
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జర్నలిస్టు పెన్షన్ స్కీంను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని మహాజన సొషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖరాశారు. సమాజం కోసం పని చేస్తున్న జర్నలిస్టులకు ఆసరాగా ఉండేందుకు పెన్షన్ స్కీం ఇచ్చి ఆదుకోవాలన్నారు.
రైతుబంధు, దళితబంధు తరహాలో కులాలు, మతాల తారతమ్యం లేకుండా జర్నలిస్టుందరికీ జర్నలిస్టు బంధును ప్రవేశపెట్టాలని విన్నవించారు. జీవో 239ను సవరించాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిన్న పత్రికల అప్‌గ్రేడ్ ప్రక్రియను వెంటనే చేపట్టి ఆయా పత్రికల మనుగడను ఆదుకోవాలని మందకృష్ణ విన్నవించారు. అలాగే జర్నలిస్టులందరికీ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలతో పాటు సొసైటీల్లో లేని జర్నలిస్టులకు కూడా ఇళ్లు కేటాయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment