కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి. ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను ఉసిరితో తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.
రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది.
చుండ్రుకు ఉసిరి
Published Mon, Dec 9 2019 12:36 AM | Last Updated on Mon, Dec 9 2019 12:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment