మాంచెస్టర్: సొంతగడ్డపై అదరగొట్టిన ఇంగ్లండ్... దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. నాలుగో రోజు 380 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. ఆమ్లా (83), కెప్టెన్ డు ప్లెసిస్ (61) పోరాడినా లాభం లేకపోయింది.
39 పరుగుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికా చివరి 7 వికెట్లు కోల్పోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ (5/69), అండర్సన్ (3/16) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ గడ్డపై 1998 తర్వాత మొదటిసారి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం సాధించడం విశేషం. 252 పరుగులు చేయడంతో పాటు 25 వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ, 19 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’లుగా నిలిచారు.
ఇంగ్లండ్‌దే టెస్ట్ సిరీస్
Published Tue, Aug 8 2017 12:11 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
Advertisement
Advertisement