ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన హోరాహోరి టీ20 మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురువగా.. ఈ మ్యాచ్‌ను తిలికించేందుకు వచ్చిన ఓ అభిమానికి కాసుల వర్షం కురిసింది. ఇరు జట్లు 500పైగా పరుగులు నమోదు చేసి అభిమానులను హోరెత్తించగా.. రాస్ టేలర్ సిక్సర్ ఓ అభిమానిని ఏకంగా లక్షాధికారిని చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్‌లో టేలర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ బంతిని స్టాండ్స్‌లో నిల్చోన్న మిచెల్ గ్రిమ్‌స్టోన్ అనే 20 ఏళ్ల యువకుడు ఒంటిచేత్తో పట్టేశాడు. ఈ క్యాచ్‌కు ముగ్ధులైన స్థానిక శీతల పానియాల కంపెనీ ఈ అభిమానికి రూ.24 లక్షలు( 50 వేల న్యూజిలాండ్ డాలర్లను) బహుమతిగా ప్రకటించింది.
Published Sat, Feb 17 2018 7:55 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement