సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినా... | Australia power to series victory | Sakshi
Sakshi News home page

సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినా...

Published Thu, Mar 10 2016 10:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినా...

సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినా...

కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. సఫారీలతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో కంగారూ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 179 పరుగుల టార్గెట్ ను ఛేదించి గెలుపు అందుకుంది. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఖాజా 33, వాట్సన్ 42, స్మిత్ 44, వార్నర్ 33, మ్యాక్స్ వెల్ 19 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 2 వికెట్లు తీశాడు. రబడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. చెలరేగి ఆడిన హషిమ్ ఆమ్లా సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 62 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీ20ల్లో అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. సఫారీ టీమ్ ఓడిపోవడంతో ఆమ్లా వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయింది. మిల్లర్ 30, డీ కాక్ 25 పరుగులు చేశారు. ఆమ్లా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వార్నర్' 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement