సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా? | Manda Krishna Madiga Fire On Cm Kcr Is Anti Dalit Empowerment | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా?

Published Sun, Jun 27 2021 8:14 AM | Last Updated on Sun, Jun 27 2021 9:02 AM

Manda Krishna Madiga Fire On Cm Kcr Is Anti Dalit Empowerment - Sakshi

బౌద్ధనగర్‌ (హైదరాబాద్‌): దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌ దళిత సాధికారతపై మాట్లాడటం పచ్చి మోసమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దళిత సాధికారతపై ఆదివారం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే సమావేశాలు జరపడం, తీర్మానాలు చేయడం కాకుండా వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదన్నారు. దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు సాధికారత గురించి మాట్లాడటం పచ్చిమోసం, నిలువెత్తు నయ వంచనకు ప్రతీక అని పేర్కొన్నారు. 

చదవండి :  Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్‌ ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement