విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి రాఖీ కడుతున్న విద్యార్థినులు
సాక్షి, అమరావతి: ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందనే దృఢ విశ్వాసంతో నాలుగేళ్లుగా మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటునిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి కార్యక్రమంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తూ వారికే నేరుగా ప్రయోజనాలను అందజేస్తున్నారు.
విద్య, వైద్యం, ఇళ్లతోపాటు రాజకీయంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేశారు. పిల్లల చదువుల దగ్గర నుంచి పెళ్లిళ్ల వరకు ఒక అన్నగా, తమ్ముడిగా చేదోడు వాదోడుగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు. నవరత్న పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలంతా సీఎం జగన్‌కు ఓ సోదరుడిలా, తోబుట్టువులా తమకు తోడుగా నిలిచారంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
కేవలం నాలుగేళ్ల రెండు నెలల వ్యవధిలోనే అక్క చెల్లెమ్మల ఖాతాలకు రూ.1.64 లక్షల కోట్లను ముఖ్యమంత్రి జగన్ పారదర్శకంగా నగదు బదిలీ చేశారు. ఇక నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో రూ.85 వేల కోట్ల మేర వారికి ప్రయోజనం చేకూర్చారు. తద్వారా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతో అక్క చెల్లెమ్మలు వ్యాపారాల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు. సూపర్ బజార్లను తలదన్నేలా మహిళా మార్టులను నెలకొల్పి రూ.కోట్ల వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే స్థాయికి చేరుకున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అప్పుల్లో ఇప్పటికే రూ,19,178,17 కోట్లను చెల్లించి ముఖ్యమంత్రి జగన్ నిబద్ధత చాటుకున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మోసగించడంతో పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు ఇచ్చే పావలా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు. సీఎం జగన్ మాట ప్రకారం పొదుపు సంఘాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ వారి రుణాలను తీర్చడమే కాకుండా వైఎస్సార్ సున్నా వడ్డీతో దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర చెల్లించి ఆదుకున్నారు. ఆర్థికంగా ఊతమివ్వటమే కాకుండా అక్క చెల్లెమ్మలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు.
వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల సాయంతో రిటైల్ రంగంలో 38 మహిళా మార్ట్స్ ఏర్పాటు కాగా ఇప్పటివరకు రూ.37 కోట్ల మేర విక్రయాలు నమోదయ్యాయి. పొదుపు సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తోంది. రిటైల్, టెక్స్‌టైల్స్, పాడి, ఆహార ఉత్పత్తుల లాంటి వ్యాపారాల కోసం 16 లక్షల మంది మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.5,585 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం ఇప్పించి తోడ్పాటు అందించింది. అక్క చెల్లెమ్మలు వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని జీవనోపాధి మెరుగుపడేలా ఐటీసీ, హెచ్.యు.యల్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, రిలయన్స్, అమూల్ లాంటి వ్యాపార దిగ్గజాలు, బ్యాంకులతో ఒప్పందాలు కుదిర్చి చక్కటి వ్యాపార మార్గాలను సీఎం జగన్ చూపించారు.
మరోపక్క మహిళా రాజకీయ సాధికారత దిశగా గట్టిగా కృషి చేస్తూ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకే కేటాయిస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టాలను చేశారు. మంత్రివర్గంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రతి అక్క చెల్లెమ్మ తమకంటూ సొంత గూడు ఉండాలని కోరుకుంటుంది. రాష్ట్రంలో లక్షల మంది మహిళల సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చే మహత్తర యజ్ఞానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 30,76,675 మందికి రూ.75,670.05 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలిచ్చారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలపై భారం పడకుండా కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన స్థిరాస్తిని ఓ సోదరుడిలా సీఎం జగన్ అందచేశారు.
2019 జూన్ – 2023 జూన్ వరకు మహిళలకు లబ్ధి ఇలా..
పథకం పేరు | లబ్ధిదారుల సంఖ్య | లబ్ధి రూ.కోట్లలో |
జగనన్న అమ్మఒడి | 44,48,865 | 26,067.28 |
జగనన్న వసతి దీవెన | 25,17,245 | 4,275.76 |
జగనన్న విద్యా దీవెన | 26,98,728 | 10,636.67 |
వైఎస్సార్ రైతు భరోసా | 22,00,177 | 13,013.82 |
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు (రైతులు) | 7,38,760 | 183.46 |
వైఎస్సార్ ఉచిత పంట బీమా | 8,21,348 | 1,170.31 |
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ | 5,68,367 | 491.36 |
మత్స్యకార భరోసా | 4,868 | 10.76 |
వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీలు) | 1,05,13,365 | 4,969.04 |
వైఎస్సార్ పెన్షన్ కానుక | 42,28,118 | 49,845.29 |
వైఎస్సార్ చేయూత | 26,39,703 | 14,129.12 |
వైఎస్సార్ ఆసరా | 78,94,169 | 19,178.17 |
వైఎస్సార్ బీమా | 68,172 | 1,026.66 |
వైఎస్సార్ కాపు నేస్తం | 3,56,143 | 1,518.03 |
వైఎస్సార్ నేతన్న నేస్తం | 33,689 | 225.95 |
జగనన్న చేదోడు | 1,84,665 | 404.58 |
వైఎస్సార్ లా నేస్తం | 2,081 | 14.95 |
వైఎస్సార్ వాహన మిత్ర | 30,736 | 87.97 |
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా | 6,25,999 | 388.51 |
ఎంఎస్‌ఎంఈ పునఃప్రారంభం | 14,174 | 1,272.72 |
అర్చకులు, ఇమామ్, మౌజమ్, ఫాస్టర్ల ఒకసారి సాయం | 3,865 | 1.89 |
వైఎస్సార్ ఈబీసీ నేస్తం | 4,39,068 | 1,257.04 |
డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ | 10,41,191 | 3,361.30 |
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదికా తోఫా | 35,931 | 267.20 |
గృహాలు | 21,31,564 | 10,885.91 |
జగనన్న తోడు (వడ్డీ) | 13,83,206 | 64.87 |
నేరుగా నగదు బదిలీ మొత్తం | 4,56,24,187 | 1,64,748.60 |
నగదేతర పథకాల ద్వారా అక్క చెల్లమ్మలకు ప్రయోజనం ఇలా
జగనన్న తోడు (రుణాలు) | 13,83,206 | 2,610.27 |
జగనన్న గోరుముద్ద | 21,63,391 | 1,795.00 |
వైస్సార్ సంపూర్ణ పోషణ | 15,35,390 | 2,992.08 |
జగనన్న విద్యా కానుక | 25,12,423 | 1,784.26 |
ఇంటి స్థలాలు | 30,76,018 | 75,670.05 |
ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ | 3,48,554 | 460.85 |
నగదేతర బదిలీ మొత్తం ప్రయోజనం | 1,10,18,982 | 85,312.51 |
నగదు బదిలీ, నగదేతర బదిలీ మొత్తం | 5,66,43,179 | 2,50,061.11 |
తమ్ముడికి పండుగ శుభాకాంక్షలు..
కూలి పనులకు వెళ్లే నా భర్తకు నెలనెలా పింఛన్ అందుతోంది. కాపు నేస్తం ద్వారా ఏటా రూ.15,000 చొప్పున సాయం అందిస్తూ ముఖ్యమంత్రి జగన్ సొంత తమ్ముడిలా ఆదుకుంటున్నారు. మా మనవళ్ల చదువుకు అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? జగన్ తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు.
– పసుపులేటి పార్వతి, రమణయ్యపేట, కాకినాడ రూరల్
పెద్ద దిక్కులా నిలిచారు..
నా భర్త లింగప్ప పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు కుమారులున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. ఓ తమ్ముడిలా నాకు వృద్ధాప్య పెన్షన్, వైఎస్సార్ చేయూత సాయం అందచేసి మా కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి రాఖీ పండుగ శుభాకాంక్షలు.
– బొగ్గుల లక్ష్మీదేవి, శెట్టూరు, కళ్యాణదుర్గం
అన్నలా రూ.1,46,040 అందించారు..
సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఓ అన్నలా రాఖీ గిఫ్ట్‌గా నాకు రూ.1,46,040 మేర సాయం చేశారు. నాలుగున్నరేళ్లలో పలు పథకాలతో లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా మూడు విడతల్లో రూ.8,830 చొప్పున రూ.26,490 ఇచ్చారు. సున్నా వడ్డీ పథకంతో రూ.3,100 చొప్పున మూడు విడతల్లో రూ.9,300 అందించారు. వైఎస్సార్ చేయూత మూడు విడతల్లో రూ.18,750 చొప్పున మొత్తం రూ.56,250 ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున నాలుగు విడతల్లో రూ.54,000 వేలు అందుకున్నా. జగనన్నకు ప్రతీ అక్కచెల్లెమ్మల ఆశీస్సులు ఉంటాయి. మళ్లీ మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రాఖీ శుభాకాంక్షలు.
– రోంగల రమణమ్మ, చోడవరం.
Comments
Please login to add a commentAdd a comment