సిక్త్స్–జెనరేషన్
పెద్ద వ్యాపార కుటుంబంలో పుట్టింది ఇమాన్ అల్లానా. కుటుంబ వ్యాపారంతో నిమిత్తం లేకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా సొంతంగా విజయం సాధించాలనేది ఆమె కల. ఆరోతరం ఎంటర్‌ప్రెన్యూర్‌గా బ్యూటీ బ్రాండ్ ‘బాలీ గ్లో’తో చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించింది 26 సంవత్సరాల ఇమాన్.
‘సాధించాలనే తపన ఉంటే తెలియని దారులు కూడా పరిచయం అవుతాయి. కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. విజయాలకు దగ్గర చేస్తాయి’ అంటున్న ఇమాన్ అల్లానా గురించి...
బంగారు చెంచాతో పుట్టింది ఇమాన్ అల్లానా. తల్లిదండ్రులు ఇర్ఫాన్, లుబ్నా దుబాయిలో బిలియనీర్‌లు. రీజెంట్స్ యూనివర్శిటీ లండన్‌లో ‘బ్రాండ్ మేనేజ్‌మెంట్’లో మాస్టర్స్ చేసిన ఇమాన్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనను తాను నిరూపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. స్కూలు తరువాత అమ్మానాన్నల ఆఫీసుకు వచ్చేది. అక్కడ తమ వ్యాపారానికి సంబంధించిన ఎన్నో మాటలు వినేది. ముఖ్యమైన మీటింగ్ ఉంటే బడికి బంక్ కొట్టి మరీ ఆ మీటింగ్‌లో పాల్గొనేది. మీటింగ్‌లో జరిగే చర్చలను శ్రద్ధగా వినేది... అలా వ్యాపార విషయాలపై ఇమాన్‌కు చిన్న వయసులోనే ఆసక్తి మొదలైంది.
ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని తపించే ఇమాన్‌కు చిన్న చిన్న ఎడ్యుకేషనల్ కోర్సులు చేయడం అంటే ఇష్టం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించి చిన్న కోర్సులు ఎన్నో చేసింది. ‘సొంతంగా బిజినెస్ స్టార్ చేసి రిస్క్ చేయడం ఎందుకు! మన బిజినెస్ చూసుకుంటే సరి΄ోతుంది’ అని ఇమాన్ తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని,ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారి ప్రోత్సాహ బలంతో ఆరోతరం కుటుంబ సభ్యురాలిగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది ఇమాన్.
బాలీవుడ్, బ్యూటీ మేళవింపుగా వచ్చిన ‘బాలీ గ్లో’ బ్యూటీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే గుర్తింపు సాధించింది. ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు తనదైన ప్రత్యేకత చాటుకుంది. ప్రోడక్ట్‌కు సంబంధించిన ఇన్‌గ్రేడియెంట్స్‌ను ప్రపంచం నలుమూలల నుంచి సేకరిస్తారు. ఇదే సమయంలో పర్యావరణానికి హానికరమైన వాటిని దూరం పెడతారు.
ప్రోడక్ట్‌కు సంబంధించి ‘ది స్టార్ ఇన్ యూ’ ట్యాగ్‌లైన్ హిట్ అయింది. ‘ఇన్నర్ హెల్త్‌కు చర్మం అద్దం పడుతుంది’ అంటున్న ఇమాన్ చర్మసౌందర్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తరచుగా చెబుతుంటుంది.
వ్యాపార పనుల్లో భాగంగా లండన్–దుబాయ్–ముంబై నగరాల మధ్య తిరుగుతూ ఉంటుది ఇమాన్.
ఎంటర్‌ప్రెన్యూర్‌గానే కాదు సామాజిక కార్యకర్తగా... ఇన్వెస్టర్‌గా కూడా రాణిస్తోంది. ‘ఫ్యాషన్ అనేది కళారూపం. సృజనాత్మక వ్యక్తీకరణ’ అంటున్న ఇమాన్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలకు ్రపాధాన్యత ఇస్తుంది.
‘ఇప్పుడు కస్టమర్లు ప్రోడక్ట్ తళుకు బెళులు మాత్రమే చూసి ఓకే చెప్పడం లేదు. ప్రోడక్ట్స్‌కు సంబంధించి ఇన్‌గ్రేడియెంట్స్‌పై కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మా బ్రాండ్ పర్యావరణ హిత, క్రుయాల్టీ–ఫ్రీ ఇన్‌గ్రేడియెంట్స్‌కు ్రపాధాన్యత ఇస్తోంది’ అంటుంది ఇమాన్.
బ్యూటీ ప్రోడక్స్‌పై మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు సంబంధించిన విషయాలపై కూడా దృష్టి పెడుతోంది బాలీ గ్లో.
కష్టఫలం
బిజినెస్ స్కూలులో చదివినంత మాత్రాన, రకరకాల మేనేజ్‌మెంట్ కోర్సులు చేసినంత మాత్రాన ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించలేం. అది పూర్తిగా మన ఆసక్తి, అధ్యయనం, కష్టం, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ అనేది బేబీలాంటిది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
– ఇమాన్ అల్లానా
Comments
Please login to add a commentAdd a comment