ఆక్లాండ్: ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ రూపంలో కానీ, బౌల్డ్‌గా కానీ, స్టంపింగ్‌గా కానీ, వికెట‍్లను తాకి హిట్ అవుట్ కానీ పెవిలియన్ చేరడం మాత్రమే మనం ఇప్పటివరకూ చూసుంటాం. అయితే తాజాగా ఒక ఆటగాడు పెట్టుకున్న హెల్మెట్ తల నుంచి జారిపోయి అవుటైన సందర్భం ఎప్పుడైనా చూశామా.. బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే క్రమంలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్ చాప్‌మన్ హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్ స్టాన్ లేక్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయే సయమంలో హెల్మెట్ ఊడి కిందపడింది. అది వెళ్లి వికెట్లపై నేరుగా పడటంతో చాప్‌మన్ భారంగా మైదానాన్ని వీడాడు. ఈ తరహాలో అవుట్ కావడంతో ఇలా కూడా ఔటవుతారా అనుకోవడం ప్రేక్షక్షుల వంతైంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో 244 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment