విజయంతో ముగించారు | South Africa thump SL by 8 wickets to end WT20 campaign on high | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించారు

Published Tue, Mar 29 2016 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

విజయంతో ముగించారు

విజయంతో ముగించారు

శ్రీలంకపై దక్షిణాఫ్రికా గెలుపు
రాణించిన ఆమ్లా
టి20 ప్రపంచకప్

 
న్యూఢిల్లీ:  బౌలర్లు రాణింపు.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ విజృంభణతో టి20 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ముగించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డు ప్లెసిస్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. హషీమ్ ఆమ్లా (52 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది. దిల్షాన్ (40 బంతుల్లో 36; 4 ఫోర్లు; 1 సిక్స్), చండిమాల్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు; 1 సిక్స్) వీరిద్దరు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. అయితే ఫంగిసో వరుస బంతుల్లో చండిమాల్, తిరిమన్నెలను అవుట్ చేయడంతో లంక పతనం ప్రారంభమైంది.  చివర్లో షనక (18 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) పోరాడినా సహకారం కరువైంది. అబాట్, ఫంగిసో, బెహర్డీన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. 
        
దక్షిణాఫ్రికా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. రెండో ఓవర్‌లోనే డి కాక్ (9) రనౌట్ అయినా ఆమ్లా,  డు ప్లెసిస్ (36 బంతుల్లో 31; 3 ఫోర్లు) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు.  రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అటు 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఆమ్లా టి20ల్లోనూ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. చివర్లో మెరిసిన డి విలియర్స్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ భారీ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను విజయంతో ముగించాడు.

 స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (బి) ఫంగిసో 21; దిల్షాన్ ఎల్బీడబ్ల్యు (బి) బెహర్డీన్ 36; తిరిమన్నె (బి) ఫంగిసో 0; సిరివర్దన (రనౌట్) 15; జయసూరియ (సి) డు ప్లెసిస్ (బి) బెహర్డీన్ 1; కపుగెడెర (బి) తాహిర్ 4; పెరీరా (సి) బెహర్డీన్ (బి) స్టెయిన్ 8; షనక నాటౌట్ 20; హెరాత్ (సి) డి కాక్ (బి) అబాట్ 2; వాండర్‌సే (బి) అబాట్ 3; లక్మల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 120.

వికెట్ల పతనం: 1-45, 2-45, 3-75, 4-78, 5-85, 6-85, 7-96, 8-109, 9-120, 10-120.
బౌలింగ్: స్టెయిన్ 4-0-33-1; అబాట్ 3.3-0-14-2; ఫంగిసో 4-0-26-2; తాహిర్ 4-0-18-1; వీస్ 1-0-8-0; బెహర్డీన్ 3-0-15-2.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా నాటౌట్ 56; డి కాక్ (రనౌట్) 9; డు ప్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) లక్మల్ 31; డి విలియర్స్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 122.

వికెట్ల పతనం: 1-15, 2-75. బౌలింగ్: జయసూరియ 1-0-9-0; లక్మల్ 3.4-0-28-1; హెరాత్ 4-0-21-0; వాండర్‌సే 4-0-25-0; షనక 2-0-17-0; పెరీరా 2-0-15-0; సిరివర్ధన 1-0-5-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement