మహిళల అభ్యున్నతే ధ్యేయం
మహిళల అభ్యున్నతే ధ్యేయం
Published Tue, Aug 9 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
గుంటూరు వెస్ట్: స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగమయ్యేలా చూడడంతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా పాటుపడాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ పి.పాండురంగారావు కోరారు. ఆర్థిక అక్షరాస్యత, ఫ్యామిలీ బిజినెస్ ప్లాన్‌పై గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జిల్లా రీసోర్సుపర్సన్లు (డీఆర్పీ), కమ్యూనిటీ ఆర్గనైజర్లకు (సీవో) మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా తరగతులు కలెక్టర్ బంగ్లారోడ్డులోని మహిళా ప్రాంగణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న మెప్మా సిబ్బంది అర్హులైన గ్రూపులకు రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర మిషన్ కోఆర్డినేటర్ ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల గ్రూపులు ఉండగా అందులో 18 లక్షలకుపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని అన్నారు. శిక్షణకు హాజరైన జిల్లా రోసోర్సు పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఇక్కడ బోధించే అంశాలపై పట్టుసాధించి, జిల్లాలకు వెళ్లిన తర్వాత గ్రూపుల వారీ సమావేశాలు నిర్వహించి వ్యాపార ప్రణాళికలపై అవగాహన పెంచాలని కోరారు. ఎపీట్కో టీమ్ లీడర్ డి.శ్రీనివాసరఘు, మిషన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్ రాజ్‌కుమార్, వివిధ జిల్లాల నుంచి సుమారు 45 మంది డీఆర్‌పీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement