hairs
-
బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకల ఉండ!
సాక్షి, హైదరాబాద్: ఆమె 17 ఏళ్ల అమ్మాయి. గత 5 నెలలుగా ఆహారంతో పాటు ఆమె ఏం తింటోందో తెలుసా? తన వెంట్రుకలు..! అదేంటి ఎవరైనా వెంట్రుకలు తింటారా అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఈ విషయం తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అయితే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆ అమ్మాయి అప్పుడప్పుడూ తన వెంట్రుకలు తానే లాక్కుని తినేదని డాక్టర్లు గుర్తించారు. గగన్‌పహాడ్‌కు చెందిన ఎం.పూజితకు కడుపు నొప్పి రావడం, వాంతులు చేసుకుంటుండటంతో మే 31న ఆస్పత్రిలో చేర్పించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా, కడుపులో వెంట్రుకలు ఉండలా పేరుకుపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పర్యవేక్షణలో డాక్టర్ రాణి, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ పావని, డాక్టర్ పాండునాయక్ వైద్య బృందం జూన్ 2న ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. పెద్దపేగు, చిన్నపేగులో 120 సెంటమీటర్ల పొడవు, 2 కేజీల బరువు ఉన్న వెంట్రుకలతో కూడిన ఉండను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు 68 నమోదు కాగా.. రాష్ట్రంలో మొదటిదని చెబుతున్నారు. చదవండి: సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తరహాలో ఫ్యామిలీ పెన్షన్ -
చుండ్రుకు ఉసిరి
కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి. ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను ఉసిరితో తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది. -
వింటర్‌కి విరుగుడు
చలికాలం కురుల సహజత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. వీటికి విరుగుడుగా.. అలొవెరాతో కండిషనర్ షాంపూలు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా రసం జుట్టు్టకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో జుట్టు మెత్తగా, నిగ నిగలాడుతూ ఉంటుంది. అలోవెరా జెల్‌ను రాత్రి పడుకునే ముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. ఉసిరితో మర్దన ఉసిరి, మందార పువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లే సమస్య తగ్గుతుంది. కురుల మృదు త్వం పెరుగుతుంది. బీట్రూట్ థెరపీ బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. -
ఈ వెండి సంతోషానివ్వదు...
సాధారణంగా వెండి రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ కనువిందు చేస్తుంది. కానీ ఈ వెండి రంగు మాత్రం సంతోషాన్నివ్వదు. పైగా బాధను నింపుతుంది. మరికొందరిలోనైతే... ‘‘అప్పుడేనా?... ఈ వయసులోనేనా...?’’ అనే ఫీలింగ్ ఇస్తుంది. అవే వెంట్రుకలు తెల్లబడటం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఏజింగ్‌లో భాగంగా అందరిలోనూ జరిగే ప్రక్రియే. అయితే కొందరిలో అది చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. అలా నెరవడాన్ని ‘బాలనెరుపు’ అంటారు. ఇలా బాలనెరుపు వచ్చేందుకు కారణాలేమిటో, వాటి నివారణ ఎలాగో తెలుసుకుందాం. వెంట్రుకలు తెల్లబడటానికి కారణమిదే... మన వెంట్రుకల మూలాన్ని మనం హెయిర్ ఫాలికిల్ అని పిలుస్తాం. ఈ మూలంలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడప్పుడే తెల్లబడుతున్న వెంట్రుకలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు అక్కడి మెలనోసోమ్స్ అనే చోట్ల తగినంత మెలనిన్ ఉండకపోవడాన్ని డాక్టర్లు గమనిస్తారు. అదే తెల్లవెంట్రుకల విషయానికి వస్తే అక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉండవు. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోవడం ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుందన్నమాట. వాస్తవానికి మనకు 50 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన జుట్టుకు రంగునిచ్చే 50 శాతం పిగ్మెంట్ను కోల్పోతాం. కానీ కొందరిలో ఆ వయసుకు ముందే జుట్టు తెల్లబడుతుంది.నిజానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది పూర్తిగా కాకుండా, ఒక మేరకు పారదర్శకం (ట్రాన్స్లుసెంట్)గా మారుతుంది. అదే నల్లటి వెంట్రుకల నేపథ్యంలో తెల్లగా అనిపిస్తుంటుంది. వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నింటికంటే ప్రధానమైన కారణాలు జన్యుపరమైనవి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి ఆస్కారం ఉంది. ఇలా కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లబడటానికి మరికొన్ని కారణాలు ఇవే... స్వాభావికంగా వెంట్రుకలు నల్లబడాలంటే... ►ఐరన్, జింక్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ►విటమిన్ బి–12 పుష్కలంగా అందేలా తగిన ఆహారం తీసుకోవడం వల్ల వెంట్రుకల నెరుపు తగ్గుతుంది. మాంసాహారులైతే మాంసం, శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతో పాటు, పొట్టుతీయని తృణధాన్యాలు తినాలి. ఇవి తీసుకున్న తర్వాత కూడా మీ ఒంటికి సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం. ∙ క్యాల్షియం పాంటోథనేట్, పాబా అమైన్ సప్లిమెంట్లు తీసుకుంటే తెల్లవెంట్రుకలు తగ్గే అవకాశం ఉంది. ►కరివేపాకు వేసిన మజ్జిగ వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియ మందగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ►ఇక వాతావరణ కాలుష్యాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటూ మంచి స్వాభావికమైన వాతావరణంలో ఉండాలి. ►వ్యాయామం కూడా వెంట్రుకలు నెరిసే ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతో పాటు ఓవరాల్ హెల్త్కూ మంచిది. చికిత్స: హెయిర్ పెప్టైడ్ సీరమ్ వంటి కొన్ని మందులను వాడితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలని గుర్తుంచుకోవాలి. మానసిక ఒత్తిడి కారణంగా... ►మనలో పెరిగే మానసిక ఒత్తిడి వల్ల మన జీవకణాల్లోని కొన్ని పొరలు (సెల్యులార్ స్ట్రక్చరల్ మెంబ్రేన్స్), కొవ్వుపదార్థాలు (లైపిడ్స్), ప్రోటీన్లు, డీఎన్ఏ దెబ్బతిని వెంట్రుక తెల్లబడుతుంది. ►తీవ్రమైన మానసిక ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్, ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్) ►కణంలోని రోగనిరోధక శక్తి తగ్గడం ►థైరాయిడ్ లోపం ►రక్తహీనత (అనీమియా) ►పొగతాగే అలవాటు ►హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి (మన రోమమూలాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంటుంది. ఇది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు కూడా వెంట్రుక తెల్లబడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది). ►వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి. కొన్ని మూలకాల/పోషకాల లోపాలు ►ఐరన్ లోపించడం ►కాపర్ లోపించడం ►జింక్ లోపించడం ►విటమిన్ బి–12, విటమిన్–ఈ, విటమిన్–సి లోపించడం డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వెంట్రుక.. ఒత్తిడి తెలుస్తుందిక
హైదరాబాద్: గోవుల్లో ఒత్తిడిస్థాయిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు పశువుల రక్తం, మూత్రం, మలాన్ని సేకరించి అందులోని హార్మోన్ల పెరుగుదల ఆధారంగా వాటి శారీరకఒత్తిడి తీవ్రతను గుర్తించే పద్ధతిని పాటిస్తుండగా తాజాగా గోవుల వెంట్రుకలను పరీక్షించడం ద్వారా ఒత్తిడిని కచ్చితంగా నిర్ధారించొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ వినోద్‌కుమార్, హిమాచల్‌ప్రదేశ్ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అరవింద్, ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని ప్రొఫెసర్ క్లైవ్ ఈ ప్రయోగాలు చేపట్టారు. దేశంలోని 54 గోశాలల్లో 11 ఏళ్ల వయసుగల 540 ఆవుల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగాలు జరిపారు. పశువుల శారీరక ఒత్తిడికి కారణమైన కాట్రిసోల్ హార్మోన్లు వాటి వెంట్రుకల్లో అధికంగా ఉన్నట్లు ఈ ప్రయోగాల్లో గుర్తించారు. ఒత్తిడికి కారణం జీవన పరిస్థితులే... పశువుల కొట్టాలు, గోశాలలు, ఇతర షెల్టర్లలో పెంచే ఆవులు సాధారణ సమయాల్లో ఉన్నప్పుడు వాటిలో విడుదలయ్యే హార్మోన్లు, ఒత్తిడికి గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్లను అనేకసార్లు పరిశీలించారు. మైదాన ప్రాంతాల్లో ఉండే ఆవులను, షెడ్లలోని పశువుల పరిస్థితులతో పోల్చగా గోశాలల్లో ఉండే వాటిలోనే శారీరక ఒత్తిడి అధికంగా ఉం టోందని తేల్చారు. షెడ్లలో పడుకునేందుకు నేల సరిగా లేకపోవడం, పరిశుభ్రంగా ఉంచకపోవడం, తక్కువస్థలంలో ఎక్కువ పశువులను పెట్టడం, అధిక వయసు వంటి సమస్యల వల్ల గోవుల్లో కాట్రిసోల్ హార్మ న్ అధికంగా విడుదలై అవి ఎక్కువ ఒత్తిడికి గురవుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో కనుగొన్నారు. దేశంలో పశుసంపదను కాపాడాలంటే పశువుల పెంపకం, వాటి రక్షణ విషయంలో మార్పులు జరగాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, మంచి వాతావరణం, శాస్త్రీయ పద్ధతులు పాటించి షెడ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. -
జుట్టుకు ఉసిరి నూనె
ఎండకాలంలో వేడి, దుమ్ముకు శిరోజాల ఆరోగ్యం, అందం దెబ్బ తింటుంది. వెంట్రుక కుదుళ్లకు సరైన పోషణ లభించి, నిగనిగలను కాపాడుకోవాలంటే... ►కొబ్బరి నూనె – ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకొని, మాడుకు పట్టేలా రాసుకోవాలి. వారంలో రెండు సార్లయినా ఈ నూనెను తలకు పట్టించి,. మరుసటి రోజు పొద్దున తలస్నానం చేయాలి. ►పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బి, పాలు పిండి తీయాలి. ఈ పాలను వెంట్రుక కుదుళ్లకు పట్టేలా మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేస్తుంటే వెంట్రుకల మృదుత్వం దెబ్బతినకుండా ఉంటుంది. ►తేనెలో ఆలివ్ ఆయిల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తే వెంట్రుకల సహజసిద్ధమైన నూనెలు కోల్పోకుండా ఉంటాయి. రసాయనాల గాఢత తగ్గి వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►మాడు ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది చుండ్రు. చుండ్రును నియంత్రణలో ఉంచుకోవడానికి ఇంటి చిక్సితలు పాటిస్తూనే చర్మవైద్యులు చెప్పే సూచనలు పాటించాలి. ►పిండి పదార్థాలతో పాటు పీచు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు.. వంటి పోషకాహారాన్ని సమంగా తీసుకోవాలి. ►వేసవిలో 2–3 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలటం సమస్య తగ్గుతుంది. -
పైల్స్ నయమవుతాయా?
నా వయసు 30 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా తరచూ ఈ సమస్య వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. కారణాలు : దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్టర్నల్ పైల్స్. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. ఫిషర్స్ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఫిస్టులా : మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. చికిత్స : జెనెటిక్ కన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు : ►మానసిక ఆందోళన ►థైరాయిడ్ సమస్య ►డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ►వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ►తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ►తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ►సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట...తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ :ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు :మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం వ్యాధినిర్ధారణ పరీక్షలు : యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
జుట్టు.. బొమ్మగా మారేట్టు
కాదేదీ కళకనర్హం అన్నాడు ఓ కవి. దీన్నే ఆదర్శంగా తీసుకున్నాడేమో ఓ కళాకారుడు. వేలాది చిన్న చిన్న వెంట్రుకలను కాన్వాసుగా మలుచుకుని అద్భుతమైన చిత్రరాజాలను రూపొందిస్తున్నాడు కేరళలోని త్రివేండ్రానికి చెందిన మిథున్. ఒక తెల్లటి కాగితంపై వెంట్రుకలను.. చిన్న సూది సాయంతో ఈ బొమ్మలను రూపొందిస్తుంటాడు మి«థున్. అంతేకాదు వీటిని గీసేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. వాటి తయారీ చూస్తుంటే చాలా సులువే కదా అనిపిస్తుంటుంది కానీ అంత ఈజీ ఏం కాదు అంటున్నాడు మి«థున్. అయితే వెంట్రుకలతో బొమ్మలు గీసే ముందు వాటికి కొన్ని రకాల రసాయనాలు పూస్తానని చెబుతున్నాడు. దీంతో బొమ్మలు అనుకున్న విధంగా వస్తాయని పేర్కొంటున్నాడు. బొమ్మ గీయడం అయిపోయాక వాటిని గ్లాస్ ఫ్రేములో బంధించి కలకాలం భద్రపరచుకుంటాడట. -
బోడిగుండుపై వెంట్రుకలు మొలుస్తాయి!
బట్టతలతో చిక్కేమీ ఉండదుగానీ... చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అన్న బెంగే ఎక్కువ. అందుకే బట్టతలకు చికిత్స అంటే చాలు.. చాలామంది వేలకువేలు పోసి నూనెలు కొంటూంటారు. కష్టమైనా.. నొప్పి ఎక్కువ ఉన్నా... హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కూ సిద్ధమవుతూంటారు. ఇకపై ఈ బాదరబందీలేవీ వద్దంటున్నారు ఇండియానా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. శరీరంలో... ఏ కణంగానైనా మారగల సామర్థ్యమున్న మూలకణాలతో తాము పరిశోధనశాలలో వెంట్రుకలతో కూడిన ఎలుక చర్మాన్ని సృష్టించగలిగామని వారు ప్రకటించారు. మూలకణాలతో ఇది సాధ్యమేనని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ వాస్తవంగా చేసి చూపింది మాత్రం వీరే. ప్రొఫెసర్ కార్ల్ కోహ్లెర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల లక్ష్యం బధిరత్వానికి చికిత్స కనుక్కోవడం అయినప్పటికీ ఈ క్రమంలో మూలకణాలు చర్మం తాలూకూ కణాలను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించడంతో బట్టతల సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రత్యేకమైన మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క చర్మపు మొగ్గ (ఇంగ్లీషులో బడ్ అంటారు) అటు చర్మపు పైపొరతో పాటు లోపలి పొర అయిన డెర్మిస్‌ను కూడా సృష్టించగలదని, ఫలితంగా ఎలుకల శరీరంపై జరిగినట్లే వెంట్రుకలు మొలుస్తున్నట్లు వీరు గుర్తించారు. వేర్వేరు రకాల చర్మ కణ కుదుళ్లు (ఫోలికల్స్) తయారవుతూండటం ఇంకో విశేషం. మొత్తం మీద ఈ పద్ధతి బట్టతలకు మాత్రమే కాకుండా.. సూక్ష్మరూపంలో ఉండే అవయవాలను తయారు చేసేందుకూ ఉపయోగించవచ్చునని కోహ్లెర్ వివరించారు. -
కొత్త ఐడియా గురూ!
- వెంట్రుకలతో పందుల బెడద నివారణ - మంగలి షాపుల నుంచి వెంట్రుకలు సేకరణ - రుద్రవరం మండల రైతుల కొత్త ఐడియా రుద్రవరం: పందుల దాడుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పొలం చుట్టూ తంతె(ఇనుప తీగ) చుడుతుండగా మరికొందరు చీరలు చుట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రానురాను పందులు వీటికి అలవాటు పడుతుండడంతో రైతులు కొత్త ఐడియాతో ముందుకెళ్లక తప్పడం లేదు. ఏటా ఒక కొత్త ప్రయోగం ఆచరిస్తుండగా మరుసటి ఏడాది వాటిని పందులు పసిగడుతుండడంతో ఫలితం లేకుండా పోతోంది. అటవీ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరోవైపు వాటిని చంపితే కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నల్లమల అటవీ సమీపాన ఉన్న రుద్రవరం, మరో 11 గ్రామాల రైతులు ఈ ఏడాది వినూత్నంగా ఆలోచించారు. మంగలి షాప్‌లో కటింగ్ చేసిన తర్వాత వచ్చే వెంట్రుకలను తెచ్చి పందులు సంచరించే ప్రాంతాలు, దారుల్లో వెదజల్లుతున్నారు. పంటలపై దాడులు చేస్తే పందులు నిత్యం భూమిని వాసన చూస్తూ వెళ్తుంటాయి. ఆ సమయంలో వాటి ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లి శ్వాసకు ఆటంకం కల్గిస్తాయని రైతులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే పందులు పంటలపై దాడులు చేయలేవని, ఇలా పంటలను కాపాడుకుంటున్నామని పేర్కొంటున్నారు. -
తలనీలాల టెండరు వాయిదా
కర్నూలు(న్యూసిటీ): ఆళ్లగడ్డ మండలం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన తలనీలాల టెండరు కమ్ బహిరంగ వేలం పాటలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం కృష్ణానగర్‌లోని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గురువారం వేలంపాటలు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు కుమ్మక్కై తక్కువ ధరకు పాట పాడారు. గత ఏడాది రూ.1,30,50,000 పలుకగా గురువారం జరిగిన వేలం పాటలో కేవలం రూ.75 లక్షలకు పాడారు. దీంతో అధికారులు టెండర్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయశాఖ కార్యనిర్వహణాధికారులు సి.వెంకటేశ్వర్లు, జి.మల్లికార్జున ప్రసాద్, కృష్ణ, అహోబిలం మఠం అ«ధికారులు లక్ష్మీనారాయణ, ఓబులేష్, శివప్రసాద్, దేవస్థానం సిబ్బంది శివకృష్ణ, ఏఈ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ రఘురామ్, కాంట్రాక్టర్లు వెంకటేశ్వరమ్మ, ఏసీ నరసింహులు, వెంకటేశ్వర్లు, ఎస్.నారాయణ, ఎ.నరసింహులు, సురేష్‌కుమార్, చిన్నరమణగౌడ్, ఎ.రామయ్య, 4వ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్ఐ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలం ఆలయంలో తలనీలాలు దోపీడీ
-
శ్రీశైలంలో తలనీలాల చోరీ
-
శ్రీశైలంలో తలనీలాల చోరీ
శ్రీశైలం: పాతాళగంగరోడ్డు మార్గంలో నిర్మించిన కల్యాణ కట్టలో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దొంగలు పడ్డారు. సుమారు 7 సంచుల తలనీలాల మూటలను దోచుకెళ్లారు. వీటి విలువ రూ. 25లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. కల్యాణ కట్టలో పనిచేసే సిబ్బంది పోలీసుల ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్ ఎస్ఐ వరప్రసాద్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్ ద్వారా పుటేజ్‌లను పరిశీలించగా..ముగ్గురు వ్యక్తులు ముగుసులు ధరించి చోరీకి పాల్పడినట్లు తేలింది. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ చోరీలో కల్యాణకట్టలో పనిచేసే సిబ్బంది హస్తం ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
కాణిపాకం హుండీలో తలనీలాలు చోరీ
-
వెంట్రుకలతో చెట్టును వంచగలమా?
హైదరాబాద్: వెంట్రుకతో చెట్టును సులువుగా వంచేయగలమా..? అంటే ఇది మనిషికి సాధ్యం కాదు. కేవలం ఖడ్గమృగమే చేయగలదు. అది కూడా దాని భారీ శరీరంతో కాదు, దాని ముక్కుపై ఉండే చిన్న కొమ్ముతో! ఖడ్గమృగం కొమ్ము ఇతర జంతువుల్లా ఎముకతోనో, వేరే ప్రత్యేక పదార్థంతోనో కాకుండా వెంట్రుకలతో తయారై ఉంటుంది. అందుకే దాని కొమ్ము ఆవు, జింక వంటి జంతువుల కొమ్ముల్లా పుర్రెకు అతుక్కుని ఉండదు. నిజానికి ఏ జంతువుకైనా వెంట్రుక అనేది మెత్తగా ఉంటుంది. ఖడ్గమృగానికి కూడా అంతే. కాకపోతే ముక్కుపై ఉండే వెంట్రుకలు గట్టిగా నొక్కినట్టుంటాయి. అందుకే ఈ కొమ్ము గట్టిగా ఉంటుంది. ఖడ్గమృగం కొమ్ములో ఉండే వెంట్రుకలు ‘కెరటిన్’ అనే పదార్థంతో తయారవుతాయి. మన జుట్టు, గోళ్లు తయారయ్యేది కూడా కెరటిన్తోనే. అందుకే ఖడ్గమృగం కొమ్ము జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. ఇంత గట్టిగా ఉండే కొమ్ము సాయంతో చిన్న చెట్లను వంచి వాటి ఆకులను తింటుందీ జంతువు. భారతీయ, జావా ఖడ్గమృగాలకు ఒకటే కొమ్ము ఉండగా తెలుపు, నలుపు సుమత్రా ఖడ్గమృగాలకు రెండు కొమ్ములుంటాయి. పూర్వం చైనీయులు వీటి కొమ్ములను జ్వరానికి, విషపు ఆహారానికి, ఇతర జబ్బులకు ఔషధంగా వాడేవారు. నేటికీ దీని కొమ్ముల కోసం మనుషులు వేటాడుతున్నారు. దీంతో ఖడ్గమృగాల సంఖ్య తగ్గిపోతోంది.