చరిత్ర సృష్టించారు!
మెల్ బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టి20 సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో మిథాలీ రాజ్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచి టైటిల్ గెలిచింది. మూడో మ్యాచ్ ఈ నెల 31న సిడ్నీలో జరుగుతుంది.
టాస్ ఓడిపోయి ఇండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. ఆసీస్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. డీఎల్ఎఫ్ విధానంలో భారత్ కు 10 ఓవర్లలో 66 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. 9.1 ఓవర్లలో 69 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మిథాలీ రాజ్ 37, మంధన 22 పరుగులుతో అజేయంగా నిలిచారు. రెండు కీలక వికెట్లు పడగొట్టిన ఝులన్ గోస్వామికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.