Twenty20 series
-
పాపం ఎలా ఔటయ్యాడో చూడండి
-
వీడియో వైరల్: ఇలా కూడా ఔటవుతారా!
ఆక్లాండ్: ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ రూపంలో కానీ, బౌల్డ్‌గా కానీ, స్టంపింగ్‌గా కానీ, వికెట్లను తాకి హిట్ అవుట్ కానీ పెవిలియన్ చేరడం మాత్రమే మనం ఇప్పటివరకూ చూసుంటాం. అయితే తాజాగా ఒక ఆటగాడు పెట్టుకున్న హెల్మెట్ తల నుంచి జారిపోయి అవుటైన సందర్భం ఎప్పుడైనా చూశామా.. బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే క్రమంలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్ చాప్మన్ హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్ స్టాన్ లేక్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయే సయమంలో హెల్మెట్ ఊడి కిందపడింది. అది వెళ్లి వికెట్లపై నేరుగా పడటంతో చాప్మన్ భారంగా మైదానాన్ని వీడాడు. ఈ తరహాలో అవుట్ కావడంతో ఇలా కూడా ఔటవుతారా అనుకోవడం ప్రేక్షక్షుల వంతైంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో 244 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచినా...
కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. సఫారీలతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో కంగారూ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 179 పరుగుల టార్గెట్ ను ఛేదించి గెలుపు అందుకుంది. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఖాజా 33, వాట్సన్ 42, స్మిత్ 44, వార్నర్ 33, మ్యాక్స్ వెల్ 19 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 2 వికెట్లు తీశాడు. రబడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. చెలరేగి ఆడిన హషిమ్ ఆమ్లా సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 62 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీ20ల్లో అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. సఫారీ టీమ్ ఓడిపోవడంతో ఆమ్లా వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయింది. మిల్లర్ 30, డీ కాక్ 25 పరుగులు చేశారు. ఆమ్లా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వార్నర్' 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యారు. -
చరిత్ర సృష్టించారు!
మెల్ బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టి20 సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో మిథాలీ రాజ్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచి టైటిల్ గెలిచింది. మూడో మ్యాచ్ ఈ నెల 31న సిడ్నీలో జరుగుతుంది. టాస్ ఓడిపోయి ఇండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. ఆసీస్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. డీఎల్ఎఫ్ విధానంలో భారత్ కు 10 ఓవర్లలో 66 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. 9.1 ఓవర్లలో 69 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మిథాలీ రాజ్ 37, మంధన 22 పరుగులుతో అజేయంగా నిలిచారు. రెండు కీలక వికెట్లు పడగొట్టిన ఝులన్ గోస్వామికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.