీటింగ్‌లో జరిగే చర్చలను శ్రద్ధగా వినేది... అలా వ్యాపార విషయాలపై ఇమాన్‌కు చిన్న వయసులోనే ఆసక్తి మొదలైంది.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని తపించే ఇమాన్‌కు చిన్న చిన్న ఎడ్యుకేషనల్ కోర్సులు చేయడం అంటే ఇష్టం. ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించి చిన్న కోర్సులు ఎన్నో చేసింది. ‘సొంతంగా బిజినెస్ స్టార్ చేసి రిస్క్ చేయడం ఎందుకు! మన బిజినెస్ చూసుకుంటే సరి΄ోతుంది’ అని ఇమాన్ తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని,ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారి ప్రోత్సాహ బలంతో ఆరోతరం కుటుంబ సభ్యురాలిగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది ఇమాన్.బాలీవుడ్, బ్యూటీ మేళవింపుగా వచ్చిన ‘బాలీ గ్లో’ బ్యూటీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే గుర్తింపు సాధించింది. ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు తనదైన ప్రత్యేకత చాటుకుంది. ప్రోడక్ట్‌కు సంబంధించిన ఇన్గ్రేడియెంట్స్ను ప్రపంచం నలుమూలల నుంచి సేకరిస్తారు. ఇదే సమయంలో పర్యావరణానికి హానికరమైన వాటిని దూరం పెడతారు.ప్రోడక్ట్‌కు సంబంధించి ‘ది స్టార్ ఇన్ యూ’ ట్యాగ్‌లైన్ హిట్ అయింది. ‘ఇన్నర్ హెల్త్‌కు చర్మం అద్దం పడుతుంది’ అంటున్న ఇమాన్ చర్మసౌందర్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తరచుగా చెబుతుంటుంది. వ్యాపార పనుల్లో భాగంగా లండన్–దుబాయ్–ముంబై నగరాల మధ్య తిరుగుతూ ఉంటుది ఇమాన్.ఎంటర్ప్రెన్యూర్గానే కాదు సామాజిక కార్యకర్తగా... ఇన్వెస్టర్‌గా కూడా రాణిస్తోంది. ‘ఫ్యాషన్ అనేది కళారూపం. సృజనాత్మక వ్యక్తీకరణ’ అంటున్న ఇమాన్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలకు ్రపాధాన్యత ఇస్తుంది.‘ఇప్పుడు కస్టమర్లు ప్రోడక్ట్ తళుకు బెళులు మాత్రమే చూసి ఓకే చెప్పడం లేదు. ప్రోడక్ట్స్‌కు సంబంధించి ఇన్గ్రేడియెంట్స్పై కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మా బ్రాండ్ పర్యావరణ హిత, క్రుయాల్టీ–ఫ్రీ ఇన్గ్రేడియెంట్స్కు ్రపాధాన్యత ఇస్తోంది’ అంటుంది ఇమాన్.బ్యూటీ ప్రోడక్స్పై మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు సంబంధించిన విషయాలపై కూడా దృష్టి పెడుతోంది బాలీ గ్లో.కష్టఫలంబిజినెస్ స్కూలులో చదివినంత మాత్రాన, రకరకాల మేనేజ్మెంట్ కోర్సులు చేసినంత మాత్రాన ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించలేం. అది పూర్తిగా మన ఆసక్తి, అధ్యయనం, కష్టం, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ అనేది బేబీలాంటిది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.– ఇమాన్ అల్లానా -
May Day Special Story: ఖరీదు కట్టే షరాబు లేడు
ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్ క్లాప్ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్ క్లాప్ వారికి బాత్రూమ్ల క్లీనింగ్ కోసం కాల్ చేస్తే వాళ్లు ఒక్కో బాత్రూమ్కు ఇంతని చార్జ్ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్రూమ్లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఒక చార్జ్ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్ కడిగి, స్టవ్ రుద్ది క్లీన్ చేస్తుంది. ఆ చార్జ్ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్ క్లాప్ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్పుట్/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు. ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి. -
Geniben Thakor: ఎన్నికల నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’
అహ్మదాబాద్: ‘ఈ ఎన్నికల్లో నేను గెలవకుంటే మళ్లీ నాకు అవకాశం దక్కదు. నా సొంత ఠాకూర్ వర్గం సాధికారత సాధించేందుకే కాంగ్రెస్ టికెట్ సాధించా’ అంటున్నారు గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెనీబెన్ ఠాకూర్. బనస్కాంత జిల్లా వావ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన గెనీబెన్ ఎన్నికల ప్రచార నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’ బాట పట్టారు. ఆన్లైన్లో తన వినతికి బనస్కాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆమె చెప్పారు. గత 40 రోజుల్లోనే రూ.50 లక్షలవిరాళాలు అందాయన్నారు. తన ప్రచార వాహన నిర్వహణ ఖర్చులు భరిస్తామని కొందరు ముందుకొస్తే, వేదికల ఏర్పాటు ప్రచార సామగ్రి, ఆహార పదార్థాలు తదితరాలకయ్యే వ్యయం సమకూరుస్తామంటూ మరికొందరు చెప్పారని ఆమె శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు. -
అమరావతిలో ధ్వనించిన సామాజిక సాధికారత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యం కళ్లకు కట్టింది. అమరావతి జనసంద్రం అయింది. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తరలిరాగా కృష్ణాతీరాన అమరేశ్వరుడి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన సభకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్ చేస్తున్న మేలును వివరించినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం : మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి రజిని మాట్లాడుతూ.. మహిషాసురుడ్ని సంహరిస్తే దసరా, నరకాసురుడిని సంహరిస్తే దీపావళి చేసుకుంటామని, తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలని, ఆ సంబరాన్ని ఏమని పిలవాలని అన్నారు. ఆ ఉత్సవాలే సామాజిక సాధికారత అని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచి్చన ఘనత సీఎం జగనన్నకే సొంతమన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టతో ప్రభుత్వ వైద్యులు గ్రామానికే వచ్చి సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క స్కూల్ బాగు చేయాలన్న ఆలోచనే చేయలేదని, ఆఖరికి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా సొమ్ము చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటా : అలీ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనితర సాధ్యమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటానన్నారు. పెద్దగా చదువుకోని తనకే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ బాషలు వచ్చని, మన పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదా? మాట్లాడకూడదా? అని ప్రశి్నంచారు. మారుతున్న ప్రపంచంతోపాటే మన పిల్లలు కూడా మారాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొట్టమొదటి నేత వైఎస్ జగన్ అని చెప్పారు. పెత్తందారీ వ్యవస్థకు సీఎం జగన్ ఒక సవాలుగా నిలబడ్డారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల ఓట్ల కోసం మాయమాటలు చెప్పాయని, సీఎం జగన్ మాత్రం ఈ వర్గాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. చంద్రబాబు బడుగుల జీవితాలను వెక్కిరించారని, మనం ఇంగ్లిష్ మీడియం చదివితే పోటీకి వస్తారని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా, సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతి కోసం బాబు పన్నాగాలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శంకరరావు, మహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జగనే రావాలి.. జగనే కావాలి -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్‌లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్‌లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్‌రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? అమలవుతున్న 7 పథకాలు ఏవి?
మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ తనను తాను మధ్యప్రదేశ్ మహిళల సోదరునిగా అభివర్ణించుకుంటారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారధ్యంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వడం, వితంతువులకు పింఛన్ ఇవ్వడం వంటి అనేక పథకాలను శివరాజ్ ప్రభుత్వం అమలు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల కోసం ఏఏ పథకాలు అమలు చేస్తున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లాడ్లీ బెహన్ యోజన శివరాజ్ ప్రభుత్వం ‘లాడ్లీ బెహన్’ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఈ పథకం కింద అక్కాచెల్లెళ్లకు రూ.1,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నెలకు రూ. 1,250కి పెంచారు. 2. నారీ సమ్మాన్ కోష్ శివరాజ్ ప్రభుత్వం రూ. 100 కోట్లతో నారీ సమ్మాన్ కోష్‌ను ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చిన్న వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని పీఎం స్వనిధి యోజన, ముఖ్యమంత్రి వీధి వ్యాపారుల పథకాల కింద అందజేస్తారు. 3. లాడ్లీ లక్ష్మీ యోజన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్‌లో ఆడపిల్లలు పుడితే ప్రోత్సాహం, లింగ నిష్పత్తిలో మెరుగుదల, విద్యా స్థాయి, బాలికల ఆరోగ్య స్థితిపై ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందేందుకు ప్రారంభించారు. ఈ పథకం 2007 నుండి అమలులో ఉంది. లాడ్లీ ఇ-సంవాద్ యాప్ ద్వారా, ప్రజలు నేరుగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకోవచ్చు. 4. ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్యా వివాహ-నిఖా పథకం అమలవుతోంది. దీని కింద పేదలకు రూ.51వేలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు. 5. ఉజ్వల పథకం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్‌ను రూ. 450కి అందిస్తోంది. లాడ్లీ బెహనా లబ్ధిదారులతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు, ప్రత్యేక వెనుకబడిన తెగల (బైగా, భరియా, సహరియా) మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. 6. స్కూటీ పథకం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల కోసం స్కూటీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 12వ తరగతి టాపర్లు స్కూటీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తుంది. 7. మహిళా జర్నలిస్టులకు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్తో పాటు చిన్న వార్తాపత్రికలకు ప్రకటనల హామీని కూడా ప్రకటించారు. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి పనులపై అధ్యయనం చేయడానికి ప్రతి సంవత్సరం ఐదుగురు మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్ అందజేస్తారు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
జగనన్న రక్ష.. అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందనే దృఢ విశ్వాసంతో నాలుగేళ్లుగా మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటునిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి కార్యక్రమంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తూ వారికే నేరుగా ప్రయోజనాలను అందజేస్తున్నారు. విద్య, వైద్యం, ఇళ్లతోపాటు రాజకీయంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేశారు. పిల్లల చదువుల దగ్గర నుంచి పెళ్లిళ్ల వరకు ఒక అన్నగా, తమ్ముడిగా చేదోడు వాదోడుగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు. నవరత్న పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలంతా సీఎం జగన్‌కు ఓ సోదరుడిలా, తోబుట్టువులా తమకు తోడుగా నిలిచారంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కేవలం నాలుగేళ్ల రెండు నెలల వ్యవధిలోనే అక్క చెల్లెమ్మల ఖాతాలకు రూ.1.64 లక్షల కోట్లను ముఖ్యమంత్రి జగన్ పారదర్శకంగా నగదు బదిలీ చేశారు. ఇక నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో రూ.85 వేల కోట్ల మేర వారికి ప్రయోజనం చేకూర్చారు. తద్వారా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతో అక్క చెల్లెమ్మలు వ్యాపారాల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు. సూపర్ బజార్లను తలదన్నేలా మహిళా మార్టులను నెలకొల్పి రూ.కోట్ల వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అప్పుల్లో ఇప్పటికే రూ,19,178,17 కోట్లను చెల్లించి ముఖ్యమంత్రి జగన్ నిబద్ధత చాటుకున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మోసగించడంతో పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు ఇచ్చే పావలా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు. సీఎం జగన్ మాట ప్రకారం పొదుపు సంఘాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ వారి రుణాలను తీర్చడమే కాకుండా వైఎస్సార్ సున్నా వడ్డీతో దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర చెల్లించి ఆదుకున్నారు. ఆర్థికంగా ఊతమివ్వటమే కాకుండా అక్క చెల్లెమ్మలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల సాయంతో రిటైల్ రంగంలో 38 మహిళా మార్ట్స్ ఏర్పాటు కాగా ఇప్పటివరకు రూ.37 కోట్ల మేర విక్రయాలు నమోదయ్యాయి. పొదుపు సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తోంది. రిటైల్, టెక్స్టైల్స్, పాడి, ఆహార ఉత్పత్తుల లాంటి వ్యాపారాల కోసం 16 లక్షల మంది మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.5,585 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం ఇప్పించి తోడ్పాటు అందించింది. అక్క చెల్లెమ్మలు వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని జీవనోపాధి మెరుగుపడేలా ఐటీసీ, హెచ్.యు.యల్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, రిలయన్స్, అమూల్ లాంటి వ్యాపార దిగ్గజాలు, బ్యాంకులతో ఒప్పందాలు కుదిర్చి చక్కటి వ్యాపార మార్గాలను సీఎం జగన్ చూపించారు. మరోపక్క మహిళా రాజకీయ సాధికారత దిశగా గట్టిగా కృషి చేస్తూ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకే కేటాయిస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టాలను చేశారు. మంత్రివర్గంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి అక్క చెల్లెమ్మ తమకంటూ సొంత గూడు ఉండాలని కోరుకుంటుంది. రాష్ట్రంలో లక్షల మంది మహిళల సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చే మహత్తర యజ్ఞానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 30,76,675 మందికి రూ.75,670.05 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలిచ్చారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలపై భారం పడకుండా కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన స్థిరాస్తిని ఓ సోదరుడిలా సీఎం జగన్ అందచేశారు. 2019 జూన్ – 2023 జూన్ వరకు మహిళలకు లబ్ధి ఇలా.. పథకం పేరు లబ్ధిదారుల సంఖ్య లబ్ధి రూ.కోట్లలో జగనన్న అమ్మఒడి 44,48,865 26,067.28 జగనన్న వసతి దీవెన 25,17,245 4,275.76 జగనన్న విద్యా దీవెన 26,98,728 10,636.67 వైఎస్సార్ రైతు భరోసా 22,00,177 13,013.82 వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు (రైతులు) 7,38,760 183.46 వైఎస్సార్ ఉచిత పంట బీమా 8,21,348 1,170.31 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 5,68,367 491.36 మత్స్యకార భరోసా 4,868 10.76 వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీలు) 1,05,13,365 4,969.04 వైఎస్సార్ పెన్షన్ కానుక 42,28,118 49,845.29 వైఎస్సార్ చేయూత 26,39,703 14,129.12 వైఎస్సార్ ఆసరా 78,94,169 19,178.17 వైఎస్సార్ బీమా 68,172 1,026.66 వైఎస్సార్ కాపు నేస్తం 3,56,143 1,518.03 వైఎస్సార్ నేతన్న నేస్తం 33,689 225.95 జగనన్న చేదోడు 1,84,665 404.58 వైఎస్సార్ లా నేస్తం 2,081 14.95 వైఎస్సార్ వాహన మిత్ర 30,736 87.97 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 6,25,999 388.51 ఎంఎస్ఎంఈ పునఃప్రారంభం 14,174 1,272.72 అర్చకులు, ఇమామ్, మౌజమ్, ఫాస్టర్ల ఒకసారి సాయం 3,865 1.89 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4,39,068 1,257.04 డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ 10,41,191 3,361.30 వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదికా తోఫా 35,931 267.20 గృహాలు 21,31,564 10,885.91 జగనన్న తోడు (వడ్డీ) 13,83,206 64.87 నేరుగా నగదు బదిలీ మొత్తం 4,56,24,187 1,64,748.60 నగదేతర పథకాల ద్వారా అక్క చెల్లమ్మలకు ప్రయోజనం ఇలా జగనన్న తోడు (రుణాలు) 13,83,206 2,610.27 జగనన్న గోరుముద్ద 21,63,391 1,795.00 వైస్సార్ సంపూర్ణ పోషణ 15,35,390 2,992.08 జగనన్న విద్యా కానుక 25,12,423 1,784.26 ఇంటి స్థలాలు 30,76,018 75,670.05 ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ 3,48,554 460.85 నగదేతర బదిలీ మొత్తం ప్రయోజనం 1,10,18,982 85,312.51 నగదు బదిలీ, నగదేతర బదిలీ మొత్తం 5,66,43,179 2,50,061.11 తమ్ముడికి పండుగ శుభాకాంక్షలు.. కూలి పనులకు వెళ్లే నా భర్తకు నెలనెలా పింఛన్ అందుతోంది. కాపు నేస్తం ద్వారా ఏటా రూ.15,000 చొప్పున సాయం అందిస్తూ ముఖ్యమంత్రి జగన్ సొంత తమ్ముడిలా ఆదుకుంటున్నారు. మా మనవళ్ల చదువుకు అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? జగన్ తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. – పసుపులేటి పార్వతి, రమణయ్యపేట, కాకినాడ రూరల్ పెద్ద దిక్కులా నిలిచారు.. నా భర్త లింగప్ప పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు కుమారులున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. ఓ తమ్ముడిలా నాకు వృద్ధాప్య పెన్షన్, వైఎస్సార్ చేయూత సాయం అందచేసి మా కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. – బొగ్గుల లక్ష్మీదేవి, శెట్టూరు, కళ్యాణదుర్గం అన్నలా రూ.1,46,040 అందించారు.. సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఓ అన్నలా రాఖీ గిఫ్ట్‌గా నాకు రూ.1,46,040 మేర సాయం చేశారు. నాలుగున్నరేళ్లలో పలు పథకాలతో లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా మూడు విడతల్లో రూ.8,830 చొప్పున రూ.26,490 ఇచ్చారు. సున్నా వడ్డీ పథకంతో రూ.3,100 చొప్పున మూడు విడతల్లో రూ.9,300 అందించారు. వైఎస్సార్ చేయూత మూడు విడతల్లో రూ.18,750 చొప్పున మొత్తం రూ.56,250 ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున నాలుగు విడతల్లో రూ.54,000 వేలు అందుకున్నా. జగనన్నకు ప్రతీ అక్కచెల్లెమ్మల ఆశీస్సులు ఉంటాయి. మళ్లీ మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రాఖీ శుభాకాంక్షలు. – రోంగల రమణమ్మ, చోడవరం. -
ఎంబ్రాయిడరీ ఎంపవర్మెంట్
తోడా ఆదివాసీలు... నీలగిరుల్లో ఉంటారు. వారి జీవనం ప్రకృతి ఒడిలో ప్రకృతితో మమేకమై సాగుతుంది. వారి చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ డిజైన్లు కూడా వారు నివసిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూలు, లతలు, పౌరాణిక గాథలు కుట్టులో రూపుదిద్దుకుంటాయి. తెల్లటి వస్త్రం, గోధుమ వర్ణంలోని వస్త్రం మీద నల్లటి దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. సాధారణంగా ఎంబ్రాయిడరీ చేస్తే ఒక వైపు చక్కటి డిజైన్ కనిపిస్తే వెనుక వైపు దారాల ముడులుంటాయి. తోడా ఆదివాసీలు చేసే ఎంబ్రాయిడరీలో రెండు వైపులా డిజైన్ అందంగా కనిపిస్తుంది. ఇలాంటి అందమైన పనితనం కొండలకే పరిమితమైపోతే ఎలాగ అనుకున్నారు షీలాపావెల్. నీలగిరుల్లో తోడా ఆదివాసీలు నివసించే కుగ్రామాలన్నింటిలో పర్యటించారామె. వారిని స్వయం సహాయక బృందంగా సంఘటితపరిచారు. ‘షాలోమ్ ఊటీ’ పేరుతో తోడా ఆదివాసీ మహిళలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు షీలా పావెల్. ఇప్పుడు తోడా ఆదివాసీ మహిళలు వారానికి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ‘వారి చేతిలో ఉన్న కళ గొప్పతనం వారికి తెలియజేశాను, ఆ కళను ప్రపంచానికి పరిచయం చేశాను’ అన్నారు షీలా పావెల్. సాధికారత కుట్టారు షీలా పావెల్ వయసు 59. తమిళనాడులోని ఊటీలో నివసిస్తారు. ఆమె 2005లో షాలోమ్ ఊటీ స్వయం సహాయక బృందాన్నిప్రారంభించారు. అప్పుడు 250 మందితో మొదలైన బృందంలో ఇప్పుడు 150 మంది చురుగ్గా ఉన్నారు. అప్పటి సంగతులను తెలియచేస్తూ ‘‘తోడా ఆదివాసీ మహిళల చేతిలో ఏం నైపుణ్యం ఉందో తెలియదు. అందమైన ఎంబ్రాయిడరీతో చక్కటి శాలువాలు వాళ్ల చేతిలో రూపుదిద్దుకోవాల్సిందే. ఈ మహిళలు తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను సమీపంలోని ఊటీ పట్టణానికి తెచ్చి అమ్ముకునేవారు. ఊటీలో దుకాణాల వాళ్లు తక్కువ ధరకు కొని వాటిని పర్యాటకులకు మంచి ధరకు అమ్ముకునేవారు. ఈ మహిళలకు మరొక ప్రపంచం తెలియకపోవడంతో ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తి పడేవారు. వారిని సంఘంగా ఏర్పరిచి, వారు తయారు చేసిన శాలువాలు, కీ చైన్లు, మఫ్లర్లు, పర్సులు వంటి వాటిని తమ బృందం పేరుతో లేబుల్ అతికించి అమ్మడం మొదలు పెట్టారు. వ్యవస్థీకృతంగా లేని పనిని, కళ చేతిలో ఉన్న వారిని వ్యవస్థీకృతం చేయడమే నేను చేసింది. అప్పట్లో షాల్ కోసం వాళ్లు తీసుకునే క్లాత్కంటే కొంచెం మెరుగైన క్లాత్ కొని ఇవ్వడం, మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం వంటివి చేశాను. గతంలో ఐదు వందలకు అమ్మిన శాలువాలను ఇప్పుడు వెయ్యి రూపాయలకు అమ్మగలుగు తున్నారు. నా కళ్లముందే వారి జీవన స్థాయులు పెరిగాయి. నేను కోరుకున్న లక్ష్యాలు రెండూ నెరవేరాయి. వీరి కళ విలువ వీరికి తెలిసింది, వీరి కళ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయగలిగాను. తోడా ఎంబ్రాయిడరీ వస్తువులు చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో కూడా లభిస్తున్నాయిప్పుడు. కళ కొనసాగాలి ఈ కళ ఎదుర్కొంటున్న మరో చాలెంజ్ ఏమిటంటే... కొత్తతరం ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం లేదు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడం మంచి పరిణామమే. కానీ ఈ కళను కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. తోడా ఆదివాసీల జనాభా పదమూడు వందలుంటే అందులో ఏడు వందల వరకు మహిళలున్నారు. డెబ్బై ఏళ్ల వాళ్లతో కలుపుకుంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్లు మూడు వందల లోపే ఉన్నారిప్పుడు. ఇతరులకు నేర్పించే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలియ చేశారు షీలా పావెల్. -
మెకానిక్‌లు సాధికారత సాధించాలి
న్యూఢిల్లీ: మన దేశ అటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి మెకానిక్‌లు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి కోసం వారు సాధికారత సాధించాలని సూచించారు. ఆయన ఇటీవల ఢిల్లీ కరోల్ బాగ్‌లోని బైకర్స్ మార్కెట్లో మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం విదితమే. మెకానిక్‌లతో కలిసి ఓ బైక్‌ను ఆయన సరీ్వసు కూడా చేశారు. సంబంధిత వీడియోను రాహుల్ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. తనకు కేటీఎం 390 మోటార్ సైకిల్ ఉందని, దాన్ని ఉపయోగించడం లేదని, ఇంట్లోనే పార్క్ చేసి ఉంచానని ఈ వీడియోలో రాహుల్ చెప్పారు. మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని, అందుకే కేటీఎం 390ని ఇంటికే పరిమితం చేశానని వివరించారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ఓ మెకానిక్ ప్రశ్నించగా.. చూద్దాం అంటూ రాహుల్ బదులిచ్చారు. అటోమొబైల్ పురోగతి కోసం మెకానిక్‌లు వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, మెరుగైన వసతులు, ఉత్తమ అవకాశాలు పొందడానికి వారు అన్నివిధాలా అర్హులని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. భారతదేశ అసలైన అభివృద్ధి కారి్మకుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు. -
ఆమే ఆధారం! ఇది అసమాన్య మహిళల విజయగాధ
కాలం మారింది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన కొందరు మహిళలు బయటకొస్తున్నారు. తల్లిదండ్రుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పిల్లల పోషణకు తమవంతు బాధ్యతలు నెరవేర్చుతున్నారు. బిడ్డల పెళ్లిళ్లు.. ఉద్యోగాల వరకు నెట్టుకొస్తున్నారు. పెద్దగా చదువుసంధ్యలు లేకపోయినా దిగులు చెందక.. కష్టాన్నే నమ్ముకుంటున్నారు. తమకు తోచిన రంగాన్ని ఎంచుకుని గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొన్ని పురుషులకే పరిమితమైన రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ఇలాంటివారు పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా మహరాణులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి, తిరుపతి తిరుపతి కొర్లగుంటలో..... తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న రెడ్డెమ్మ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సుమారు పదేళ్లుగా నాదస్వర విధ్వాంసురాలుగా పనిచేస్తున్నారు. ఈమె పుట్టింది పెరిగింది అన్నమయ్య జిల్లా పీలేరు. తండ్రి మల్లయ్య నాదస్వర విధ్వాంసులు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలుకాగా పెద్ద కుమార్తె రెడ్డెమ్మ. రెండో కుమార్తె సుభాషిణి. తన తండ్రి వద్ద రోజుకు 40 మందికికిపైగా నాదస్వరంలో శిక్షణ తీసుకునేవారు. వారితోపాటే రెడ్డమ్మ, సుభాషిణి నాదస్వరం నేర్చుకున్నారు. తిరుపతి సంగీత కళాశాలలో డిప్లొమో పూర్తిచేశారు. గంగమ్మ ఆలయంలో నాదస్వర విధ్వాంసురాలు కాగా రెడ్డెమ్మను తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నాదస్వర విధ్వాంసురాలుగా దేవదాయశాఖ నియమించింది. సుమారు పదేళ్లుగా ఆమె విధులు నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. నాన్న నేర్పిన నాదస్వరం ఇప్పుడు జీవనాధారమైందని, ప్రభుత్వ ఉద్యోగిగా వేతనం తీసుకుంటూ.. కుమార్తెకు వివాహం జరిపించానని చెబుతోంది. తన భర్త విశ్వనాథం కూడా నాదస్వర విధ్వాంసులే కావడం విశేషం. సోదరి సుభాషిణి కూడా నాదస్వరంలో రాణిస్తున్నట్లు రెడ్డెమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ------- టీ తాగాలంటే లక్ష్మీదేవీ దగ్గరకు రావాల్సిందే తిరుపతి కొర్లగుంటలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి పదేళ్లుగా టీ దుకాణం నడుపుతున్నారు. తండ్రి పాడి రైతు. పితికిన పాలను లక్ష్మీదేవి టీ అంగళ్లకు విక్రయించేవారు. అదే సమయంలో టీ, కాఫీ కొట్టు పెడితే బాగుంటుందని భావించారు. నివాసానికి సమీపంలో సొంతంగా టీ దుకాణాన్ని నడపడం ప్రారంభించారు. టీ, కాఫీని రుచిగా తయారు చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. రోజూ 500 మంది వరకు టీ, కాఫీ తాగి వెళ్తున్నారని.. ఈ దుకాణమే ఇప్పుడు తమ జీవనాధారమని చెబుతున్నారు. భర్త ప్రకాష్ చేదోడు వాదోడుగా ఉంటున్నారని, ఇద్దరు కుమారులను చదవించి ప్రయోజకుల్ని చేశానని అంటున్నారు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నట్టు పేర్కొన్నారు. -------- తల నీలాల కార్యక్రమంలో వారసత్వం తండ్రి తదనంతరం ఆస్తులు, ఉద్యోగాలతో పాటు అనేక కార్యక్రమాలకు కుమారులే వారసులుగా వ్యవహరిస్తుంటారు. తిరుమల కళ్యాణకట్టలో కొందరు మహిళలు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. పురుషులతో దీటుగా రాణిస్తున్నారు. శ్రీవారి భక్తుల తలనీలాలు సమర్పించుకునే కార్యక్రమంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా చెవిపోగులు కుట్టే కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. ఇలా తిరుమలో సునీత, గజలక్ష్మి 12 ఏళ్లుగా చిన్నారులకు చెవిపోగులు కుట్టే వృత్తిలో రాణిస్తుంటే.. లత, నిర్మల, నాగలాక్షి వంటి మహిళలు క్షురకులుగా వారి వారి వృత్తుల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
AP: 46,445 మంది రైతులకు ఆక్వా విద్యుత్ సబ్సిడీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా నిర్వహించిన ఈ ఫిష్ సర్వే వల్ల లక్షలాది మంది అర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తెలిపారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం 6వ ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాలలోపు సాగు చేస్తున్న ప్రతి ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఫిష్ సర్వే ద్వారా అర్హులైన ఆక్వా రైతులను గుర్తించడం జరిగిందని అన్నారు. సర్వే తరువాత రాష్ట్రంలో 46,445 మంది రైతులను అర్హులుగా నిర్ధారించడం జరిగిందని, దాదాపు 3,27,575 ఎకరాలకు, విద్యుత్ సబ్సిడీగా ఏటా రూ.672.61 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఫిష్ సర్వేకు ముందు ఆక్వాజోన్ పరిధిలో పది ఎకరాల లోపు ఆక్వా సాగు చేస్తున్న విస్తీర్ణం కేవలం 1.90 లక్షల ఎకరాలకు మాత్రమే సబ్సిడీ అందితే, సర్వే తరువాత 3.27 లక్షల ఎకరాలకు సబ్సిడీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ఎక్కువ మంది అర్హులైన చిన్న రైతులు ఆక్వాజోన్ పరిధిలో ఈ పరిమితుల్లోకి రావడం వల్ల వారికి మేలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలను తక్షణం పరిశీలించి, పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన సాధికారిత కమిటీ ఇప్పటి వరకు పలుసార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. చదవండి: ఏది నిజం?: ‘ఈనాడు’ దిగజారుడు రాతలు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను స్థిరీకరించడం, ఆక్వా ఉత్పత్తుల ధరలను పది రోజుల పాటు ఒకేలా కొనసాగేలా చర్యలు తీసుకోవడం, ఈ రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించడం ద్వారా రైతులు, ప్లాంట్ నిర్వాహకుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎక్కడికక్కడ రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆక్వాలో రేట్ల పెరుగుదల, ఆకస్మికంగా ధరల పతనం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు, స్థానికంగా ఆక్వా వినియోగం పెంచేందుకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు, సబ్సిడీలతో మొత్తం 4 వేల ఫిష్ ఆంధ్రా ఆక్వా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే 1549 యూనిట్లను ఏర్పాటు చేయడం పూర్తయ్యిందని, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 360 యూనిట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొత్తం 2500 యూనిట్లకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపారు. నిరుద్యోగ యువత ఉత్సాహంగా ఫిష్ ఆంధ్రా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందకు వస్తున్నారని, అటు ఆక్వా రంగానికి, ఇటు యువత ఉపాధికి బాటలు వేస్తూ ఫిష్ ఆంధ్రా యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక ఈ సందర్భంగా అప్సడా చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఆక్వా ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు, ఎగుమతి దారులకు అవసరమైన సమాచారంను అందిస్తున్నామని తెలిపారు. మధ్య దళారీల ప్రమేయంను పూర్తి స్థాయిలో నియంత్రించడం, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించడం ద్వారా రేట్లు పతనం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సీడ్ రేట్లు పెరుగుదలకు సంబంధించి అప్సడాకు సమాచారం ఇచ్చిన తరువాతే, వాటిని శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటున్నామని, రైతులపై అధిక భారం లేకుండా, అటు సీడ్, ఫీడ్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉండేలా రేట్లను ప్రభుత్వ పరంగా నియంత్రించగలిగామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్, గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పిసిబి చీఫ్ ఇంజనీర్ శివారెడ్డి పాల్గొన్నారు. -
సాధికారత కోసమే సాంకేతికత
న్యూఢిల్లీ: సాంకేతికతను సాధికారత సాధించేందుకే సద్వినియోగం చేయాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సాంకేతికత దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత్ పోఖ్రాన్ అణపరీక్షలు జరిపి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ దేశ చరిత్రలో ఉజ్వలమైన క్షణాల్లో 1998నాటి పోఖ్రాన్ అణుపరీక్షలు కూడా ఒకటి. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నకాలంలో చేసిన అణుపరీక్షలు దేశ శాస్త్రసాంకేతికత సత్తాను చాటడంతోపాటు ప్రపంచస్థాయిలో దేశ ఖ్యాతిని సమున్నత స్థాయిలో నిలిపాయి’ అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా త్వరలో నిర్మంచబోయే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ–ఇండియా(లిగో–ఇండియా)కు శంకుస్థాపన చేసిన దానిని జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అరుదైన ఖనిజాల నుంచి మ్యాగ్నెట్లను తయారుచేయనున్నారు. విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనాలయంసహా ముంబై, నవీ ముంబైలలోని పలు పరిశోధన, ఉత్పత్తి కేంద్రాలను జాతికి అంకితమిచ్చారు. ‘ జామ్(జేఏఎం) ట్రినిటీ, కోవిన్ పోర్టల్, రైతులకు డిజిటల్ మార్కెట్ ఇలా ప్రతి రంగంలో సాంకేతికతను భారత ప్రభుత్వం సాధికారత, సామాజిక న్యాయం కోసమే వినియోగిస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు కాదు. శాస్త్ర,సాంకేతిక రంగ పురోభివృద్ధికి ఎంతగానో మా సర్కార్ కృషిచేస్తోంది. పదేళ్ల క్రితం ఏటా 4,000 పేటెంట్లు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 30వేలకు చేరుకుంది. గతంలో ఏటా 70వేల ట్రేడ్‌మార్క్‌లు నమోదయ్యేవి. ఇప్పుడవి 2.5లక్షలపైమాటే. ఇంక్యుబేషన్ కేంద్రాల సంఖ్య ఎనిమిదేళ్ల క్రితం 150 ఉంటే ఇప్పడవి 650కి చేరుకున్నాయి’ అని మోదీ అన్నారు. -
సెల్ఫ్ ఎంపవర్మెంట్
కోల్‌కతాకు చెందిన దీప్తి ఘోష్ ఇంజనీరింగ్ చదువుకుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు తనపై పడ్డాయి. ఉద్యోగాల వేటలో పడింది. అయితే వచ్చిన ఒకటీ రెండు ఉద్యోగాలు ‘ఔట్ ఆఫ్ కోల్‌కతా’ వచ్చాయి. తల్లి, చెల్లిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితి. సిటీలో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకునే పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం ఎందుకని క్యాబ్ డ్రైవర్‌గా మారింది. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీప్తి క్యాబ్‌లో ప్రయాణించిన దిల్లీకి చెందిన పరమ్ కల్యాణ్‌సింగ్ ఆమె స్టోరీని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఇదే’ ‘చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ కూర్చోవడం కంటే ఇది ఎంత గొప్ప పని!’ ‘దీప్తి తన వృత్తిని గౌరవిస్తుంది. శ్రమజీవుల లక్షణం ఇది. స్త్రీ సాధికారతకు తిరుగులేని ఉదాహరణ దీప్తి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం
ఏ సిగ్నల్ దగ్గరో, లేదా దారిమధ్యలోనో దీనంగా కనిపించిన బిచ్చగాళ్లకు తోచినంత సాయం చేయడం చాలామందికి అలవాటు. అలా చేయడం వల్ల కాస్త పుణ్యం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు చంద్ర మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ‘‘దానం చేయవద్దు పెట్టుబడి పెట్టండి’’అనే నినాదంతో అద్భుతాలు సృష్టించారు. ఈ పిలుపు వెనుక ఉన్న సాహసం, ఆయన సాధించిన విజయం గురించి తెలిస్తే.. మీరు కూడా ఔరా అంటారు..! బెగ్గర్స్ కార్పొరేషన్: చంద్ర మిశ్రా జర్నలిస్టు,సామాజిక కార్యకర్త, చంద్ర మిశ్రా బిచ్చగాళ్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడంలో పెట్టుబడి పెడితే, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వొచ్చని బాగా నమ్మారు. బిచ్చగాళ్లకు భిక్ష కాదు పెట్టాల్సింది.. కాసింత చేయూత, తగినంత పెట్టుబడి ఉంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో అసంఘటిత రంగానికి చెందిన వేలాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోవడం, వారణాసిలో గుడి దగ్గర వేలాంది మంది బెగ్గర్స్‌ను చూసిన చలించిపోయిన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పేదరికంతో బిచ్చగాళ్లుగా మారిన వారికి దానం పరిష్కారం కాదనీ, ప్రాథమిక మార్పు తీసుకొచ్చేలా సాయం చేయడమే ఏకైక పరిష్కారమని నమ్మారు. అలా అనేక ప్రయోగాల తర్వాత, చంద్ర అధికారికంగా ఆగస్టు 2021లో బెగ్గర్స్ కార్పొరేషన్‌ను రిజిస్టర్ చేసారు. రూ.10 నుంచి రూ.10వేలు దాకా తోచినంత పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తామని, దీని ద్వారా గ యాచకుల జీవితాల్లో మార్పువస్తుందని ప్రకటించారు. బిచ్చగాళ్లకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే చంద్ర లక్ష్యం. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన నిరుద్యోగ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్బుక్ సర్వే నిర్వహించి వారణాసిలో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా సమీప ప్రాంతాల నుండి దాదాపు 27వేల మంది చేరడంతో ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. ఉత్సాహం చూపించిన వారికి బ్యాగుల తయారీవంటి నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాలు ఇప్పించడం మొదలైంది. దీంతో పలువురు బిచ్చగాళ్ళు కార్పొరేషన్లో చేరిక పెరిగింది. శిక్షణ తరువాత రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. అలా ఇంతింతై..అన్నట్టుగా సాగుతోంది బెగ్గర్స్ కార్పొరేషన్. 2021-22లో రూ. 5.7 లక్షలతో మొదలైన పెట్టుబడి, 2022-23లో 10 రెట్లు పెరిగింది. ఇపుడు రూ. 10 కోట్ల పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయంపై పలువురి ప్రశంసలు దక్కాయి. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా? ) #BeggarsCorporation is raising ₹ 10 cr #investment, not #donation. Indians donate ₹ 103 lakh cr p/a. If only 700 donors invest ₹ 1.5 lac each on one beggar, we don't need #VentureCapital to create 1st #beggingfree city of India. Don't donate, invest.https://t.co/TkwiATIS8k — Beggars Corporation (@BeggarsCorp) April 13, 2023 వ్యవస్థాపకులుగా 14 కుటుంబాలు ఫలితంగా ఇప్పటికే 14 పేద కుటుంబాల జీవనోపాధి కల్పించారు. తద్వారా ప్రారంభ పెట్టుబడిదారుల డబ్బును ఆరు నెలల్లోపు తిరిగి ఇచ్చేయడమేకాదు, 16.5 శాతం లాభాన్ని ఆర్జించారు. దీంతో తన భాగస్వాములైన బద్రీనాథ్ మిశ్రా, దేవేంద్ర థాపాతో కలిసి, మిశ్రా ఆగస్ట్ 2022లో బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారి పోయింది. 14 యాచక కుటుంబాలు వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నాయి. ఇందులో పన్నెండు కుటుంబాలు చక్కటి సంచులను తయారు చేస్తాయి. మరో రెండు కుటుంబాలు వారు దేవాలయాల సమీపంలో దుకాణాల్లో పువ్వులు, పూజా సామగ్రి ఇతర వస్తువులను విక్రయిస్తారు. If you think #beggars can't work, please watch this video. Today for the first time she came with her child. I motivated her to work. With 15 minutes of guidance, she started stitching. What if she gets skill training under Learn & Earn? @narendramodi @blsanthosh @MSDESkillIndia pic.twitter.com/KHm3jVNugr — Chandra Mishra (@employonomics) December 29, 2021 కార్పొరేషన్లో చేరింది ఒక మహిళ కావడం విశేషం. భర్త వేరొకరిని పెళ్లిచేసుకుని బాధిత మహిళను ఇంటినుంచి తరిమిమేయడంతో 12 ఏళ్ల కొడుకుతో పాటు, కాశీ ఘాట్ వద్ద భిక్షాటన చేసేది. ఆమెను కలిసి పనినేర్చుకోమన్నపుడు వెనకడుగు వేసింది. మిషన్‌ను పాడు చేస్తానేమోనని భయపడింది. చివరికి 15 నిమిషాల్లో ఆమె నేర్చుకొంది. కుట్టుపని శిక్షణలో పదును తేలడం బెగ్గర్స్ కార్పొరేషన్‌కు మరింత ప్రోత్సహాన్నిచ్చిందనీ, వారికి చేయూతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచితే చాలనే నమ్మకాన్ని తమలో పెంచిందని చంద్ర చెబుతారు. ‘‘వారి జీవితాలను మార్చడంలో ఎంతవరకు విజయం సాధించానో ఖచ్చితంగా తెలియదు, కానీ బనారస్ బెగ్గర్స్ కార్పొరేషన్ ద్వారా నేను మారును. నేను ఒక మాధ్యమం మాత్రమే. నిజానికి నేను యూపీకి చెందిన వాడ్నికాను. వారణాసి ప్రజలతో నాకు సంబంధం లేదు. కానీ వృద్ధి సమానంగా ఉండాలని ఈ ఉద్యమం నాకు నేర్పింది. మనం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించే వరకు రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. బిచ్చగాళ్లు పారిశ్రామికవేత్తలు కాగలిగితే, నిరుద్యోగం అనేదే ఉండదు’ అంటారు చంద్ర. విరాళాలకు బదులుగా పెట్టుబడులను ప్రోత్సహించాం తద్వారా బిచ్చగాళ్ళు వ్యవస్థాపకులుగా మారారు. ఈ రకమైన చర్య ప్రపంచంలోనే మొదటిది, ఏకైక చొరవ అని ఆయన పేర్కొన్నారు. అవార్డులు, రివార్డులు ♦ఈ మిషన్‌లో ఒక్కో బిచ్చగాడికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. వీటిలో రూ. 50వేల మూడు నెలల నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి వినియోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తి సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఖర్చు చేస్తారు. ♦ దీంతోపాటు వారణాసి ఘాట్ల వద్ద అడుక్కునే పిల్లలకు సహాయం చేయడానికి మిశ్రా స్కూల్ ఆఫ్ లైఫ్‌ను కూడా స్థాపించారు. బెగ్గర్స్ కార్పొరేషన్ చంద్ర మిశ్రాకు 100 ఇన్నోవేటివ్ స్టార్టప్‌లలో స్థానం సంపాదించిపెట్టింది. తరువాత టాప్ 16 మైండ్‌ఫుల్ స్టార్టప్‌లలో చేరారు. ♦ ప్రారంభంలో 57 మంది తన ప్రచారానికి నిధులు సమకూర్చారు . వారి డబ్బుతో, మిశ్రా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని ఏర్పాటు చేశారు. ♦ బెగ్గర్స్ కార్పొరేషన్స్ అనేక అవార్డులను కూడా అందుకుంది. స్టార్టప్ ఇండియా సహకారంతో లెమన్ ఐడియాస్ నిర్వహించిన ఇన్నోప్రెన్యూర్స్ గ్లోబల్ స్టార్టప్ కాంటెస్ట్‌లో ఇది బెస్ట్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును అందుకుంది. -
ఇంధన రంగంలో అపార అవకాశాలు
సాక్షి, బెంగళూరు: దేశంలో ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని, విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంధన రంగానిది కీలక పాత్ర అన్నారు. చమురు శుద్ధి సామర్థ్యంలో నాలుగో స్థానం భారత్‌లో సుస్థిర ప్రభుత్వం, నిరంతర సంస్కరణలు, సామాజిక, ఆర్థిక సాధికారత పలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడ్డాయని మోదీ ఉద్ఘాటించారు. ‘‘తొమ్మిదేళ్లలో ఇంటర్నెట్ అనుసంధానం మూడు రెట్లు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ 5 శాతం మేర పెరిగిందన్నారు. ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. 2030 నాటికి 4 ఎంఎంటీల మేర గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇందుకోసం రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. ఇక ఈ–20 ఇంధనం ఈ–20 ఫ్యూయల్ (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్)ను మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ–20ని తొలుత 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారు. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తారు. ఈ–20 ఇంధన వినియోగంతో ముడిచమురు దిగుమతుల భారం తగ్గనుంది. తుమకూరు జిల్లా గుబ్బీ తాలూకాలో హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ తయారీ ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు. -
డిజిటలైజేషన్లో భారత్ మార్గదర్శి
వాషింగ్టన్: డిజిటలైజేషన్ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. సాధికారత, సామాజిక భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు సంబంధించి భారత్‌లో డిజిటలైజేషన్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కోవిడ్–19 సమయంలో సామాజిక భద్రత విషయంలో భారత్‌లో డిజిటలైజేషన్ కీలక ప్రాత పోషించిందని అన్నారు. పేదరికం సమస్యలు కూడా డిజిటలైజేషన్లో తగ్గుముఖం పడతాయని పేర్కొంటూ, భారత్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వాతావరణ మార్పులు వంటి పలు అంశాల విషయంలో భారత్‌సహా పలు వర్థమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. డిసెంబర్లో భారత్‌లో జరగనున్న జీ–20 దేశాల సదస్సులో దేశాల రుణ సమస్యలు, విద్యారంగం పురోగతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని డేవిడ్ మాల్పాస్ వెల్లడించారు. -
Aspire For Her: ఉద్యోగం చేసి చూడు
‘ఇల్లు కట్టి చూడు’ అన్నారుగానీ ‘ఉద్యోగం చేసి చూడు’ అనలేదు. అనకపోతేనేం... ఉద్యోగం చేయడం ఆషామాషీ విషయం కాదు. ఉద్యోగం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు. మనలోని శక్తులను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడం. ఈ ఎరుకతోనే ‘ఎస్పైర్ ఫర్ హర్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది మథురదాస్ గుప్త. తాజాగా... టెక్ దిగ్గజం గూగుల్ వారి ‘గూగుల్ ఫర్ స్టార్టప్’ కార్యక్రమానికి ఎంపికైన స్టార్టప్ ఫౌండర్లలో దాస్ ఒకరు... రకరకాల కారణాల వల్ల మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. కొందరు ‘ఉద్యోగం మా పని కాదు’ అనుకుంటున్నారు. కొందరికి ఉద్యోగం చేయాలని ఉంటుంది. కాని దారి ఏమిటో తెలియదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ‘మహిళల ఆర్థిక స్వాతంత్య్రం’ లక్ష్యంగా ‘ఎస్పైర్ ఫర్ హర్’ (ఎఎఫ్హెచ్) స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మ«థురదాస్ గుప్త. ఇరవై అయిదు సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పని చేసిన దాస్, అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా ఇంటిపట్టునే ఉంటున్న ఎంతోమంది మహిళలను చూసింది. ‘మీరు ఎందుకు ఉద్యోగం చేయకూడదు?’ అని అడిగితే ‘పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ ‘ఇంటిపనులు ఎవరు చేస్తారు?’ ‘మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా. మళ్లీ నేను ఎందుకు?’... ఇలా రకరకాల మాటలు వినిపించేవి. మరోవైపు ఉద్యోగాలలో స్త్రీ పురుషులకు మధ్య ఉన్న భారీ అంతరం బాధ పెట్టేది. ‘భద్రమైన ఉద్యోగాన్ని వదిలి రిస్క్ చేస్తున్నావు... అని హెచ్చరించారు చాలామంది. ‘‘అయితే నేను డబ్బుల కోసం కాదు ఒక మంచిపని కోసం ఈ స్టార్టప్ మొదలుపెట్టాను. మంచిపని చేస్తున్నాననే భావన నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది’’ అంటుంది మథుర. ‘ఏఎఫ్హెచ్’లో లక్షా యాభైవేలమంది సభ్యులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది నిపుణులు, సంస్థల మద్దతు ఉంది. ఆయా రంగాల నిపుణుల ద్వారా సభ్యులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ ఇప్పిస్తోంది ఎఎఫ్హెచ్. ‘ఏఎఫ్హెచ్’ సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలంటే కోల్‌కతాకు చెందిన ఆద్రిజ నుంచి మొదలు బిజోయెత మైత్ర వరకు ఎంతమంది గురించి అయినా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు చనిపోవడంతో కుంగుబాటు బారిన పడింది అద్రిజ. ఒకరోజు టీచర్ దగ్గరకు వెళ్లి ‘నేను బోర్డ్ ఎగ్జామ్స్ కూడా పాస్ కాలేను’ అన్నది. చదువులో చురుగ్గా ఉండే అమ్మాయి, భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్న అమ్మాయి ‘ఇక నేను ఏమీ చేయలేను’ అంటూ దీనంగా నిల్చోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ‘ఎఎఫ్హెచ్’ బాధ్యులకు పరిచయం చేశారు. ‘ఏఎఫ్హెచ్’లోకి అడుగుపెట్టడంతో ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది. ‘కష్టకాలంలో నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని నింపారు’ అని ఉత్సాహంగా చెబుతుంది ఆద్రిజ. కోవిడ్ కాలంలో బిజోయెత మైత్ర తన భర్తను కోల్పోయింది. ఇల్లు గడవడానికి ఆయన సంపాదనే ఆధారం. తానేమో ఎప్పుడూ ఉద్యోగం చేసింది లేదు. కూతురి గురించి ఆలోచిస్తూ మరింత బాధకు గురయ్యేది. ‘అదేపనిగా దిగులు పడడం తప్ప ఏం చేయాలో తెలియని రోజుల్లో, ఒకరి సలహా మేరకు ఏఎఫ్హెచ్ బాధ్యులను కలిశాను. వారు నాలో ఎంతో ధైర్యం నింపారు. నేను ఒంటరిని అనే బాధ దూరమై, నా వెనక పెద్ద కుటుంబం ఉందనే మానసిక బలం వచ్చింది’ అంటున్న మైత్ర ప్రస్తుతం ఎంటర్ప్రెన్యూర్, వెల్నెస్ అడ్వైజర్‌గా రాణిస్తోంది. ‘ఉద్యోగం చేయాలనే కోరిక బలంగా ఉన్నా, నేను చదివిన చదువుకు ఏ ఉద్యోగం వస్తుంది అనే అపనమ్మకం ఉండేది. అయితే ఏఎఫ్హెచ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నన్ను బాగా అర్థం చేసుకున్న తరువాత, ‘నీలో ఈ ప్రతిభ ఉంది, ఈ రంగంలో నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది’ అని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో ఉండడానికి ఏఎఫ్హెచ్ కారణం’ అంటుంది ముంబైకి చెందిన 29 సంవత్సరాల వినీత. ‘ఎస్పైర్ ఫర్ హర్’ అద్భుత విజయం సాధించింది అని వీరి మాటలు చెప్పకనే చెబుతున్నాయి. -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
మెంటల్ హెల్త్ యాక్టివిజం
మనసుకు వైద్యం చాలా ముఖ్యం మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం పని చేసే యాక్టివిస్టులు ఉన్నారు. కాని ‘మెంటల్ హెల్త్’ బాగుండాలని పని చేసే యాక్టివిస్టులు తక్కువ. నీరజా బిర్లా– కుమార మంగళం బిర్లా భార్యగా కంటే ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్టు’గా వచ్చే గుర్తింపును ఎక్కువ ఇష్టపడతారు. ‘ఎంపవర్’ అనే సంస్థను స్థాపించి బాలల, మహిళల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్నారామె. ఇటీవల హైదరాబాద్‌లో జరిపిన సర్వేలో ఎమర్జెన్సీ నంబర్లకు కేవలం ఒక శాతం మాత్రమే మానసిక సమస్యలు చెప్పుకునే కాల్స్ వచ్చాయి. అంటే మనసుకు వచ్చిన ఆపదను ఇంకా ధైర్యంగా బయటకు చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నీరజా బిర్లా ఏమంటున్నారో విందాం. ‘నా తొలి కాన్పు జరిగి కూతురు (అనన్యా బిర్లా) పుట్టాక నిజానికి అదొక పండగ వాతావరణంగా ఉండాలి. అదంరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఉన్నారు కూడా. కాని నేను మాత్రం ఎలాగో అయిపోయాను. నా ఒడిలో చందమామలాంటి బిడ్డ ఉన్నా నా మనసు రకరకాలుగా ఉండేది. ఊరికే ఏడుపు వచ్చేది. చాలా నిరాశగా అనిపించేది. చిరాగ్గా ఉండేది. ఇలా ఎందుకుందో నాకు తెలియలేదు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాని చివరకు తెలిసింది అది ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అని! ఇలా చాలామంది స్త్రీలకు అవుతుందని. ఆ సంగతి నాకు ముందే తెలిస్తే నేను ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కొని ఉండేదాన్ని. ధైర్యంగా ఉండేదాన్ని. బహిరంగంగా మాట్లాడేదాన్ని. నాలా ఎంతమంది బాధ పడుతున్నారో అనిపించింది. అప్పటి నుంచి దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఉన్న చైతన్యాన్ని గమనించడం మొదలుపెట్టాను. దాని గురించి ఎవరో పని చేయడం కాదనీ, మనమూ మనకు వీలైన పని చేయవచ్చని ఆరేళ్ల క్రితం ఎంపవర్ సంస్థ స్థాపించాను. పూర్తిగా మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం, సహాయం చేసే సంస్థ ఇది. ఈ సంస్థ వల్ల మంచి జరగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు 51 ఏళ్ల నీరజా బిర్లా. ఎన్నో ఏళ్లు సామాజిక సేవ, విద్య రంగాల్లో పని చేస్తున్న నీరజా బిర్లా ఇప్పుడు పూర్తిగా ‘ఎంపవర్’ (మైండ్ పవర్) సంస్థ ద్వారా చేయాల్సిన పని గురించే శ్రద్ధ పెడుతున్నారు. తనను తాను ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్’గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇద్దరు జర్నలిస్టులు ఆరేళ్ల క్రితం నీరజా బిర్లా ‘ఎంపవర్’ ఆవిర్భావం గురించి ప్రెస్‌మీట్ పెడితే ఇద్దరే జర్నలిస్టులు హాజరయ్యారు. ‘చూడండి... మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఎంత నిర్లక్ష్యం ఉందో. అదొక నిషిద్ధ విషయంగా కూడా ఉంటోంది. ఎవరైనా తమకు మానసిక అనారోగ్యం ఉందంటే పిచ్చి అని సమాజం ముద్ర వేస్తుందనే భయం ఇప్పటికీ పోలేదు. దీని గురించే ఎక్కువగా చైతన్యం కలిగించాలి. జ్వరం వస్తే ఎంత సులభంగా చెప్పుకుంటామో అంత సులభంగా చెప్పుకోగలగాలి. బండి మీద నుంచి కింద పడితే అందరూ పరిగెత్తి వెళ్లి ఎంత సహజంగా సాయం చేస్తారో... ‘‘యాంగ్జయిటీగా ఉంది, పానిక్‌గా ఉంది, డిప్రెషన్‌గా ఉంది’’ అంటే కూడా అంతే సహజంగా సాయం చేసేలా ఉండాలంటారు నీరజ. పిల్లల స్థాయి నుంచి ‘ఎంపవర్’ మొదలెట్టినప్పుడు నీరజ ఆలోచనలు స్కూలు స్థాయి నుంచి మానసిక ఆరోగ్యం గురించి చైతన్యం కలిగిస్తే చాలు అనేంతవరకే ఉన్నాయి. లెక్కల సిలబస్, సైన్స్ సిలబస్ ఉన్నట్టే మానసిక ఆరోగ్యం గురించి కూడా సిలబస్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండాలని ఆమె అనేక స్కూళ్లలో ఆ సిలబస్ పెట్టించారు. అంతే కాదు, పిల్లల కోసమే ప్రత్యేకమైన వర్క్‌షాప్స్ నిర్వహించారు. ‘అసలు అందరి కంటే ఎక్కువగా కౌమార దశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఆ వయసులోనే బాడీ షేమింగ్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్... ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలే అని వారికి తెలిస్తే వారు సులువుగా వాటిని ఎదుర్కొంటారు’ అంటారు నీరజా. అయితే పని కొనసాగే కొద్దీ ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లలు, స్త్రీలు అని కాకుండా అన్ని దశల, వయసుల్లో ఉన్నవారికి అవసరం అనే అవగాహనకు వచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు. ఈమె సాగిస్తున్న ఈ ఉద్యమంలో కుమార్తె అనన్యా బిర్లా కూడా భాగస్వామి అయ్యింది. ఇటీవల జరుగుతున్న డిప్రెషన్ ఆత్మహత్యలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రతి చోటా చర్చలు, చైతన్య శిబిరాల అవసరం తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు, సంస్థలు ఆ దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. నగరాల్లో క్లినిక్‌లు ‘ఎంపవర్’ ఆధ్వర్యంలో నేరుగా వైద్య సహాయం అందించే క్లినిక్‌లను ముంబైలో 3 ఏర్పాటు చేశారు నీరజ.. ఆ తర్వాత కోల్కటా, బెంగళూరు, హైదరాబాద్, గోవా, పిలానీలలో క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీరు నేరుగా వైద్య సహాయం అందిస్తే కౌన్సిలర్ల వ్యవస్థను కూడా విస్తృతం చేసుకుంటూ వెళుతున్నారు. ‘మన దేశంలో సమస్య ఏమిటంటే మనకు మానసిక సమస్య ఉందని తెలిశాక వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సైకియాట్రిస్ట్‌లు పెద్దగా అందుబాటులో కూడా ఉండరు. యాంగ్జయిటీ సమస్య ఉన్న మనిషి జీవితంలోని సమస్యలు ఎదుర్కొంటూ యాంగ్జయిటీని కూడా ఎదుర్కొంటూ బతకాల్సి రావడం చాలా కష్టం. కాని మన దగ్గర అలాగే జరుగుతుంటుంది. నడక, వ్యాయామం ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన దగ్గర బలం అంటే శారీరక బలమే. కాని మానసిక బలం ముఖ్యం. శరీరానికి ఎలా వ్యాయామం అవసరమో మనసుకు అంతే వ్యాయామం అవసరం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటారు నీరజ . -
రాజకీయ సవాళ్లపై... సాధికార బృందం
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ‘సాధికార కార్యాచరణ బృందం–2024’ను ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. దాంతోపాటు పార్టీపరమైన మేధోమథన సదస్సు ఏర్పాటు చేయాలని పార్టీ చీఫ్ సోనియాగాంధీ నిర్ణయించారు. ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ పేరిట ఈ సదస్సు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మే 13 నుంచి 15 దాకా మూడు రోజుల పాటు జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు తెలిపారు. సోమవారం జరిగిన కీలక సమావేశంలో సోనియా ఈ మేరకు నిర్ణయించినట్టు వివరించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడంపై ప్రశ్నించగా ఆయన నేరుగా బదులివ్వలేదు. ‘‘పీకే ప్రజెంటేషన్‌పై పార్టీ కమిటీ ఇచ్చిన నివేదిక, వచ్చే సాధారణ, అసెంబ్లీల ఎన్నికల్లో పార్టీ వ్యూహం తదితరాలపై భేటీలో సోనియా చర్చించారు. అనంతరం సాధికార బృందం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సోనియా నివాసం 10, జన్‌పథ్‌లో జరిగిన 3 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు’’ అని సుర్జేవాలా వెల్లడించారు. రాజకీయ ప్యానల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం తదితరాలపై చింతన్ శిబిర్‌లో చర్చ జరుగుతుందని సుర్జేవాలా తెలిపారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, సవాళ్లు, రైతులు, రైతు కూలీల సమస్యలు, యువత సంక్షేమం, శ్రేయస్సు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మత, భాషా మైనారిటీలు, మహిళా సామాజిక న్యాయం, సాధికారత తదితరాలపై చింతన్ శిబిర్‌లో లోతుగా చర్చించనున్నట్టు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమ ప్రణాళికలకు సోనియా ఆమోదముద్ర వేశారు. తీర్మాన పత్రాలను తయారీ తదితరాలకు ఆరు సమన్వయ ప్యానళ్లను నియమించారు. రాజకీయ తీర్మాన ప్యానల్లో ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అవకాశమిచ్చారు. ఈ ప్యానెల్‌కు మల్లికార్జున్ ఖర్గే కన్వీనర్. సామాజిక న్యాయం, సాధికారత ప్యానల్‌కు సల్మాన్ ఖుర్షీద్, ఆర్థిక ప్యానల్‌కు చిదంబరం, సంస్థాగత వ్యవహారాల ప్యానల్‌కు ముకుల్ వాస్నిక్, రైతాంగం, వ్యవసాయ రంగ ప్యానల్‌కు భూపీందర్ సింగ్ హుడా, యువజన వ్యవహారాల ప్యానల్‌కు అమరేందర్ సింగ్ వారింగ్ కన్వీనర్లు. చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, ప్రత్యేక ఆహ్వానితులు 400 మందికిపైగా పాల్గొంటారు. -
బాలికల సాధికారతకు ప్రాధాన్యం: మోదీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికా సాధికారతకు పెద్ద పీట వేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అమ్మాయిలకు మర్యాద దక్కేలా, అన్ని రకాల అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్ చేస్తూ ‘‘బాలికల సాధికారతపై మాకున్న చిత్తశుద్ధిని జాతీయ బాలికా దినోత్సవం మాకు గుర్తు చేస్తుంది. వివిధ రంగాల్లో అమ్మాయిలు సాధించిన విజయాలను నెమరువేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో మాటామంతీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి మద్దతునివ్వాలని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుమతి గ్రహీతలతో ఆన్లైన్లో ముచ్చటించిన ప్రధాని కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ యువతను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తున్నామని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం కోసం విధి నిర్వహణ నేతాజీ ప్రథమ కర్తవ్యమని, దాని నుంచి స్ఫూర్తి పొంది ప్రతీ ఒక్కరూ దేశాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. సృజనాత్మక ఆలోచనలతో యువత ముందుకు వెళ్లడం దేశానికే గర్వకారణమన్నారు. -
‘ఇజ్జత్ భయంతో లైంగిక వేధింపులపై మౌనంగా ఉండవద్దు’
సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్): ‘ఇజ్జత్’ భయంతో లైంగిక వేధింపులపై మౌనంగా ఉండవద్దని, అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ)కి నివేదించాలని ప్రముఖ మహిళా ఉద్యమకారిణి, రచయిత్రి జమీలా నిషాత్ బాలికలకు సూచించారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని సయ్యద్ హమీద్‌సెంట్రల్ లైబ్రరీలో ఐసీసీ మనూ ఆధ్వర్యంలో ‘సెక్సువల్ హరాష్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్–2013పై అవగాహనా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాలికలు, మహిళలు అనుచితంగా భావించే ఏఅంశంపైనైనా ఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా పలు సంఘటనలు, లైంగిక వేధింపుల యొక్క వివిధ షేడ్స్, ముఖ్యంగా పరిశోధనా సమయంలో జరిగే అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షాహిదా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, వికలాంగులకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులను చేర్చడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాయన్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐసీసీ చైర్çపర్సన్ ప్రొఫెసర్ షుగుప్తా షాహిన్, ఐసీసీ కన్వీనర్ డాక్టర్ షంషుద్దిన్ అన్సారీ, సభ్యుడు డాక్టర్ బీబీ రజాఖాతూన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: యువతి అదృశ్యం -
Congress Party: టార్గెట్ 72
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో.. అధికారం దక్కాలంటే కనీసం 60 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్న 72 స్థానాలు టార్గెట్‌గా పెట్టుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పకడ్బందీ కసరత్తు ప్రారంభించారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాలను ఏ (గెలిచే అవకాశం) బీ (ఓ మోస్తరు అవకాశం), సీ (అవకాశం లేదు) కేటగిరీలుగా వర్గీకరించిన రేవంత్ వాటిలో గెలిచే అవకాశాలున్న స్థానా లపై దృష్టి సారించారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా ఆయా స్థానాల్లో గెలుపొందేలా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆయన ఒక అంచనాకు వచ్చారని, గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను ప్రత్యేక కేటగిరీ కింద తీసుకుని గెలుపు వ్యూహాలను రచించే పనిలో పడ్డారని సమాచారం. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలనే యోచనలో రేవంత్ ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణపైనే గురి.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బట్టి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అంచనా వేస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌లతో పాటు ఖమ్మంలోని మెజార్టీ స్థానాల్లో ఈసారి గట్టిపోటీ ఇస్తామని భావిస్తోంది. కచ్చితంగా టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ ఐదు జిల్లాల్లో కలిపి 50కి పైగా స్థానాలుండగా (రంగారెడ్డి జిల్లాలో గ్రేటర్ పరిధిలోకి వచ్చే స్థానాలను మినహాయించి) అందులో కనీసం 40 స్థానా ల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇక నగర శివార్లలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్లతో పాటు హైదరాబాద్ జిల్లాలోకి వచ్చే నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్ స్థానాలపై కీలక కసరత్తు ను ఇప్పటికే రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ స్థానా ల్లో గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు. మొత్తం మీద ఈ 60కి పైగా స్థానాల్లో 45 గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముంటుందనే అంచనాతో ఆయన ముందుకెళుతున్నారు. ఇక్కడ గట్టిగా ప్రయత్నించాలి ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందని, అయితే పార్టీ పరంగా కీలక నాయకులున్న స్థానాల్లో గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం దక్షిణ తెలంగాణ కంటే ముందుగానే కార్యరంగంలోకి దిగాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని ముఖ్య నేతలు, వారు పోటీ చేయాలనుకునే స్థానాల జాబితా ఇప్పటికే తయారయింది. ఈ స్థానాల్లో కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమని, కాంగ్రెస్ నేతల వ్యక్తిగత చరిష్మాతో పాటు గత మూడు, నాలుగు సార్లుగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న టీఆర్ఎస్ నేతలపై ఉన్న వ్యతిరేకత ఇందుకు ఉపకరిస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ కోణంలోనే ఉత్తర తెలంగాణలోని 45–50 నియోజకవర్గాలపై రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. తాను టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంత మెరుగుపడిందని భావిస్తున్న ఆయన.. ఇదే అదనుగా ఉత్తర తెలంగాణలో జోరు పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించారు. మూడో సభను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌లో నిర్వహించబోతున్నారు. గజ్వేల్‌లో విజయవంతంగా సభను నిర్వహించడం ద్వారా ఉత్తర తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కేడర్‌ను ఎన్నికల పోరాటానికి సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. చురుగ్గా లేకపోతే గుర్తింపు ఉండదు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్న రేవంత్ వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. పనితీరు మెరుగుపడాల్సిందేనని, చురుగ్గా లేకపోతే పార్టీలో తగిన గుర్తింపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ సమన్వయకర్తల సమావేశంలో ఆయన బహిరంగంగానే పార్టీ నేతలకు చురకలంటించారు. ‘దండోరా కార్యక్రమాన్ని పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గాల వారీగా నివేదికలివ్వాలి. మండల అధ్యక్షుల పనితీరు బాగుంటేనే నియోజకవర్గాల్లో రాజకీయంగా ముందుకెళ్లగలుగుతాం. ప్రజాసమస్యలపై పోరాటాల్లో నాయకులు చురుగ్గా వ్యవహరించాల్సిందే..’అని రేవంత్ స్పష్టం చేశారు. వరంగల్ దండోరా సభకు రాహుల్! మరోవైపు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్న వరంగల్ పార్లమెంటు పరిధిలో వచ్చే నెల 7 నుంచి 17వ తేదీ మధ్య పెద్ద ఎత్తున ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని, దానికి రాహుల్‌గాంధీని తీసుకురావాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సభల తర్వాత ఉత్తర తెలంగాణ పార్టీ పరిస్థితిలో మరింత మార్పు కనిపిస్తుందనే ధీమా రేవంత్ శిబిరంలో వ్యక్తమవుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ అనుబంధ సంఘాల బలోపేతంపై కూడా రేవంత్ దృష్టి సారించారు. పార్టీకి పట్టుకొమ్మలైన అనుబంధ సంఘాలు నిర్లిప్తంగా ఉండకూడదని, అనుబంధ సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తే ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే భావనలో ఆయన ఉన్నట్టు సమాచారం. -
సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా?
బౌద్ధనగర్ (హైదరాబాద్): దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ దళిత సాధికారతపై మాట్లాడటం పచ్చి మోసమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దళిత సాధికారతపై ఆదివారం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే సమావేశాలు జరపడం, తీర్మానాలు చేయడం కాకుండా వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదన్నారు. దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు సాధికారత గురించి మాట్లాడటం పచ్చిమోసం, నిలువెత్తు నయ వంచనకు ప్రతీక అని పేర్కొన్నారు. చదవండి : Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్ ప్రశంసలు -
రంగమేదైనా మహిళలే రాణిస్తున్నారు..
చిత్తూరు: వంటింటి నుంచి మొదలైన అతివ అడుగులు అంతరిక్షాన్ని స్పృశిస్తున్నాయి. సాగరం కన్నా లోతైన ఆమె మదిలో పుడుతున్న ఆలోచనలు ప్రపంచ దిశను మార్చేస్తున్నాయి. ఇంటా బయట ఆమె తల్లిగా.. చెల్లిగా.. భార్యగా.. కోడలిగా.. ఎలాంటి బాధ్యతనైనా నిర్వర్తించడంలో ఆమె నిరుపమాన ప్రేమమూర్తి. కలెక్టర్.. డాక్టర్..డ్రైవర్.. రచయిత.. సమాజసేవకురాలు.. రాజకీయనేత.. రంగం ఏదైనా ఇంతింతై రాణించగల సత్తా ఆమె సొంతం. తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తూ, విభిన్న రంగాల్లో విజయగీతిక ఆలపిస్తున్న మహిళల గాధలు మహిళాదినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. పల్లె నుంచి ఆర్థిక రాజధానికి.. ఈమె పేరు ఉషారాణి. పెద్దతిప్పసముంద్రం మండలంలోని మారుమూలపల్లెలో పుట్టింది. ప్రభుత్వ పాఠశాలల చదువుకుంది. అయితేనేం.. దేశ ఆర్థిక రాజధాని మంబైలోని ఎస్బీఐ పధాన కార్యాలయంలో డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్థానం విద్యారి్థనులకు స్ఫూర్తిదాయకం. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన కొటికె మీనాక్షమ్మ, పట్టాభి రామచంద్రారావ్ దంపతులకు ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్న కుమార్తె ఉషారాణి స్వగ్రామం బడికాయలపల్లె నుంచి మదనపల్లెకు మకాం మారింది. ఏడో తరగతి వరకు మదనపల్లె మున్సిపల్ స్కూల్, పదో తరగతి ప్రభుత్వ జీఆర్టీ స్కూల్, ఇంటర్, డిగ్రీ బీటీ కాలేజీలో చదివారు. అనంతపురం ఎస్కే. యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. మదనపల్లెలో ఏడేళ్లు లా ప్రాక్టీస్ చేశారు. 1995లో ఎస్బీలో లా ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2018 వరకు వరంగల్, హైదరాబాద్ బ్రాంచ్‌ల్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2019 నుంచి ముంబయిలోని ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్లో డీజీఎంగా కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లా చెన్నుపల్లెకు చెందిన మురళీమోహన్‌తో ఉషారాణికి వివాహం జరిగింది. భర్త హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది. ఒక్కకే కుమార్తె యశస్విని ఢిల్లీ వర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీలో పీహెచ్డీ చేస్తోంది. – పెద్దతిప్పసముద్రం మహిళలే పాలకులు మదనపల్లె : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం. ఈ మాట మున్సిపల్ పాలకవర్గంలో సార్థకమైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ మహిళా దినోత్సవ కానుకగా వారికే అధిక సీట్లు కేటాయింది. దీంతో మున్సిపాలిటీలో 58 ఏళ్ల చరిత్ర తిరగరాశారు. సుదీర్ఘకాల యానంలో ఏడుగురు పురుషులే ఇప్పటి వరకు చైర్మన్లుగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ప్రాధాన్యం వల్ల తొలిసారి మహిళ చైర్పర్సన్ పాలన సాగించనున్నారు. పట్టణంలో 35 వార్డుల్లో మహిళలు 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 9వార్డుల్లో పోటీలో ఉన్నారు. దీంతో మహిళల సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. -
ఠాగూర్ కోరుకున్నది ‘ఆత్మనిర్భర్ భారత్’నే
శాంతినికేతన్: భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధిం చాలని గురుదేవుడు రవీం ద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షిం చారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు. విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని గురువారం ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ వర్సిటీ, అనంతరం కాలంలో విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం విశేషంగా కృషి చేసిందని ప్రధాని కొనియాడారు. కాగా, ఈ ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ పరిణామం కేంద్రం, టీఎంసీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేపింది. ఆ పేరులోనే ఉంది గురుదేవుడు కలలుగన్న విశ్వ–భారతి రూపమే ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్. భారత్ అభివృద్ధి, తద్వారా ప్రపంచ పురోగతియే ప్రభుత్వ లక్ష్యం. దీనిద్వారా భారత్ సాధికారత, అభివృద్ధి.. అంతిమంగా ప్రపంచ అభివృద్ధి సాధ్యం’అని అన్నారు. ‘జాతీయవాద భావనతోపాటు సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించేందుకు ఠాగూర్ ఈ సంస్థను స్ధాపించారు. భారత్‌ను ప్రపంచానికి గల సంబంధం ‘విశ్వ భారతి’పేరులోనే ఉంది. భారత్‌లో ఉత్తమమైన వాటి నుంచి ప్రపంచం ప్రయోజనం పొందాలి అనేదే రవీంద్రుని కల’ అని తెలిపారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని శనివారం ప్రధాని ప్రారంభించనున్నారు. -
స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. డీల్‌లో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ (సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా నియమిస్తారు. కరోనా కల్లోలం చెలరేగినప్పు డు, లాక్డౌన్ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ సూద్ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్ మనీ తెలిపింది. కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా, ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని స్పైస్ మనీఫౌండర్ దిలీప్ మోడీ వెల్లడించారు. ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన సాంకేతిక శక్తిని అందిస్తామని ‘భారత్’ ప్రతి మూలలో స్వావలంబన, వ్యవస్థాపకత, ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఆత్మనీర్భర్ భారత్ కోసం , ప్రతీ గ్రామాన్ని డిజిటల్‌గా బలోపేతం చేయడం కోసం స్పైస్ మనీతో తన అనుబంధం ఉపయోగపడనుందని విశ్వసిస్తున్నానని ఈ సందర్భంగా సోనూ సూద్ తెలిపారు. -
అదృష్టం సరే అర్హతను కల్పిస్తున్నామా?
ఒక ఆలోచన ఆడపిల్లను చిట్టి తల్లి బంగారు తల్లి అంటాం మనం. అదృష్టం అంటాం మనం. అమ్మాయిది లక్ష్మీ పాదం అని మురిసిపోతాం. తల్లులకు తండ్రులకు సాధారణ స్థాయిలో ఈ మురిపెం ఉంటుంది. అయితే దీనికి ఆవల ఈ అదృష్ట దేవతకు సకల అర్హతలు అందే వీలు కల్పించడం జరుగుతున్నదా? ఆడపిల్ల చేత డబ్బు ఇచ్చి బీరువాలో దాచి పెట్టించే సెంటిమెంటు పాటించే తల్లిదండ్రులు తమ ఆర్థిక, వ్యాపార వారసత్వాలలో ఆమెకు మగ పిల్లలతో పాటు సమాన అవకాశం ఇవ్వొచ్చనే ఆలోచనకు వస్తున్నారా? ఆడపిల్ల కొన్నింటికే యోగ్యురాలు, కొన్నింటికే పరిమితం అనే ఆలోచనా చట్రం ఉన్నంత కాలం ఆమెను అదృష్టానికి చిహ్నమని ఎంత భావించినా అసలైన అదృష్టం ఆమెకు దక్కుతుందా? ఆమె అదృష్టం ఆమెతో అదృష్టం ఆమెకు సమాన అవకాశాలను కల్పించడంలోనే ఉంటుందని ఇటీవలి ఒక చర్చ సూచిస్తోంది. ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఒక తండ్రి కొత్తగా కొన్న ట్రాక్టర్ మీద తన చిన్న కుమార్తె అదృష్టానికి చిహ్నంగా ఆమె పాదముద్రలను ముద్రించాడు. కుమార్తెకు విలువనిచ్చినందుకు ఆ తండ్రిని చాలా మంది ప్రశంసించారు. ఎందుకంటే మన కుటుంబాల్లోని ఆడపిల్లలను అదృష్టానికి గుర్తుగా చూస్తారు. ఆడపిల్ల పాదం ఇటు పుట్టింటికీ, అటు అత్తగారింటికీ అత్యంత శుభాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఉత్తర భారతదేశంలో ఘరోండా (దీపావళి సందర్భంగా జరుపుకునే పూజ) సమయంలో కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే దేవతలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ఓ తండ్రి పంచుకున్నాడు. ఈ నమ్మకాలు ఆడపిల్ల ఎంత విలువైనదో చెప్పేందుకు పెద్దలు ఏర్పరిచిన సంకేతాలు అనుకోవచ్చు. ఇవి ఆడ శిశుహత్యల రేటుకు విరుద్ధంగా సానుకూల సంకేతాలను ఇస్తాయి. అయితే, రచయిత్రి, నెటిజన్ రుద్రాణి గుప్త ఈ వీడియోపై స్పందిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇవీ ఆ ప్రశ్నలు... ‘ఒక తండ్రి తన కుమార్తెను అధికంగా ప్రేమిస్తూండవచ్చు. ఆ తండ్రి మనసును మనం వేనోళ్లగా కొనియాడవచ్చు. అయితే, ఆ తండ్రి ఆమెను తన కుటుంబ వ్యాపారానికి అదృష్టంగా మాత్రమే చూసుకుంటే సరిపోతుందా?! స్త్రీని డబ్బుకు, శ్రేయస్సుకి దేవతగా కొనియాడిన తల్లిదండ్రులు నిజ జీవితంలో ఆమె ఆర్థిక సాధికారతకు మార్గం వేస్తున్నారా? కూతురును లక్ష్మీగా భావించే కుటుంబాలు తమ కుటుంబ వ్యాపారాలలో ఆమెను వారసురాలిగా, యజమానిగా ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నారా?!’ ఇవీ నెటిజన్ రుద్రాణి గుప్త సంధించిన ప్రశ్నలు. వీటితో పాటు తన కుటుంబంలోనే జరిగిన ఓ సంఘటననూ ఆమె పంచుకున్నారు. వ్యాపారానికి వారసురాలు అవగలదా?! ‘‘ఈ వీడియో నా ఇంట్లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒకటి గుర్తు చేసింది. నా తండ్రి తన ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటుపై కూర్చోవడానికి నా చెల్లెలికి సహాయం చేశాడు. ఆమె వల్ల వచ్చిన అదృష్టంగా భావించి, ఆమె పుట్టినరోజున ఆ ట్రక్కు కొన్నాడు. ఆ క్షణంలో సరదాగా కొన్ని సెల్ఫీలు తీసుకున్నారు. ఎప్పుడైనా ఆమె ఆ ట్రక్కు లేదా వ్యాపారాన్ని సొంతం చేసుకుంటుందా అనే ఆలోచన నా తండ్రి ఊహల్లో కూడా వస్తుందంటే నేను నమ్మను. ‘ఆమె’ ఎప్పుడైనా వ్యాపారానికి వారసత్వంగా ఉంటుందా? ‘ఆమె’ సంపాదనతో కుటుంబం నడుస్తుందని గర్వంగా చెప్పుకునే స్థితి ఉంటుందా? ఆమె ఆత్మవిశ్వాసంతో కుటుంబ వ్యాపారాన్ని నడుపుతుందా? అంటే మనలో చాలా మంది దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నా చెల్లెలు వివాహం చేసుకుని మరొక కుటుంబానికి పంపబడుతుందనే భావనలో నా కుటుంబం ఇప్పటికే ఉంది. అప్పుడు వ్యాపారాన్ని ఆమెకు అప్పగించే పాయింట్ ఎలా చేరుతుంది? నేను మరింత వాదించడానికి ముందు, ఓ విషయం గమనించాను. నా సోదరుడు అప్పటికే నా తండ్రి రోలింగ్ కుర్చీపై కూర్చోవడానికి వారసుడిగా సిద్ధంగా ఉన్నాడు. (నా చెల్లెలు అత్తింటికి వెళ్లినా అక్కడి వ్యాపారాల్లోనూ ఆమె ఎప్పటికీ కీలకం కాలేదు.. ఎక్కడో అరుదుగా ఎంతో శ్రమ పడితే తప్ప. అది మరో గమనించాల్సిన విషయం) సామర్థ్యం ఎంపిక కూతురికేనా?! వీడియో చూశాక రేపు ఆ కుమార్తె పెద్దయ్యాక, తండ్రి ఆమెను ట్రాక్టర్ నడపడానికి అనుమతిస్తాడా అనే ప్రశ్న దగ్గరే నా ఆలోచన ఆగిపోయింది. ఆమె ఎర్రటి పాదముద్రలతో అలంకరించబడిన ట్రాక్టర్ ఎప్పుడైనా ఆమె సాధికారతకు మాధ్యమంగా మారుతుందా? తల్లితండ్రుల ఆస్తిలో ‘ఆమె’ వాటా ఉంటుందా అని నేను నా తల్లిని అడిగినప్పుడు, ఆమె వెంటనే దానిని ఖండించింది. ఆమె సోదరుడు ఆస్తికి నిజమైన వారసుడని, దానిలో ఆమె వాటా ఐచ్ఛికమని చెప్పింది. చట్ట ప్రకారం కుమార్తె వారసురాలు అయితే, ఆమెలో సామర్థ్యం ఉందా, లేదా అని వేరొకరు ఎందుకు నిర్ణయించాలి? ఒక కొడుకు తన సామర్ధ్యం లేదా ఎంపికతో సంబంధం లేకుండా, అప్పటికే వారసుడిగా భావించబడుతున్నప్పుడు, కుమార్తె వారసురాలిగా తన సమర్థతను ఎందుకు నిరూపించుకోవాలి?! నిరుపేద కూతురు..?! మన కుటుంబాలు కుమార్తెను లక్ష్మిగా వర్ణిస్తాయన్నది కాదనలేని నిజం. కానీ, నిరుపేద కుటుంబాల్లో కూతురు చదువుకోవడానికంటే ముందు పని చేయాల్సి వస్తే ఆ కుటుంబాల్లో లక్ష్మి స్థానం ఏంటి?! కుటుంబానికి సహాయంగా పనిచేసే చాలా మంది మహిళలు, కూలీలు తమ కుమార్తెలను అదే పనిలోకి లాగడం వల్ల వారు ఆ పనుల్లోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆమె వయస్సు 18 ఏళ్ళకు మించి ఉంటే, కుమార్తె తనకు నచ్చిన విద్య, ఉపాధిని పొందడం కంటే కుటుంబం కోసం సంపాదించాలనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంటి లక్ష్మి కావడం అంటే ఒక స్త్రీ తన కుటుంబానికి.. ఆ కుటుంబ ఆనందానికి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనీ ఆ పేరుతో ఇంటి గడప లోపలే ఉండిపోవాలి అనేనా సమాజపు ఆలోచన? ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? ప్రియమైన తల్లిదండ్రులారా మీ కుమార్తెలను అదృష్టదేవతగా చూసే బదులు ఆమెను కుటుంబంలో నిజమైన వారసురాలిగా పరిగణించండి. ఆమెను ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగనివ్వండి. దాని కోసం ఆమె చేపట్టే మార్గం కూడా ఆమెకు నచ్చినదిగా ఉండాలి. ఆమెను ఎదగనివ్వండి, ఎన్నుకోనివ్వండి, సంపాదించనీయండి, పాలించనీయండి. అదృష్ట స్వరూపం అని ఓ వైపు అంటూనే మరోవైపు ‘నీకు ఇందులో హక్కు లేదు’, ‘నీవు ఆడ..పిల్లవు’ అని అంతర్లీనంగా హెచ్చరికలు జారీచేయడం ఎందుకు. ద్వంద్వ ప్రమాణాల(డబుల్ స్టాండర్స్)తో కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. ఆడపిల్లను ఆడపిల్లగానైనా ఎదగనివ్వండి.’’ ఇటీవల కోర్టులో నానుతున్న వల్లి అరుణాచలం కేసు విషయమే తీసుకుందాం. తమిళనాడులోని అంబాడి ఇన్వెస్ట్మెంట్ బోర్డ్‌లో వల్లి అరుణాచలంను నియమించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా మురుగప్ప (ఆమె పుట్టింటివారే) కుటుంబ సభ్యులే అధికంగా ఓటువేశారు. భారత రాజ్యాంగం ప్రకారం కుమార్తెకు తన కుటుంబం ఆస్తి, వ్యాపారాన్ని వారసత్వంగా పొందటానికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ, వల్లి అరుణాచలం వంటి ప్రభావవంతమైన, విద్యావంతురాలైన స్త్రీ తన రాజ్యాంగ హక్కులను పొందటానికి సమర్థతను నిరూపించుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయవలసి వస్తే, సాధారణ కుటుంబాలు మరింత శ్రద్ధగా ఉంటాయని ఆశించవచ్చా?! వల్లి అరుణాచలం కొత్తగా కొనుగోలు చేసి ట్రాక్టర్ మీద కుమార్తె పాదముద్రలను ముద్రిస్తున్న తండ్రి – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రైళ్ల ప్రైవేటీకరణకు కమిటీ
న్యూఢిల్లీ: నిర్ణీత కాలపరిమితితో దేశంలోని 150 పాసింజర్ రైళ్లను ప్రైవేటీకరించేందుకు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేందుకు కేంద్రం మరో అడుగువేసింది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్‌కు ఇటీవల లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే సాధికారిక యంత్రాంగం (కమిటీ) ఈ ప్రక్రియ అమలు తీరుని పర్యవేక్షిస్తుందని ఆయన ఆ లేఖలో తెలిపారు. వీకే యాదవ్, అమితాబ్‌లతోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు. రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు, ట్రాఫిక్ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలో భాగం చేయాలని అమితాబ్ కాంత్ తెలిపారు. ‘ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా తొలుత కనీసం 50 రైల్వేస్టేషన్లను నవీకరించాలి. అలాగే అంతర్జాతీయస్థాయి సదుపాయాలతో, ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిదశలో 150 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ప్రైవేటు ఆపరేటర్లకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది’ అని అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియను ఆమోదించే అధికారం ఈ కమిటీకే ఉంటుంది. ‘ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంతో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తే, సాధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. -
ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు. భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాల నిర్మూలన మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు. ప్రసంగం సైడ్‌లైట్స్ ► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ను, రఫేల్ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు. ► ప్రసంగసమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్ ఉపయోగించడం కెమెరాల కంటపడింది. ► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్ హాల్ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు. కోవింద్ ఏడాదిలో ఇది రెండోసారి రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్ కలర్ జోధ్‌పురి సూట్ (బంద్గలా) ధరించిన కోవింద్ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి. -
ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి
న్యూఢిల్లీ: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్ ఖాతాలో ఫీజు డిపాజిట్ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. -
సంపూర్ణ స్వావలంబనేది?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో మహిళ సంఘాల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో అంతరం కనిపిస్తోంది. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సంఖ్య భారీగా కనబడుతున్నా ఆర్థిక స్వావలంబనను కొన్ని సంఘాలు మాత్రమే సాధించగలుగుతున్నాయి. మిగతా సంఘాలు వెనకబడుతున్నాయి. బ్యాంక్ లింకేజీకే అర్హత సాధించని పరిస్థితి వేలాది ఎస్హెచ్జీలది. ఒకవేళ అర్హత సాధించినా రుణంపొందినవి 40 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రుణ ప్రయోజనం పొందడంలో సంఘాల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది. ఏటేటా సంఘాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సంపూర్ణ స్వావలంబన సాధించడంలో గ్రామీణాభివృద్ధి సంస్థ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక పరిపుష్టి ఏదీ.. మహిళ స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుకబడటం, వీటి కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాల్సిన సిబ్బంది చేతివాటం కారణంగా మహిళ సంఘాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఒక సంఘానికి రుణం మంజూరు చేసేందుకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇందులో కిందినుంచి పైవరకు పంపకాలు ఉండడంతోనే పరిస్థితులు ఇలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాలు తీసుకున్న రుణంపై పావలా వడ్డీ చెల్లిస్తుండగా, వాటిని తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. అయితే రెండేళ్లుగా పావలా వడ్డీ జమ కాకపోవడంతో పలు సంఘాలు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నాయి. జిల్లాలో సుమారు రూ.30కోట్ల వరకు పావలా వడ్డీ కింద మహిళ సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. రుణ లక్ష్యంలో 62 శాతమే ప్రగతి.. మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 2017–18 సంవత్సరం కోసం ప్రభుత్వం నిర్దేషించిన రుణ లక్ష్యంలో కేవలం 62 శాతం మాత్రమే ప్రగతి కనిపిస్తోంది. బ్యాంక్ లింకేజీ కింద అనేక సంఘాలు రుణం పొందేందుకు అర్హత సాధించినప్పటికి చివరికి 40 శాతం సంఘాలకు మాత్రమే ఈ ప్రయోజనం దక్కింది. మిగతా 60 శాతం సంఘాలు రుణం పొందలేకపోయాయి. 2016–17 కంటే 2017–18కి బ్యాంక్ లింకేజీ కింద రుణ లక్ష్యం భారీగా పెంచినప్పటికీ ప్రగతి మాత్రం అందుకోలేకపోయింది. గతేడాది 99.87 శాతం ప్రగతి సాధించగా, ఈఏడాది 62 శాతానికే పరిమితం కావడం గమనార్హం. గతేడాదితో పోల్చితే రుణ ప్రయోజనం పొందిన సంఘాల సంఖ్య అమాంతంగా తగ్గిపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు ఈ అవాంతరాన్ని సరిదిద్దాల్సి ఉండగా, సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే పరిస్థితి ఇలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రికవరీ కాకపోవడంతోనే.. జిల్లాలో ఈ ఏడాది మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రుణ మంజూరులో ప్రధాన బ్యాంకులు సహకరించలేదు. ఈ కారణంగానే రుణ మంజూరులో తక్కువ శాతం నమోదైంది. అదే సమయంలో గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో బ్యాంక్ లింకేజీ తక్కువగా ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. గతంలో రుణం తీసుకున్న సంఘాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ లింకేజీకి అర్హత సాధించలేకపోయాయి. రికవరీ పూర్‌గా ఉండటం కూడా వీటన్నింటికి కారణమైంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. – రాజేశ్వర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
ఓబీసీలకు రూ. 200 కోట్లతో ఫండ్
సాక్షి,న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ వెల్లడించింది. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్ ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపింది. గతంతో పోల్చితే ఈసారి కేటాయింపులు 12.10 శాతం పెరిగి రూ. 7,750 కోట్లకు చేరాయంది. వివిధ పథకాలకు 11.57 శాతం కేటాయింపులు పెరగగా, ఓబీసీ సంక్షేమానికి 41.03 శాతం కేటాయింపులు పెరిగాయి. గతేడాది ఎస్సీలకు అమలుచేసిన తరహాలో ఓబీసీలకూ రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.140 కోట్లను 2018–19లో సమకూర్చనుంది. మత్తుపదార్థాల బారిన పడ్డ వారి పునరావాసం కోసం తొలిసారిగా జాతీయ సర్వే ద్వారా వారిని గుర్తిస్తారు. ఇందుకోసం 185 జిల్లాల్లో, 1.5 లక్షల కుటుంబాలపై చేస్తున్న సర్వే ఏప్రిల్ నాటికి పూర్తవనుంది. వీరి పునరావాసానికి రూ. 200 కోట్లు కేటాయించనున్నారు. ఆదాయ పరిమితి పెంపు: ఓబీసీ ప్రీమెట్రిక్ సాల్కర్‌షిప్ పొందేందుకు ప్రస్తుతమున్న వార్షికాదాయ పరిమితిని రూ. 44,500 నుంచి రూ. 2.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచింది. డేస్కాలర్లకు స్టైఫండ్‌ను రూ. 225కు, హాస్టల్లో ఉండేవారికి రూ. 525కు పెంచింది. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. స్టైపండ్‌ను స్థానిక విద్యార్థులకు రూ. 2,000కు, ఇతర ప్రాంతాల విద్యార్థులకు రూ.5,000కు పెంచింది. డేస్కాలర్లకు ఒకటి నుంచి పది వరకు అన్ని తరగతులకు ఒకేలా రూ. 100 ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు ఇకపై మూడు నుంచి పది వరకు అన్ని తరగతులకు రూ. 500 ఇవ్వనున్నారు. షెడ్యూలు కులాల విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ కింద సాయాన్ని రూ. 28 వేలకు పెంచారు. -
చలనశక్తే సాధికారత
ఆలోచనం చలనశక్తి మహిళల కదలికలనే కాదు, వారి ఆలోచనలను కూడా చలనశీలం చేస్తుంది. ఇప్పుడు మహిళలకి కావల్సినది, వారినో మూలన ఉంచి అన్నలిచ్చే రక్షణ కాదు. స్వతంత్రతనిచ్చే చలనశక్తే. అర్ధరాత్రి రహదార్లపై ఒక మహిళ స్వేచ్ఛగా నడవగలిగిన రోజే, భారతదేశం తన స్వాతంత్య్రాన్ని సాధించిందని మనం చెప్పగలం అన్నారు గాంధీ. ఆ వ్యాఖ్య రక్షణ గురించే కాకుండా అంతర్లీనంగా స్త్రీ మొబిలిటీ (చలన శక్తి)ని కూడా ప్రస్తావించిందేమో.. తెరాస ఎంపీ కవిత ‘‘సిస్టర్స్ ఫర్ చేంజ్’’ అని రక్షాబంధన్ రోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి స్లోగన్ ‘‘అన్న మనకు రక్ష–అన్నకు హెల్మెట్ రక్ష’’. రాఖీ కట్టి హెల్మెట్ ఇచ్చి సోదరుల ప్రాణాలను ప్రమాదాలనుంచి కాపాడండి అని ఆ కార్యక్రమ సందేశం. ఇందులో మనకు బాహ్యంగా కనిపిస్తున్న అంశం తోడబుట్టిన వారి మీద ప్రేమ. కానీ ఈ నినాదం చాలా బలమైన మూస ధోరణిలో పురుషస్వామ్యాన్ని మళ్లీ నొక్కి చెబు తోంది. చలనశక్తి ఉన్న అన్నకు హెల్మెట్ రక్ష, ఇంట్లో వుండే ఆడవాళ్లకు అన్న లేదా మరో మగవాడు రక్ష అనే భావజాలాన్ని ఇది వ్యాపింపచేస్తుంది. ‘జెండర్ ఈక్వాలిటీ అండ్ డెవలప్మెంట్’ అనే పేరుతో వరల్డ్ బ్యాంకు 2012లో ప్రచురించిన రిపోర్టుకి ‘జెండర్ అండ్ మొబిలిటీ ఇన్ ది డెవలపింగ్ వరల్డ్’ అనేది ఒక నేపథ్య వ్యాసం. అందులో వారు ప్రొఫెసర్ సెలెస్ట్ లాంగన్ పేర్కొన్న ‘మొబిలిటీ డిసెబిలిటీ’ భావనని ఉటంకించారు. రూసో తన ‘సోషల్ కాంట్రాక్టు’లో.. పరుగెత్తాలని ఆరాటపడే శారీరక వైకల్యంగల వ్యక్తీ, శారీరకంగా అంతా బాగుండి ఆ కోరిక లేని వ్యక్తీ ఇద్దరూ ఒక్క చోటే ఉండిపోతారంటారు. ఈ మాటల్ని లాంగన్ ఖండిస్తారు. సామాజిక వాతావరణం, ఆచారాలే చలన శక్తిని, చలన హీనతను సృష్టించగలవు. ఇవి సర్వాంగాలు సక్రమంగా ఉన్న వ్యక్తిని కూడా చలనహీనుల్ని చేయగలవు. సమాజం, ఆచారాల పేరిట స్త్రీలను అలా నిస్సహాయులను చేసింది అంటారామె. స్త్రీలు కీలక స్థానాలలో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమో అనే అభిప్రాయం ఈ వ్యాసాలలో వ్యక్తమయింది కానీ, పురుషులు స్త్రీల శరీరాలనే కాదు మెదడులను కూడా నియంత్రించారు కదా. అందుకే కీలక పదవులలో ఉన్న కొద్దిమంది స్త్రీలు కూడా పైకి ఆధునికులుగా కనిపిస్తూ వెనుకబాటు భావజాలాన్నే ప్రచారం చేస్తుంటారు. స్త్రీవాద ఉద్యమమిచ్చిన చైతన్యాలలో చలనశక్తి కూడా ఒకటి. 1896 సంవత్సరంలో అమెరికన్ సివిల్ రైట్స్ లీడర్ సుసాన్ బి ఆంథోనీ ‘ద్విచక్ర వాహనం స్త్రీలకు చాలా విముక్తిని ఇచ్చింది. అది ఎక్కిన మరుక్షణం వారికి స్వావలంబన భావాలు కలుగుతాయి’ అంటారు. నా భర్త ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాలలో ఉన్నపుడు నేను నా స్కూటీపై కూతుర్ని తీసుకుని చుట్టుపక్కల సంతాలీ పాడాలు తిరిగేదానిని. నా మొబిలిటీ నాకిచ్చిన స్వేచ్ఛ వారిని నాకు స్నేహితుల్ని చేసింది. నెల్లూరులో నాకొక స్నేహితురాలు ఉంది. చిన్నప్పుడు తన సైకిల్‌పై మేమిద్దరం డబుల్స్ వెళ్ళేవాళ్ళం. నవ్వులే నవ్వులు. కావలసినంత స్వేచ్ఛ. గత పదిహేనేళ్లుగా తన భర్త సౌదీలో ఉద్యోగం చేస్తూ ఉంటే, తాను ఇక్కడ పిల్లల్ని చదివిస్తూ ఉంది. సైకిల్ నుంచి స్కూటర్‌కు, కార్కు మారింది. మొబిలిటీ మా జీవితాలకు సుఖాన్నిచ్చింది. కష్ట సమయాలలో స్థైర్యాన్నిచ్చింది. అదే మాట్లాడుకుంటూ ఎవరైనా రాజకీయనేత డిగ్రీ అమ్మాయిలకు ఉచితంగా స్కూటీనిచ్చే స్కీమ్ పెడితే బాగుండును, అది వారిలో ఎంతో ధైర్యం నింపుతుంది కదా అనుకున్నాం. బిహార్ ప్రభుత్వం 9వ తరగతి అమ్మాయిలకు సైకిళ్ళ పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టినపుడు దాని ప్రభావాలపై కేంబ్రిడ్జి కోసం పరిశోధన చేసిన కార్తీక్ మురళీధరన్, నిషిత్ ప్రకాష్‌లు కూడా అమ్మాయిల మొబిలిటీ భావితరాల్ని ప్రభావితం చేయబోతోందన్నారు. ఈ ప్రపంచీకరణ సమాజంలో, మొబిలిటీ స్త్రీల పేదరికంపై చూపిస్తున్న ప్రభావం గురించి కూడా అనేక పరిశోధనలు జరిగాయి. పేద స్త్రీలు పనికి నడిచి వెళుతున్నారని, వాహనాలు ఎక్కలేక, పని ప్రదేశాలకు ఆలస్యంగా చేరుతున్నారనీ, దీని వలన వీరికి పేదరికం నుంచి బయటపడే అవకాశాలు తగ్గిపోతున్నాయనీ తెలుస్తున్నది. ప్రస్తుతం నేను నివాసముంటున్న బెంగాల్‌కి, తెలుగు సమాజానికి మధ్య నేను గమనించిన ప్రధానమైన తేడా మొబిలిటీనే. బెంగాల్లో పేద స్త్రీలు సైకిల్ని చాలా ఎక్కువగా వినియోగిస్తారు. మొబిలిటీ నా పరిశీలన మేరకు మన కదలికలనే కాదు, ఆలోచనలను కూడా చలనశీలం చేస్తుంది. మన దేశంలో చాలా సార్లు సర్పంచ్ భర్తలు, తామే సర్పంచులమని చెప్పుకుంటారు. ఉత్తర భారత్‌లో ప్రధాన్ పతి (సర్పంచ్ భర్త) అనే కొత్త పదం కూడా పుట్టింది. బెంగాల్లో సర్పంచుల భర్తలెవరో కూడా ప్రస్తావనకు రాదు. స్త్రీ సాధికారతకు మొబిలిటీకి ఉన్న సంబంధానికి ఇదో ఉదాహరణ. అంతెందుకు చిన్నప్పుడు చరచరా సైకిల్‌పై వీధులన్నీ చుట్టపెట్టేదట మమతా బెనర్జీ. ఆమెని రక్షించే, లేక రక్షిస్తున్న అన్నల గురించి మీరెప్పుడైనా విన్నారా? అందుకేనేమో ఆమె ‘సబూజ్ సాథీ’ పేరిట అమ్మాయిలకు 45 లక్షల సైకిళ్ళు పంపిణీ చేసి, వాహనమే మీ నేస్తం అనే సందేశాన్నిచ్చారు. ఇలా రాజకీయ నేతలు ఇప్పుడు జరుగుతున్న సామాజిక ఉద్యమాల గురించి వారి డిమాండ్ల గురించి తెలుసుకుని ఉంటే బాగుంటుంది కదా. కొంత స్త్రీవాద స్పృహ అలవరచుకొంటే, ఎంతో చురుకుదనం ఉన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ‘‘అన్నలు, చెల్లెళ్లకి మోటార్ బైక్ నడపడం విధిగా నేర్పించండి, చెల్లెళ్లకి హెల్మెట్లు బహుమతులుగా ఇవ్వండి’’ అనేవారేమో. లోపలి లోకాలను తాకే ‘‘సంచారమే ఎంత బాగున్నది’’ పాటలో గోరటి వెంకన్న ‘‘మూలనున్నవి మురిగి పోతున్నవి, సంచరించేవి శక్తితోనున్నవి’’ అంటారు. నిజం! ఇప్పుడు స్త్రీకి కావల్సినది, ఆమెనో మూలన ఉంచి అన్నలిచ్చే రక్ష కాదు. స్వతంత్రతనిచ్చే మొబిలిటీనే. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
గుంటూరు వెస్ట్: స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగమయ్యేలా చూడడంతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా పాటుపడాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ పి.పాండురంగారావు కోరారు. ఆర్థిక అక్షరాస్యత, ఫ్యామిలీ బిజినెస్ ప్లాన్‌పై గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జిల్లా రీసోర్సుపర్సన్లు (డీఆర్పీ), కమ్యూనిటీ ఆర్గనైజర్లకు (సీవో) మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా తరగతులు కలెక్టర్ బంగ్లారోడ్డులోని మహిళా ప్రాంగణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న మెప్మా సిబ్బంది అర్హులైన గ్రూపులకు రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర మిషన్ కోఆర్డినేటర్ ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల గ్రూపులు ఉండగా అందులో 18 లక్షలకుపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని అన్నారు. శిక్షణకు హాజరైన జిల్లా రోసోర్సు పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఇక్కడ బోధించే అంశాలపై పట్టుసాధించి, జిల్లాలకు వెళ్లిన తర్వాత గ్రూపుల వారీ సమావేశాలు నిర్వహించి వ్యాపార ప్రణాళికలపై అవగాహన పెంచాలని కోరారు. ఎపీట్కో టీమ్ లీడర్ డి.శ్రీనివాసరఘు, మిషన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్ రాజ్‌కుమార్, వివిధ జిల్లాల నుంచి సుమారు 45 మంది డీఆర్పీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు కృషి
కమిషన్ సభ్యుల ప్రమాణ æస్వీకారంలో నన్నపనేని రాజకుమారి నగరంపాలెం: స్థానిక వికాస్ నగర్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్ సభ్యులతో శనివారం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ పటిష్టత కోసం 18 మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించిందని ఆర్థిక శాఖ అనుమతి రాగానే వెంటనే నియమిస్తామని తెలిపారు. నలుగురు సభ్యులచే ప్రమాణ స్వీకారం మహిళా కమిషన్ సభ్యులుగా జూలై 12వ తేదీన మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం నియమితులైన ఆరుగురు సభ్యుల్లో డాక్టరు ఎస్ రాజ్యలక్ష్మి(వెస్ట్‌గోదావరి), తమ్మిశెట్టి రమాదేవి(ప్రకాశం), కే శ్రీవాణి(విజయనగరం), ఎన్ ప్రవీణ్బా(అనంతపురం) ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కమిషన్ డైరెక్టర్ ఆర్ సూయజ్, సెక్రటరీ నాజనీస్బాను, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ శ్రీనివాసరావు, పీడీ ఎం నిర్మల, సెక్షన్ ఆఫీసర్ యూ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
చీకటంటే మాకు భయం లేదు
ఎంపవర్మెంట్ ఉద్యోగం చేస్తున్న మహిళలందరి ఇళ్లు నగరం నడిబొడ్డునే ఉండవు. షాపింగ్‌మాల్స్‌లో పనిచేసే సేల్స్‌గాళ్స్ అయితే రాత్రి పది దాటే వరకు పని చేయక తప్పదు. అక్కడి నుంచి బయటపడి బస్టాపుకొచ్చేటప్పటికీ బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి ఉంటుంది. రోడ్లు దాదాపుగా ఖాళీ. అది సంపన్నుల కారు దూసుకువెళ్లడానికి అనువైన వాతావరణమే. కానీ సామాన్యులకు మాత్రం... సాధారణ రవాణా సాధనాలు దొరకని గడ్డు సమయం. ఎదురు చూడగా చూడగా ఓ బస్సు వస్తుంది. ఉద్యోగినులు అందులో మద్యం తాగిన మగవాళ్లతో కలిసి ప్రయాణం చేయాలి. త ర్వాత బస్సు మారాలి, తమ ఏరియా బస్సు వచ్చే వరకు మళ్లీ ఎదురుచూపు. అదీ వస్తుంది. కాలనీలోకి తీసుకెళ్లే బస్సులు అప్పటికే బంద్ అయిపోయుంటాయి. షేర్ ఆటో పట్టుకుని ఇంటికి దగ్గర పాయింట్లో దిగాలి. అక్కడి నుంచి నడక తప్పదు. ఒక సాధారణ మహిళ తన కాళ్ల మీద తాను నిలబడడానికి, ఆర్థిక స్వావలంబన సాధించడానికి, భర్త సంపాదనకు తోడుగా మరికొంత సంపాదించి పిల్లలను ఆరోగ్యంగా పెంచి, చక్కగా చదివించుకోవడానికి చేస్తున్న రోలర్‌కోస్టర్ రైడ్ ఇదంతా. ఇలా ప్రతి నగరంలో కొన్ని వందల మంది యువతులు ఏడాదికి మూడువందల అరవై ఐదు రోజులూ చేస్తున్న పోరాటం. ఈ చక్రం ఎక్కడో గతి తప్పి ఏ అమ్మాయి మీదనో అఘాయిత్యం జరిగితే... పోలీసు పెద్దల నుంచి మంత్రులు, ఎంపీలు వంటి చట్టాల్ని రూపొందించే పెద్దలు కూడా ‘ఆ సమయంలో ఆడపిల్లకు రోడ్డు మీద ఏం పని’ అని అలవాటుగా నోరుజారుతుంటారు. అంతే తప్ప, ‘ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది, అక్కడ ఎన్ని గంటలు పనిచేయించుకుంటున్నారు, లేబర్ చట్టాల ప్రకారం రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళల చేత పని చేయించుకోకూడదనే నిబంధనలేవీ ఆ పెద్దలకు గుర్తుకు రావు, గుర్తు చేసుకోరు. మహిళాసంఘాల వాళ్లు మనసు రగిలి పిడికిళ్లు బిగించినప్పుడు మాత్రం ‘నేనా ఉద్దేశంతో అనలేదు, నాకు నిజానికి మహిళలంటే చాలా గౌరవం’ అంటూ తప్పించుకుంటారు. ఈ కామెంట్ల మాట అటుంచితే, దేశవ్యాప్తంగా ఇప్పుడు మహిళలు రాత్రి పూట పనిచేయడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేసే విషయమై అన్ని రంగాలలోనూ సానుకూల ప్రతి స్పందన లభించడం సంతోషకరమైన సంగతి. కర్ణాటక ప్రభుత్వం అయితే ఆచరణలోకి దిగింది కూడా. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో మహిళలు రాత్రి పూట పని చేయడానికి వెసులుబాటు ఇప్పటికే ఉన్నప్పటికీ అది కూడా ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరడంతో ఇచ్చిన వెసులుబాటే తప్ప, మన ఆడపిల్లలు భద్రంగా ఉద్యోగం చేసుకోవాలనే సంక్షేమభావంతో వచ్చినది కాదు అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు పగటి పని వేళలకే పరిమితం కాలేని మాన్యుఫాక్చరింగ్, బయోటెక్నాలజీ, రీటైల్ రంగాల్లో కూడా స్త్రీలు విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తూ చట్టాలు తీసుకురావడానికి కర్నాటకలో ప్రయత్నాలు మొదలయ్యాయి. లేబల్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ‘షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1961, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948’లలో సవరణలను ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంది. అదే జరిగితే చిన్నపెద్దా అన్నీ కలిపి దాదాపుగా నాలుగు లక్షల వ్యాపార సంస్థలున్న కర్ణాటకలో లక్షలాది మంది మహిళలకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయి. ‘మహిళలకు అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం’ సాధించే పోరాటంలో ఇదో మైలురాయి. మహిళా ఉద్యోగులకు భద్రత, రక్షణ, రవాణా సౌకర్యాలను కల్పించడం ఈ సవరణల్లో ప్రధానంగా ఉంటుంది. దాంతో మహిళలు నైట్‌షిఫ్టుల్లో పని చేసే వాతావరణం ఏర్పడుతుంది. ఇది స్వాగతించాల్సిన ప్రతిపాదన అంటూ బయోకాన్ స్థాపకురాలు కిరణ్మజుందార్ షా వ్యాఖ్యానించారు. -
యువతలో నైపుణ్యం పెంచేందుకు మోదీ కృషి
నెల్లూరు: దేశానికి యువతే ప్రధాన శక్తి అని, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి.. ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆయన నెల్లూరులో జరిగిన స్వర్ణభారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వ్యాఖ్యానించారు. బీజేపీ బలపడేందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడ్పడ్డారన్నారు.