అమ్మానాన్న ఆట! | Cheekati Rajyam Is A Slick And Beautiful Movie says Amala | Sakshi
Sakshi News home page

అమ్మానాన్న ఆట!

Published Sun, Nov 22 2015 12:38 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

అమ్మానాన్న ఆట! - Sakshi

అమ్మానాన్న ఆట!

ఇటీవలే ‘చీకటిరాజ్యం’లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్‌హాసన్ అప్పుడే మరో కొత్త చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు. ‘అమ్మా నాన్న ఆట’పేరుతో ఓ ఫ్యామలీ రొమాంటిక్ డ్రామా చేయను న్నారు. గతంలో కమల్‌తోనే ‘చాణక్యన్’ (తెలుగులో ‘చాణక్య’) సినిమా చేసిన రాజీవ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న చిత్రంలో అమల అతిథి పాత్ర పోషించనున్నారు. మరో పాత్రను ఒకప్పటి కథానాయిక జరీనా వహాబ్ చేయనున్నారు. అమెరికాలో చిత్రీకరణ జరగనుంది.
 
సినిమా చూసి థ్రిల్లయ్యా! - అమల
‘‘ ‘చీకటిరాజ్యం’ చాలా డిఫరెంట్‌గా ఉంది. సినిమా చూసి థ్రిల్ ఫీలయ్యా’’ అని అమల వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ‘చీకటిరాజ్యం’ థ్యాంక్స్ మీట్ జరిగింది. ఈ  సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ-‘‘పదేళ్లకొకసారి మాత్రమే ఇలాంటి సినిమా చేయడం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజేశ్ ఎం సెల్వా, నటి మధుశాలిని, రచయిత అబ్బూరి రవి, ‘మల్టీ డెమైన్షన్’ వాసు తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement