శ్రీశైలంలో తలనీలాల చోరీ | Hairs thefting in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో తలనీలాల చోరీ

Published Thu, Nov 17 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

శ్రీశైలంలో తలనీలాల చోరీ

శ్రీశైలంలో తలనీలాల చోరీ

శ్రీశైలం: పాతాళగంగరోడ్డు మార్గంలో నిర్మించిన కల్యాణ కట్టలో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దొంగలు పడ్డారు. సుమారు 7 సంచుల తలనీలాల మూటలను దోచుకెళ్లారు. వీటి విలువ రూ. 25లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. కల్యాణ కట్టలో పనిచేసే సిబ్బంది పోలీసుల ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

దేవస్థానం సీసీ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పుటేజ్‌లను పరిశీలించగా..ముగ్గురు వ్యక్తులు ముగుసులు ధరించి చోరీకి పాల్పడినట్లు తేలింది. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ చోరీలో కల్యాణకట్టలో పనిచేసే సిబ్బంది  హస్తం ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement