
ఉసిరి టీ తయారీ విధానం.. దీనిని తాగడం వల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Health Tips In Telugu- Amla Tea: కొందరికి రెండు గంటలకోమాటు టీ తాగడం అలవాటు. అయితే మధుమేహం ఉన్నవారు పంచదార వేసిన టీ తాగకూడదు. కానీ టీ అలవాటు ఉన్నవారు టీకి బదులు పంచదార కలపని టీ కోసం ప్రయత్నిస్తుంటారు.
అయితే ఉసిరి టీ తాగితే ఇటు టీ తాగాలన్న కోరిక తీరడంతోపాటు.. విటమిన్ సి, పీచుపదార్థం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఉసిరి టీని ఎలా తయారు చేసుకోవాలంటే...
►రెండు ఉసిరికాయలు, అరంగుళం అల్లం ముక్క తీసుకోవాలి
►ఈ రెండింటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
►గ్లాసు నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి గింజలు తీసేసిన ఉసిరి, అల్లం ముక్కలను దానిలో వేసి మరిగించాలి.
►ఇవి మరిగాక నీళ్లలో అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి స్టవ్ ఆపేసేయాలి.
►ఈ నీళ్ల గిన్నెపై మూతపెట్టి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
►తరువాత వడగట్టి టీలా తాగాలి.
►ఈ టీని రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
బరువు తగ్గొచ్చు!
►ఉసిరి, అల్లం తాజాగా అందుబాటులో లేనప్పుడు.. కప్పు నీళ్లను వేడిచేసి దానిలో స్పూను ఉసిరిపొడి, స్పూను సొంఠి పొడి, అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి.
►ఈ నీళ్లపై మూతపెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి.
►నీళ్లు బాగా మరిగాక దించేసి తాగే వేడికి వచ్చాక వడకట్టకుండా నేరుగా తాగాలి.
►దీనిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు.
చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల..