కర్నూలు(న్యూసిటీ): ఆళ్లగడ్డ మండలం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన తలనీలాల టెండరు కమ్ బహిరంగ వేలం పాటలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం కృష్ణానగర్‌లోని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గురువారం వేలంపాటలు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు కుమ్మక్కై తక్కువ ధరకు పాట పాడారు. గత ఏడాది రూ.1,30,50,000 పలుకగా గురువారం జరిగిన వేలం పాటలో కేవలం రూ.75 లక్షలకు పాడారు. దీంతో అధికారులు టెండర్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయశాఖ కార్యనిర్వహణాధికారులు సి.వెంకటేశ్వర్లు, జి.మల్లికార్జున ప్రసాద్, కృష్ణ, అహోబిలం మఠం అ«ధికారులు లక్ష్మీనారాయణ, ఓబులేష్, శివప్రసాద్, దేవస్థానం సిబ్బంది శివకృష్ణ, ఏఈ శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ రఘురామ్, కాంట్రాక్టర్లు వెంకటేశ్వరమ్మ, ఏసీ నరసింహులు, వెంకటేశ్వర్లు, ఎస్.నారాయణ, ఎ.నరసింహులు, సురేష్‌కుమార్, చిన్నరమణగౌడ్, ఎ.రామయ్య, 4వ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.