సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోసమే రైతు రుణమాఫీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో రైతులపై పడ్డ వడ్డీని ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవని విమర్శించారు. చేస్తుంది రుణమాఫీనా? వడ్డీ మాఫినా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
మంగళవారం రేవంత్ మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరని, బీఆఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని తెలిపారు
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందని, తమ కమిట్‌మెంట్‌కి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ధామాషా పద్దతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
చదవండి: తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్
బెదిరించే వారు ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే మంచిదని హితవు పలికారు. ఒకరికి మద్దతు ఇచ్చి.. మరొకరిని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఏంటో తెలుసని, రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి మీ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు
బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దేవుడు ఇచ్చిన అన్న కదా.. అయన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడం లేదని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వంపై ఎందుకు ఓత్తిడి తేవడం లేదన్నారు. మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి మీ చిత్తశుద్ధి నిరూపిస్తే కొంతైనా మీకు గౌరవం ఉంటుందని రేవంత్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment