ఆరోగ్యసిరినిచ్చే ఉసిరితో ఆమ్ల క్యాండీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోండి.
ఆమ్ల క్యాండీ తయారీకి కావలసినవి:
►ఉసిరి కాయలు – 250 గ్రాములు
►చక్కెర – 150 గ్రాములు
►జీలకర్ర పొడి– టీ స్పూన్
►శొంఠి పొడి– టీ స్పూన్
►చక్కెర పొడి –2 టీ స్పూన్‌లు
►ఫుడ్ కలర్ – చిటికెడు (ఇష్టమైతేనే).
తయారీ:
►ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి.
►ఒక పాత్రలో వేసి కాయలు మునిగేటట్లు నీటిని పోసి మరిగించాలి.
►నీరు మరిగిన తర్వాత ఉసిరికాయలను వేసి రెండు నిమిషాలు మరిగించిన తర్వాత పాత్రను స్టవ్ మీద నుంచి దించి నీటిని వంపేయాలి.
►ఉసిరికాయలను కట్ చేసి గింజలను తీసివేయాలి.
►ఉసిరి పలుకులలో జీలకర్ర, అల్లం పొడి, చక్కెర వేసి పాత్రకు మూతపెట్టి పక్కన పెట్టాలి.
►మరుసటి రోజుకు చక్కెర కరిగి ఉసిరి పలుకులు చక్కెర ద్రావణంలో తేలుతుంటాయి.
►మూడవ రోజుకు చక్కెర ద్రావణాన్ని ఉసిరి పలుకులు దాదాపుగా పీల్చుకుంటాయి.
►మూడవ రోజు ఉదయం ఉసిరి ముక్కలను ఒక పాలిథిన్ షీట్ మీద వేసి ఆరనివ్వాలి.
►తేమ పూర్తిగా పోవాలంటే రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి.
►తగినంత ఎండ లేకపోతే మూడవరోజు కూడా ఆరబెట్టాల్సి ఉంటుంది.
►చివరగా చక్కెర పొడిలో ఫుడ్ కలర్ కలిపి ఆ పొడిని ఎండిన ఉసిరి పలుకుల మీద చల్లాలి.
వీటిని గాలిచొరని సీసాలో నిల్వ చేసుకుని రోజుకొకటి తినవచ్చు.
ఆరోగ్య లాభాలు
►ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తాయి.
►నోరు రుచిలేనట్లు ఉన్నప్పుడు భోజనానికి గంట ముందు ఒక పలుకు తింటే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి.
►గర్భిణికి కడుపులో వికారం తగ్గిస్తుంది.
చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల
ఇవి కూడా ట్రై చేయండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ
కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా
Comments
Please login to add a commentAdd a comment