ఒక్క పోస్ట్‌... వంద రూపాలు | Kerala Artist's Corona Poster Turns into Political Meme Fest | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క పోస్ట్‌ ఎంత పని చేసిందంటే...

Published Sat, May 2 2020 4:44 PM | Last Updated on Sat, May 2 2020 8:39 PM

 Kerala Artist's Corona Poster Turns into Political Meme Fest - Sakshi

తిరువనంతపురం: కేరళలో ఒక ఆర్టిస్ట్‌ పోస్ట్‌ చేసిన యానిమేటెడ్‌ పోస్ట్‌ రాజకీయంగా వివిధ మలుపులు తిరుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరికి తోచినట్లుగా వారు దాన్ని మార్చుకొంటున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కేరళకు చెందిన ఆశిన్‌మున్ను అనే ఆర్టిస్ట్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వర్షం కురుస్తున్నప్పుడు ఒక​ గొడుగును గట్టిగా పట్టుకొని దాని కింద ఉన్న వారందరిని కాపాడుతున్నట్లు ఒక యానిమేటెడ్‌ పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దానిలో చిన్నపిల్లలు, కరోనా పేషెంట్స్‌, ముసలివాళ్లు, డాక్టర్లు, పోలీసులు అందరూ ఉన్నారు. వారందరిని కేరళ ప్రభుత్వం కాపాడుతుంది అనే ఉద్దేశంతో ఆ మీమ్‌ని తయారు చేశాడు. అయితే దీనిని ఏప్రిల్‌ 17న మున్ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. (జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ)

దీనిని చూసిన కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్‌ ఇదే పోస్టర్‌ని కొన్ని మార్పులతో ఆయన అఫిషియల్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పినరయి విజయన్‌ పైన ప్రధాని మోదీ ఇంకో పెద్దగొడుగుతో అందరిని కాపాడుతున్నట్లుగా ఉన్న మీమ్‌ని ఆయన షేర్‌ చేశారు. ఇలా చేసినందుకు  చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేని ట్రోల్‌ చేశారు. తరువాత ఎవరికి తగ్గట్టుగా వారు దాన్ని మార్చుకుంటూ పోస్ట్‌ చేస్తున్నారు. మరొకరు ప్రతిపక్షనేత రమేష్‌ చెన్నితల.. ప్రధాని మోదీ గొడుగుపైన ఒక టెంట్‌ పట్టుకున్నట్లు మీమ్‌ క్రియేట్‌ చేశారు. ఇప్పుడు ఇవి కేరళ రాజకీయాలలో ఆసక్తి రేపుతున్నాయి.  (మోదీ వీడియో కాన్ఫరెన్స్కు విజయన్ గైర్హాజరు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement