ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ రూపంలో కానీ, బౌల్డ్‌గా కానీ, స్టంపింగ్‌గా కానీ, వికెట‍్లను తాకి హిట్ అవుట్ కానీ పెవిలియన్ చేరడం మాత్రమే మనం ఇప్పటివరకూ చూసుంటాం. అయితే తాజాగా ఒక ఆటగాడు పెట్టుకున్న హెల్మెట్ తల నుంచి జారిపోయి అవుటైన సందర్భం ఎప్పుడైనా చూశామా.. బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.