న్యూఢిల్లీ: మన దేశ అటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి మెకానిక్‌లు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి కోసం వారు సాధికారత సాధించాలని సూచించారు. ఆయన ఇటీవల ఢిల్లీ కరోల్ బాగ్‌లోని బైకర్స్ మార్కెట్‌లో మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం విదితమే. మెకానిక్‌లతో కలిసి ఓ బైక్‌ను ఆయన సరీ్వసు కూడా చేశారు. సంబంధిత వీడియోను రాహుల్ ఆదివారం ట్విట్టర్‌లో షేర్ చేశారు.
తనకు కేటీఎం 390 మోటార్ సైకిల్ ఉందని, దాన్ని ఉపయోగించడం లేదని, ఇంట్లోనే పార్క్ చేసి ఉంచానని ఈ వీడియోలో రాహుల్ చెప్పారు. మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని, అందుకే కేటీఎం 390ని ఇంటికే పరిమితం చేశానని వివరించారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ఓ మెకానిక్ ప్రశ్నించగా.. చూద్దాం అంటూ రాహుల్ బదులిచ్చారు. అటోమొబైల్ పురోగతి కోసం మెకానిక్‌లు వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, మెరుగైన వసతులు, ఉత్తమ అవకాశాలు పొందడానికి వారు అన్నివిధాలా అర్హులని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. భారతదేశ అసలైన అభివృద్ధి కారి్మకుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment