కాదేదీ కళకనర్హం అన్నాడు ఓ కవి. దీన్నే ఆదర్శంగా తీసుకున్నాడేమో ఓ కళాకారుడు. వేలాది చిన్న చిన్న వెంట్రుకలను కాన్వాసుగా మలుచుకుని అద్భుతమైన చిత్రరాజాలను రూపొందిస్తున్నాడు కేరళలోని త్రివేండ్రానికి చెందిన మిథున్. ఒక తెల్లటి కాగితంపై వెంట్రుకలను.. చిన్న సూది సాయంతో ఈ బొమ్మలను రూపొందిస్తుంటాడు మి«థున్. అంతేకాదు వీటిని గీసేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. వాటి తయారీ చూస్తుంటే చాలా సులువే కదా అనిపిస్తుంటుంది కానీ అంత ఈజీ ఏం కాదు అంటున్నాడు మి«థున్. అయితే వెంట్రుకలతో బొమ్మలు గీసే ముందు వాటికి కొన్ని రకాల రసాయనాలు పూస్తానని చెబుతున్నాడు. దీంతో బొమ్మలు అనుకున్న విధంగా వస్తాయని పేర్కొంటున్నాడు. బొమ్మ గీయడం అయిపోయాక వాటిని గ్లాస్ ఫ్రేములో బంధించి కలకాలం భద్రపరచుకుంటాడట.
Comments
Please login to add a commentAdd a comment