
సెప్టెంబర్ 12న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అమల (నటి); ప్రాచీ దేశాయ్ (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన శక్తి, సౌందర్య పోషణ అలవడతాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం తరుగుతూ పెరుగుతూ, ఆలోచనలలో అస్థిరత వల్ల ఒడుదొడుకులు ఉండచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. వీరి పుట్టినతేదీ 12 గురు సంఖ్య కావడం వల్ల విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాల వల్ల లబ్ధి పొందుతారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. మీ మాటకు విలువ వస్తుంది. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: తెలుపు, క్రీమ్, శాండల్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: సోమ, బుధ, గురు; శుక్రవారాలు; సూచనలు: దక్షిణామూర్తికి, శివుడికి అభిషేకం, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మదరసాలలో భోజన సదుపాయాలు కల్పించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్